For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019లో ద్వాదశ రాశులకు గురు గ్రహం అనుకూలమా.. వ్యతిరేకమా..

|

గురును బృహస్పతి అని కూడా పిలుస్తారు. ఒక ప్రయోజన గ్రహం మరియు దేవతల గురువు. పురాణాల ప్రకారం బ్రహ్మచరిత, చరితదేవి దంపతుల కుమారుడైన అంగిరాస్ కు గురుదేవుడు జన్మించాడు. గురు (బృహస్పతి) గ్రహం ద్వాదశ చక్రాలను తిరిగి రావడానికి పుష్కర కాలం పన్నెండు సంవత్సరాలు పడుతుంది. ప్రతి రాశిలో ఒక సంవత్సరం పాటు ఈ రాశి ఉంటుంది. ఇది ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని లేదా కదలికను గురుపెయార్చి అంటారు.

Jupiter Transit
 

గురుపెయార్చి 2019 వల్ల ప్రయోజనాలివే..

లగ్నము నుండి 4, 7, 10వ స్థానాల్లో గురు ఉంటే, ఆ వ్యక్తికి సంపద పెరుగుతుందని, ధనలక్ష్మీ ఇంట్లో నివసిస్తుందని చెబుతారు. 12వ స్థానాన్ని కూడా గురు గరిష్ట స్థానం అని అంటారు. దీనివల్ల జాతక సంపన్న జీవితం లభిస్తుంది. వివాహం, పిల్లలు, అదృష్టం, సంపద, మొదలైన వాటికి గురువు బాధ్యత వహిస్తాడు. గురువు ఉన్నతమైన లేదా సొంత ఇంట్లో మంచి స్థితిలో ఉంటే, స్థానికుడు ప్రభావవంతమైన వ్యక్తి అవుతాడు. అన్ని ప్రయోజనాలు మరియు ఆనందాన్ని పొందుతాడు. వారు అసాధ్యమైన పనులను సాధ్యమైన రీతిలో చేస్తారు. ఒకవేళ గురు బలంగా లేకపోతే, వారు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ద్రవ్య పరిస్థితులు అస్థిరంగా ఉంటాయి మరియు వారి జీవితంలో అడ్డంకులు కనిపిస్తాయి. ధనస్సు రాశి మరియు మీన రాశులకు గురు ప్రభువు. సూర్య మరియు చంద్రులను మినహాయించి మిగతా గ్రహాలన్నీ రెండు రాశులకు ప్రభువులే.

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరైనా జీవితంలో సంతోషంగా ఉండాలన్నా, లేదా ప్రశాంతంగా జీవించాలన్న, విజయాలు సాధించాలన్నా, ఆర్థికంగా బలపడాలన్నా గురువు అనుగ్రహం చాలా అవసరం. ఇక గురు గ్రహం గురించి ఇప్పుడు టాపిక్ ఎందుకు వచ్చిందంటే మార్చి 2019 ఉదయం 3.11 గంటలకు గురుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. ఈ విషయం అందిరికీ తెలిసిందే. తర్వాత ఏప్రిల్ 14, 2019న 5.55 గంటలకు అదే గురుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల ద్వాదశ రాశులపై గురుడి ప్రభావం పడనుంది. ఇాదంతా బాగానే ఉన్నా గురుడు ఇప్పటికే వృశ్చికరాశి ప్రవేశించి ఉన్నాడని, రేపు అనగా ఆగస్టు 29వ తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

Jupiter Transit
 

ఏయే రాశి వారిపై గురుడి ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం..

మేష రాశిపై గురుడి ప్రభావం అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారు వృత్తిపరంగా మంచి పేరు తెచ్చుకుంటారు. సమాజంలో కూడా వీరికి మంచి గుర్తింపు వస్తుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే అవకాశాలున్నాయి. వెళితే మంచిదని శాస్త్రం చెబుతుంది.

వృషభరాశిలో గురుడు 8వ స్థానంలో ఉంటాడు. వీరు కూడా వృత్తిపరంగా ఎదుగతారు. ఈ రాశి వారు ప్రయత్నాలు ఎన్ని చేసినా నిరాశ చెందే అవకాశముంది. మీ ఆరోగ్యంపైనా ప్రభావం పడనుంది.

మిథునరాశిపై గురు గ్రహం ఏడో స్థానంలో ఉండి అనుకూల ప్రభావం ఉంటుంది. ఈ రాశి వారు వ్యాపారంలో లేదా షేర్ మార్కెట్లో మీరు పెట్టే పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి.

కర్కాటక రాశిపై గురుడు వ్యతిరేక ప్రభావం చూపుతాడు. ఇక్కడ గురువు ఆరో స్థానంలో ఉంటారు. ఈ రాశివారు కొంత అనారోగ్యానికు గురయ్యే అవకాశం ఉంది. మానసికంగానూ, శారీరకంగానూ ఈ రాశి వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అరటి చెట్టుకు పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

సింహరాశిలో గురుడు ఐదో స్థానంలో ఉంటారు. దీంతో ఈ రాశివారు ఆర్థికంగా బలపడతారు. వారు ఉండే రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. దీనివల్ల సమాజంలో కూడా వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కన్యరాశిలో గురువు నాలుగో స్థానంలో ఉంటాడు. ఈ రాశివారిపై గురుడి ప్రభావం ఉంటుంది. మీరు నమ్మే వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు. మీ భావోద్వేగాలను దెబ్బ తీస్తారు. ఈ రాశి వారు ప్రపంచానికి దూరంగా, ప్రశాంతంగా, శాంతియుతంగా జీవితం గడపాలని భావిస్తారు.

తులరాశిలో గురుడు మూడో స్థానంలో ఉంటాడు. వీరి పనులు రీత్యా నివసించే ప్రాంతం మారాల్సి ఉంటుంది. మీరు పసుపు లేదంటే లేదా చపాతీలు ఏదైనా సరే ఆవుకు హారంగా పెడితే మంచింది.

వృశ్చికంపై గురుడు రెండో స్థానంలో ఉంటాడు. ఈ రాశిపైనా గురుగ్రహం ఉంటుంది. ఈ రాశి వారికి ఎక్కువగా అదృష్టం వరిస్తుంది. మీకు అన్ని విషయాల్లో కుటుంబం అండగా ఉంటుంది.

ధనస్సు రాశిలో ప్రథమ స్థానంలో ఉంటాడు. దీంతో ఈ రాశివారిపై అనుకూల ప్రభావం ఉంటుంది. వైవాహిక జీవితంలో, ప్రేమ విషయంలో సంతోషంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మకరరాశిపై గురుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశివారు ఆధ్యాత్మికత క్షేత్రాలకు వెళ్తే మంచింది. గురుడు పదకొండో స్థానంలో ఉంటాడు.

మీనరాశిపై గురుడు ప్రభావం చూపుతాడు. ఈ రాశి కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాశి వారు కూడా కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.

English summary

Jupiter Transit 2019 effects on each zodiac signs

According to astrology, the blessing of a teacher is essential for someone to be happy in life, to live peacefully, to achieve success and to be financially strong. Why is the topic of the planet Guru now? The matter is known to all. Later on April 14, 2019, at 5.55 pm, the same Jupiter will enter the Taurus. As a result, Guru's influence on the dualistic constellations.
Story first published: Wednesday, August 28, 2019, 18:36 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more