For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని గురించి మీకు తెలియని కొన్ని నిజాలు..

|

దక్షిణాది రాష్ట్రాల్లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది సమంత. పెళ్లి తర్వాత కూడా సాధారణ అమ్మాయిలా కాకుండా నిత్యం ట్రెండీ ఫ్యాషన్ దుస్తులను ధరిస్తూ.. వాటిని ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్లోనూ షేర్ చేసుకుంటూ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకుంటున్న సమంత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందామా.

Interesting Facts About Actress Samantha Akkineni
 

సమంత 1987లో చెన్నై పట్టణం పల్లవరంలో ఏప్రిల్ 28న నన్నెట్టి ప్రభు, జోసెఫ్ ప్రభు దంపతులకు జన్మించారు. సమంత తండ్రి మళయాళీ. తల్లి కేరళ రాష్ట్రానికి చెందిన ఆమె. పల్లవరంలోనే పుట్టి పెరిగిన సమంత వారి తల్లిదండ్రులకు మూడో సంతానం. ఆమెకు జొనాధన్, డేవిడ్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు.

1) సమంత విద్యాభ్యాసం..

1) సమంత విద్యాభ్యాసం..

సమంత చిన్నప్పటి నుండే చాలా చురుకుగా ఉండేది. ఆమె సెయింట్ స్టీవెన్స్ మెట్రిక్యూలేషన్ స్కూలు, చెన్నై హోలీ ఏంజెల్స్, ఆంగ్లో ఇండియన్ సెకండరీ స్కూళ్లలో చదువుకుంది. తర్వాత చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీ నుండి డిగ్రీ (బీకాం) పట్టా పొందింది. చదువుకునే సమయంలోనే ఆమె డ్యాన్స్ లు చేయడం, అందరితో కలివిడిగా ఉండటం చేసేది.

2) డిగ్రీ సమయంలోనే మోడలింగ్..

2) డిగ్రీ సమయంలోనే మోడలింగ్..

సమంత డిగ్రీ చదువుకునే సమయంలోనే చెన్నైలోని నాయుడు హాల్లో మోడలింగుగా పని చేసింది. అంతకుముందు ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు చిన్న చిన్న ఉద్యోగాలను చేసింది. ఇలా తొలిసారిగా ఆమెకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మరియు డైరెక్టర్ రవి వర్మన్ ఆమెకు సినిమాల్లో అవకాశమిచ్చారు. అప్పుడే ఈ అందాల భామ సినిమాల్లోకి అడుగు పెట్టింది.

3) ఒకేసారి రెండు అవార్డులు..
 

3) ఒకేసారి రెండు అవార్డులు..

గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో విడుదలైన ‘‘ఏ మాయ చేశావే‘‘ చిత్రం ద్వారా సినిమా కెరీర్ ను ప్రారంభించింది. తొలి చిత్రంతోనే 2010లో ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది. 2012లో నందీ అవార్డు సైతం అందుకుంది. ప్రసిద్ధ దక్షిణాది నటి రేవతి తర్వాత ఫిల్మ్ ఫేర్ మరియు నంది అవార్డు అందుకున్న ఏకైక హీరోయిన్ స్టార్ హీరోయిన్ సమంతానే. అంతేకాదు 2014లో విడుదలైన ‘‘అత్తారింటికి దారేది‘‘ సినిమాకు సైమా అవార్డు కూడా లభించింది.

4) ఓ ఫౌండేషన్ ను స్థాపించింది..

4) ఓ ఫౌండేషన్ ను స్థాపించింది..

పేదపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలకు ఆరోగ్య సేవలు అందించేందుకు గాను ‘‘ప్రత్యూష ఫౌండేషన్‘‘ అనే ఎన్ జి ఓని స్థాపించింది. లివ్-లైఫ్ హాస్పిటల్ సహకారంతో ఈమె తన ఆరోగ్య సేవలను కొన్ని ప్రాంతాల్లో అందిస్తోంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో పలుమార్లు తుఫాను, సునామీ వంటివి వచ్చినపుడు బాధితులను ఆదుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి ఆర్థిక సహాయం కూడా చేసింది. అలా తనలో సేవా గుణం అపారంగా ఉందని నిరూపించుకుంది.

5) సమంత మరో పేరు ఏంటంటే..

5) సమంత మరో పేరు ఏంటంటే..

స్టార్ హీరోయిన్ సమంతకు మరో పేరుంది. మనందరికీ సమంత అక్కినేనిగా మాత్రమే తెలుసు. కానీ ఆమెకు మరో పేరుంది. ఆమె ఇంకొక పేరు ఏంటంటే యశోద. ఈ దక్షిణాది భామ సిద్ధార్థ్ తో డేటింగ్ లో ఉన్నప్పుడు ‘‘యశో‘‘ అని పిలిచేవాడు. కానీ సమంత స్నేహితులు మాత్రం సాం అని పిలిచేవారు. ఇప్పుడేమో ఆ పేరులోకి ఇంకో అక్షరం వచ్చి చేరింది. ఆ పేరేంటో ఇప్పటికే మీకు గుర్తు వచ్చింటుంది. అదేనండి ‘‘చైసాం‘‘. చైతన్య పెళ్లి తర్వాత వీరి చైసామ్ గా మారిపోయింది.

6) సమంతకు ప్రేరణగా హాలీవుడ్ హీరో..

సమంతా అక్కినేనికి ప్రేరణగా ఒక హాలీవుడ్ హీరో ఉన్నాడు. అతని పేరేంటంటే ఆడ్రీ హెప్బర్న్ ఆ హీరో అంటే సమంతకు చాలా ఇష్టమట. ఆ హీరో సమంత వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేశాడట.

7) సమంత తొలి సినిమా..

తమిళంలో ఆమె తొలి సినిమా అందరూ అనుకున్నట్టు ‘‘విన్నతాండి వరువాయ‘‘ కాదు. అంతకంటే ముందే ఆమె రవివర్మన్ డైరెక్షన్ లో ‘‘మాస్కో ఇన్ కావేరీ‘‘ అనే సినిమాలో నటించారు. కానీ ఇది ‘‘విన్నతాండి వరువాయ‘‘ సినిమా తరువాత రిలీజ్ అయ్యింది. అందుకే ఆమె తొలి సినిమాను అందరూ ‘‘విన్నతాండి వరువాయ్య‘‘ అని చెబుతుంటారు.

8) సమంతకు ఇష్టమైన పుస్తకం..

రోడా బ్రైన్ రచంచిన ‘‘ద సీక్రెట్‘‘ అనే పుస్తకం సమంతకు చాలా ఇష్టమట. ఈ పుస్తకం లా ఆఫ్ ఫాసినేషన్ మీద ఆధారపడి రచించారు. దీని ప్రకారం మీకు ఇష్టమైన వాటినే మీకు ప్రకృతి ఇస్తుంది. ఈ పుస్తకం ప్రపంచంలో ఏకంగా 19 మిలియన్ కాపీలు అమ్ముడుపోయింది.

9) సమంత మంచి భోజన ప్రియురాలు..

9) సమంత మంచి భోజన ప్రియురాలు..

స్టార్ హీరోయిన్ మంచి భోజన ప్రియురాలు. పచ్చి మాంసం, కూరాగాయలు కలిపి ఉడికించి చేసే జపనీస్ వంటకం సూషీ, మిల్క్ చాక్లెట్, పాలకోవా అంటే సమంతకు చాలా ఇష్టమట.

10) పెళ్లి తర్వాత పలు విమర్శలు..

10) పెళ్లి తర్వాత పలు విమర్శలు..

సమంత, చైతూ పెళ్లి కాక ముందు ఎన్నో రుమార్స్ వచ్చాయి. వాటన్నంటిని పటాపంచలు చేస్తూ 2017 అక్టోబర్ 7న మామ అక్కినేని నాగార్జున సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె తనకు ఎలా ఇష్టముంటే అలానే ఉండేది. దీనిపై పలువురు అసభ్యకర విమర్శలు చేసేవారు. ఇందులో తన మామ నాగార్జున అక్కినేని జోక్యం చేసుకున్నారు. తన కోడలి జోలికి ఎవ్వరు వచ్చినా ఊరుకునేది లేదన్నారు. తమ వ్యక్తిగత జీవితం గురించి తమకు తెలుసని ఘాటుగా స్పందించారు. అలా సమంత అక్కినేనిగా మారి సినిమాలను, పలు కంపెనీలకు ప్రచారకర్తగా, తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గానూ అన్ని రంగాల్లోనూ విజయవంతంగా తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

Read more about: insync pulse samantha
English summary

Interesting Facts About Actress Samantha Akkineni

The Pratyusha Foundation founded the NGO's Why Nothing to Provide Health Services to Poor and Sick Women. In collaboration with Liv-Life Hospital, she provides her health services in some areas. Andhra Pradesh, together with the then Chief Minister Chandrababu Naidu, has also provided financial assistance to the victims of the cyclone and tsunami. In doing so, the service quality is immense.
Story first published: Friday, September 13, 2019, 14:55 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more