Just In
- 5 hrs ago
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- 7 hrs ago
అత్యాచారానికి పాల్పడిన వారిపై అత్యంత క్రూరమైన శిక్షలు వేసే దేశాలివే..
- 8 hrs ago
మీరు ఎంత టెన్షన్ లో ఉన్నా..వీటిలో ఒక్కటి తినండి చాలు..మీ టెన్షన్ మాయం..!!
- 9 hrs ago
వివాహానికి ముందు ఈ చిట్కాలు పాటించండి... ఒత్తిడికి గుడ్ బై చెప్పండి...
Don't Miss
- News
Disha case encounter: అందుకే ఎన్కౌంటర్ చేయగలిగారు: ఆయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు
- Sports
తొలి టీ20 టీమిండియాదే: కోహ్లీ 94 నాటౌట్, మూడు టీ20ల సిరిస్లో 1-0 ఆధిక్యం
- Finance
కుబేరులనూ వదలని ఆర్థిక మాంద్యం: బిజినెస్ జెట్స్ కు గుడ్ బై!
- Movies
అలాంటి కామెంట్లు పెట్టారో అంతే సంగతి.. వారికి థ్యాంక్స్ చెప్పిన అనసూయ, చిన్మయి
- Technology
5జీ కోసం జియో,ఫ్లిప్కార్ట్,అమెజాన్లతో జట్టుకట్టిన క్వాల్కామ్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
అంతర్జాతీయ కుక్కల దినోత్సవం 2019: కుక్కల చరిత్ర, వేడుకలను ఎలా జరుపుకుంటారో తెలుసా..
కుక్క అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది విశ్వాసం. విశ్వాసానికి మారుపేరు శునకం. వీటికి మరో పేరు కూడా ఉంది. అదే కాలభైరవుడు. ఇవి మన జీవితాలను ఎంతలా ప్రభావితం చేస్తాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఏది ఏమైనా ప్రతి కుక్కకీ ఒకరోజు వస్తుంది. ఇంతకీ ఆరోజు ఏదో తెలుసా. అదే ఆగస్టు 26వ తేదీ. ప్రతి ఏటా ఆరోజున అంతర్జాతీయ కుక్కల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి కుక్కల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

కుక్కల దినోత్సవం ఎప్పుడొచ్చింది..
రెస్క్యూ డాగ్స్ ను సురక్షితమైన, వాత్సల్య వాతావరణం అందించాలనే ఉద్దేశ్యంతో కుక్కల ప్రాముఖ్యతను ఎత్తి చూపడానికి, కుక్కల దత్తత గురించి అవగాహన పెంచేందుకే ఈరోజు వచ్చింది. 2004లో కొలీన్ పైజ్ అనే ఒక రచయిత ఇందుకు బీజం వేశారు. జంతు సంక్షేమ న్యాయవాది అయిన ఈయన నేషనల్ డాగ్ డే, నేషనల్ పెట్ డే, నేషనల్ పప్పీ డే కోసం చాలా కృషి చేశారు.

అంతర్జాతీయ కుక్కల దినోత్సవాన్ని ఇలా జరుపుకుంటారు..
ఇంటర్నేషనల్ డాగ్ డే సందర్భంగా మీ కుక్కతో ఒక మంచి ప్రదేశానికి ప్రయాణించాలి. అలాగే మీ కుక్క సంక్షేమ సంస్థల కోసం వారు నిర్వహించే కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు.

శునకాల వల్ల ప్రయోజనాలివే..
శునకాలకు గ్రామ సింహం అనే మరో పేరు ఉంది. ఇవి గ్రామంలో ఉంటే దొంగలకు చచ్చేంత భయం. అంతేకా టౌన్, సిటీల్లో కూడా కుక్కలకు దొంగలు తెగ భయపడతారు. ఇక మరో రకం శునకాలు ఏకంగా బాంబులను కనిపెట్టడంలోనూ, ఏదైనా హత్య లేదా ఇతర సంఘటనలకు సంబంధించి పోలీసులకు క్లూలు సైతం అందిస్తాయి. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో కింద ఉన్న సందేశాలలో తెలుసుకుందాం.

ఇంటర్నేషనల్ డాగ్ డే మెసెజ్ లు..
మీరు స్కూలుకో లేదా కాలేజీకో లేదా ఆఫీసుకో ఇంకా ఏదైనా వేరేచోటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చాక మీలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపేందుకు ఎదురుచూసే ఏకైక వ్యక్తి మీ శునకం. కుక్కతో కాసేపు ఆడుకోగానే ఉల్లాసం వస్తుంది. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతర్జాతీయ కుక్కల దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు.

శునకాలకు అసూయ అనేదే ఉండదు..
శునకాలకు అసూయ లేదా చెడు అంటే ఏమిటో తెలియదు. కేవలం ప్రేమించడం మాత్రమే తెలుసు. స్నేహపూర్వకంగా ఉండటమే తెలుసు. అందుకే కుక్కలు ఉన్నవారు అదృష్టవంతులు. కానీ ప్రస్తుతం చాలా మందికి తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఏ స్వలాభం లేకుండా ప్రేమించటానికి చాలా బిజీగా ఉన్నారు.అంతర్జాతీయ కుక్కల దినోత్సవం సందర్భంగా మీకు వెచ్చని శుభాకాంక్షలు.

తనకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించేది..
తనకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించేది ఈ గ్రహం మీద ఉన్న ఏకైక జీవి కుక్క మాత్రమే. తన యజమానిపై అతని ప్రేమ పరిస్థితులకు మించినది, మీ దగ్గరి స్నేహితుడైన ఇంత అద్భుతమైన కుక్కను కనుగొనడం అదృష్టం.
అంతర్జాతీయ కుక్కల దినోత్సవ శుభాకాంక్షలు..

మీరు విచారంగా ఉంటే..
మీరు విచారంగా ఉన్నా, మీ జీవితంలో ఆనందాన్ని కోల్పోయినా, నవ్వును సైతం తిరిగి పొందాలన్నా ఒక కుక్కపిల్లను దత్తత తీసుకోండి. మీ చుట్టూ సానుకూల ప్రపంచాన్ని ఏర్పరచుకుని ఆస్వాదిచండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మీపై ప్రేమాభిమానాలు చూపించేది ఆ కుక్కే. అంతర్జాతీయ కుక్కల దినోత్సవ శుభాకాంక్షలు.

సానుకూల శక్తి ప్రారంభించేందుకు..
మీకు బోరింగ్ అనిపించినప్పుడు మీలో సానుకూల శక్తి, ప్రేమతో ప్రారంభించేందుకు మీ శునకాలు మీకెప్పుడు అందుబాటులో ఉంటాయి. మీ బాధలను తొలగించడానికి.. మీ జీవితంలో ఆనందం, ఉత్సాహం నింపేందుకు, మిమ్మల్ని నవ్వించడానికి కూడా సహాయపడతాయి. అంతర్జాతీయ కుక్కల దినోత్సవం సందర్భంగా మీకు అద్భుతమైన శుభాకాంక్షలు ఓ నేస్తమా!

ఓ శునకాన్ని దత్తత తీసుకుందాం..
మనం రోజులో ఎంతో కొంత సమయం పెంపుడు జంతువుతో గడపడానికి వెచ్చించాలి. పెంపుడు జంతువును గట్టిగా కౌగిలించుకోవడం, వాటితో ఆడుకోవడం, వాటి దగ్గర కూర్చోవడం వంటివి చేస్తే అపుడు బలమైన సంబంధం ఏర్పడుతుంది. అదే పెంపుడు జంతువుల మాయాజాలం.
అంతర్జాతీయ కుక్కల దినోత్సవం సందర్భంగా ఓ శునకాన్ని దత్తత తీసుకుందాం. ఎందుకంటే అవి అతి తక్కువ కాలంలోనే మనకు అద్భుతమైన స్నేహితులుగా మారిపోతాయి. అంతేకాదు మీపై అభిమానం, ప్రేమ, శ్రద్ధ ఇస్తాయి. ఈ విశ్వంలో అత్యంత విశ్వసనీయ భాగస్వాములు వీటిని మించి లేవు. కాబట్టి ఈ రోజు నుంచైనా ఒక కుక్కకు ఆశ్రయం ఇద్దాం!!
శునకాలు మనుషులకు ఎప్పటికీ మంచి స్నేహితులు. ఎందుకంటే వాటిలో లోపాలు ఉన్నా కూడా మానవులను ప్రేమించడానికి అవి ఎప్పటికీ సిద్ధంగా ఉంటాయి. చివరిగా అందరికీ అంతర్జాతీయ కుక్కల దినోత్సవం శుభాకాంక్షలు.