For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముగ్గురు పిల్లల తల్లి అయినా ఇసుమంతైనా తగ్గని ఇవాంకా ట్రంప్ అందం...

|

చురకత్తుల్లాంటి చూపులు.. పొడుగు కాళ్లు.. ఆకర్షించే రూపం ఆమె సొంతం.. తన ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందిస్తూనే ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఎక్కువగా హీరోయిన్లలోనూ లేదా మోడల్స్ లోనూ ఉండటం మనం చూశాం.

అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తెకు కథా నాయికలు, మోడల్స్ ను మించిన అందం ఉండటం ఆశ్చర్యకరమనుకుంటే.. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారంట.

ఇవాంకా ట్రంప్ తాజాగా వచ్చిన ఇండియా టూర్ లో తన పిల్లలతో కలిసి తాజ్ మహాల్ ను సందర్శించేంత వరకు ఈ విషయం చాలా మందికి తెలియదట. దీంతో ప్రస్తుతం ఇవాంకా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ విశేషాలంటో తెలుసుకునేందుకు ఈ స్టోరీపై మీరు కూడా ఓ లుక్కేయండి...

తాజ్ మహాల్ అందాలను చూసి పరవశించిపోయిన అగ్రరాజ్య అధినేత ట్రంప్...

స్పెషల్ అట్రాక్షన్..

స్పెషల్ అట్రాక్షన్..

2017 సంవత్సరం ముందు వరకు ఇవాంకా ట్రంప్ అంటే మన దేశంలో ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఆమె ఇండియా టూర్ కు ఎప్పుడైతే వచ్చారో.. అది కూడా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో ఆమె ఎంత స్పెషల్ అట్రాక్షన్ నిలిచారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ట్రంప్ పర్యటనలో..

ట్రంప్ పర్యటనలో..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబంలో అందరి కంటే అందంగా.. స్టైల్ గా కనిపించింది ఎవరంటే అందరూ టక్కున చెప్పే పేరు ఇవాంకా. అంతలా అందరినీ ఆమె తన అందంతో ఆకర్షించింది.

ఇవాంకాను చూడటానికి..

ఇవాంకాను చూడటానికి..

రెండేళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చిన ఇవాంకా ఇండియాకు మరోసారి వస్తున్న విషయం తెలుసుకున్న చాలా మంది ఆమెను చూసేందుకు బారులు తీరారు. లక్షలాది మంది ప్రజలు తమ సెల్ ఫోన్ కెమెరాలలో ఇవాంకాను బంధించారు. ఆమెను నేరుగా చూడలేని వారు ఆన్ లైన్ లో ఆమె కోసం తెగ వెతికారట.

ముచ్చటగా ముగ్గురు..

ముచ్చటగా ముగ్గురు..

అయితే ఇవాంకా పెళ్లి అయ్యిందని.. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, చాలా మందికి తెలీదు. తాజాగా తాజ్ మహల్ పర్యటనలో తన భర్త, పిల్లలతో కలిసి ఫొటోలు దిగేంత వరకు ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే ముగ్గురు పిల్లల తల్లి అయిన ఈ అందాల భామ ఇప్పటికీ ఇంత ఫిట్ నెస్ ఎలా మెయింటెన్ చేస్తుందోనని నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

PC : Twitter

భర్త పిల్లలతో..

భర్త పిల్లలతో..

ఇవాంకా ట్రంప్ ముగ్గురు పిల్లల్లో ఇద్దరు కుమారులు.. ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె పేరు ఎలిజిబెత్ రోజ్(8), కుమారుల పేర్లు జోసెఫ్ (6), మూడేళ్ల థియోడోర్ జేమ్స్.

Image curtosy

స్పెషల్ కేర్...

స్పెషల్ కేర్...

మామూలుగా అయితే మహిళలందరికీ పిల్లలు పుట్టిన తర్వాత పొట్ట పెరగడం లావుగా మారడం వంటివి మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ భామ మాత్రం ప్రెగ్నెన్సీ తర్వాత తన శరీర బరువు పెరగకుండా స్పెషల్ కేర్ తీసుకుందట.

PC : Twitter

హెల్తీ ఫుడ్..

హెల్తీ ఫుడ్..

ఇవాంకా ట్రంప్ (37) మూడు పదుల వయసు దాటినప్పటికీ తను ఇంకా అంత ఫిట్ గా ఉండటానికి కారణం ఏంటంటే తను తీసుకునే హెల్తీ ఫుడ్. క్రమం తప్పకుండా డైట్ పాటిస్తున్నందు వల్లనే ఇవాంకా ఇప్పటికీ తన అందాన్ని, ఆరోగ్యాన్ని పర్ఫెక్ట్ గా మెయింటెన్ చేస్తున్నారు.

ఇంట్లో ఆహారమే..

ఇంట్లో ఆహారమే..

ఇవాంకా ట్రంప్ ప్రతిరోజూ ఇంట్లో వండిన గ్రీన్ సలాడ్, వెజిటేబుల్ సూప్, లీన్ ప్రోటీన్ (చేపలు లేదా చికెన్) మొదలైన వాటిని తన డైట్ లో భాగం చేసుకుంటారట. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కార్బోహైడ్రేట్స్ కు చాలా దూరంగా ఉంటారట. అందువల్లే తన శరీర బరువుకు ఈ వయస్సులోనూ ఇప్పటికీ అదుపులో ఉంచుకుంటున్నారట.

చర్మ సంరక్షణకు..

చర్మ సంరక్షణకు..

అంతేకాదు తన చర్మ సౌందర్యం కోసం కూడా తను ప్రత్యేక చర్యలే తీసుకుంటారట. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాసు నిమ్మరసం తాగుతారట. దీంతో పాటు బ్లూబెరీ వంటి లోఫ్యాట్ ఫుడ్ ను తీసుకుంటారు. అలాగే వీలైనంత ఎక్కువగా నీటిని తాగుతారు.

టీనేజీ యువతిలా...

టీనేజీ యువతిలా...

ఈ డైట్ ని కచ్చితంగా ఫాలో అవుతారు కాబట్టి ఇవాంకా ట్రంప్ ఇప్పటికీ టీనేజీ యువతిలా కనిపిస్తుంది. అందరినీ అమాంతం ఆకర్షిస్తోంది. అంతేకాదండోయ్ ఇవాంకా వేసుకునే డ్రస్సులు కూడా ముగ్ధమనోహరంగా ఉంటాయి. అదిరిపోయే డ్రెస్సులతో ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటుంది. దీని వల్లే ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది.

PC : Twitter

English summary

Ivanka Trump with her children show what she's really like as a mother

Here we talking about ivanka trump with her children show what she's really like as a mother. Read on
Desktop Bottom Promotion