For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PV Sindhu:సరికొత్త రికార్డు సాధించిన సింధు.. ఆ ఫీట్ సాధించిన తొలి భారతీయ మహిళ మన తెలుగమ్మాయే...

పివి సింధు గురించి మనం నమ్మలేని నిజాలను గురించి తెలుసుకుందాం.

|

మన తెలుగమ్మాయి పివి సింధు మరో సంచలనం సృష్టించింది.. ఒలింపిక్స్ లో భారతదేశం తరపున వరుసగా రెండోసారి పతకం గెలుచుకున్న తొలి భారత మహిళగా తెలుగమ్మాయి సింధు కొత్త రికార్డు నెలకొల్పింది.

Interesting Facts About PV Sindhu who won bronze medal to create history for India at Tokyo Olympics

PC : Twitter

2016 సంవత్సరంలో రియో ఒలింపిక్స్ లో రజతం గెలుచుకున్న సింధూ.. టోక్యో ఒలింపిక్స్ లోనూ కాంస్య పతకం సాధించి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీతో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖలందరితోనూ ప్రశంసలు అందుకుంటోంది.

Interesting Facts About PV Sindhu who won bronze medal to create history for India at Tokyo Olympics

PC:Twitter

ఆదివారం నాడు కాంస్య పతకం కోసం జరిగిన పోరులో చైనాకు చెందిన హి బింగ్జియావోపై పైచేయి సాధించింది. ఒలింపిక్స్ లో ఇప్పటివరకూ రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రమే రెండు పతకాలను సాధించాడు. 2008 సంవత్సరంలో బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సుశీల్ కుమార్.. 2012 సంవత్సరంలో లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో రజత పతకాన్ని పొందాడు.

Interesting Facts About PV Sindhu who won bronze medal to create history for India at Tokyo Olympics

PC Twitter

ఆనాటి నుండి ఇప్పటివరకు ఏ భారతీయ క్రీడాకారుడు ఈ రికార్డుకు చేరువ కాలేకపోయారు. అయితే తాజాగా మన తెలుగమ్మాయి పివి సింధు వరుసగా రెండోసార్లు మెడల్ సాధించి సుశీల్ కుమార్ సరసన నిలిచింది.

PV Sindhu :మరోసారి సత్తా చాటిన సింధు.. తన సక్సెస్ వెనుక ఎన్ని త్యాగాలున్నాయో తెలుసా...PV Sindhu :మరోసారి సత్తా చాటిన సింధు.. తన సక్సెస్ వెనుక ఎన్ని త్యాగాలున్నాయో తెలుసా...

పసిడి ప్రయత్నం..

పసిడి ప్రయత్నం..

టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనడానికి ముందు పివి సింధు కచ్చితంగా పసిడిని పట్టుకొస్తుందని భారతదేశ ప్రజలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే తొలి దశలో అద్భుతమైన శుభారంభం చేసింది. దీంతో అందరి అంచనాలు మరింత పెరిగాయి. అయితే శనివారం రోజున చైనీస్ తైపీ తై జు యింగ్ చేతిలో వరుస సెట్లలో ఓడిపోయి ఆ అవకాశాన్ని కోల్పోయింది.

కాంస్యంతో మెరిసింది..

కాంస్యంతో మెరిసింది..

ఆ ఓటమి నుండి తేరుకునే సమయం కూడా లేకుండా ఆదివారం నాడు కాంస్య పతకం కోసం మరో చైనీస్ క్రీడాకారిణి హి బింగ్జియావోతో పోరాటానికి సిద్ధమైంది. ఈసారి ఏ మాత్రం తడబడకుండా.. ఓ వైపు ఓటమి కుంగదీస్తున్నా.. దాన్ని అధిగమించి.. కాంస్య పతక పోరులో ఘన విజయం సాధించి భారతీయుల మనసు గెలుచుకుంది.

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో..

ఒలింపిక్స్ లో వరుసగా రెండు పతకాలు సాధించిన పివి సింధు దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసిందని.. దేశవ్యాప్తంగా ప్రముఖులు కొనియాడారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు, మెగాస్టార్ తో పాటు ప్రముఖ సినీ, స్పోర్ట్స్ పివి సింధును ప్రశంసించారు. సింధు సాధించిన విజయం యావత్ భారతావనికే కాకుండా తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని.. భవిష్యత్తులో పివి సింధు మరిన్ని విజయాలు సాధించాలని సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సర్ ప్రైజ్ చేసిన సింధు..

సర్ ప్రైజ్ చేసిన సింధు..

పివి సింధు అటాకింగ్ గేమ్ లో చాలా స్ట్రాంగ్. అయితే డిఫెన్స్ లో మాత్రం కొంత వీక్ గా ఉండేది. దీన్ని కనిపెట్టిన తన కొత్త కోచ్ ఆమె బలహీనతలను అధిగమించేందుకు.. ఆమెకు మెరుగైన శిక్షణ ఇచ్చారు. బ్యాడ్మింటన్ కోర్టులో తను డిఫెన్స్ లో మెరుగయ్యేందుకు ఎదురుగా చురుకుగా ఉండే నలుగురు అబ్బాయిలతో షటిల్ ఏ వైపు వచ్చినా సింధు డిఫెన్స్ చేయడం నేర్పించాడు కోచ్ పార్క్ తే సంగ్.

సత్తా చాటిన సింధు..

సత్తా చాటిన సింధు..

పివి సింధు కాంస్య పతకం గెలుపొందిన తర్వాత కోచ్ పార్క్ తే సంగ్ మాట్లాడుతూ ‘పివి సింధుకి డిఫెన్స్ బలహీనత ఉండేది. కానీ.. అటాకింగ్ లో మాత్రం ఆమెకి తిరుగులేదు. ఈ విషయం ప్రతి ప్లేయర్, కోచ్ కి తెలుసు. అయితే.. హి బింగ్జియావోతో మ్యాచ్ లో 200 శాతం డిఫెన్స్ లో సింధు సత్తా చాటింది. తై జుతో మ్యాచ్ లో మినహా టోక్యో ఒలింపిక్స్ లో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ సింధు డిఫెన్స్ చక్కగా చేసింది' అని చెప్పుకొచ్చాడు.

English summary

Interesting Facts About PV Sindhu who won bronze medal to create history for India at Tokyo Olympics

Here are the Interesting Facts About PV Sindhu who won bronze medal to create history for India at Tokyo Olympics in Telugu. Read on.
Story first published:Monday, August 2, 2021, 17:24 [IST]
Desktop Bottom Promotion