For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Guru Rashi Parivartan 2021:గురుడు కుంభంలోకి ఆగమనం.. రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...!

2021లో గురుడు కుంభ రాశిలోకి సంచారం చేసే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

Guru Rashi Parivartan 2021 Effects in Telugu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలలో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉందని పండితులు చెబుతారు. గురుడు(బృహస్పతి) మంచి స్థానంలో ఉంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి.

Jupiter Transit in Aquarius Guru Rashi Parivartan 2021: Effects on 12 Zodiac Signs and Remedies in Telugu

గురుడు ఒక రాశిలో సుమారు ఒక సంవత్సరం నివాసం ఉంటాడు. ఈ కారణంగా గురుని సంచార ప్రభావాలు ఏడాది పొడవునా రాశిచక్రాలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి.

Jupiter Transit in Aquarius Guru Rashi Parivartan 2021: Effects on 12 Zodiac Signs and Remedies in Telugu

ఈ నేపథ్యంలో 2021 సంవత్సరంలో నవంబర్ 20వ తేదీన ఉదయం 11:23 గంటలకు మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ద్వాదశ రాశుల ఎలాంటి పరిహారాలను పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

12 రాశుల వారు బ్రేకప్ బాధ నుండి ఎలా బయటపడతారంటే...!12 రాశుల వారు బ్రేకప్ బాధ నుండి ఎలా బయటపడతారంటే...!

మేష రాశి..

మేష రాశి..

గురుడి రవాణా కారణంగా.. ఈ రాశి వారి వైవాహిక జీవితంలో శృంగార పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయాన్ని మీరు బాగా ఆస్వాదిస్తారు. మరోవైపు ఈ కాలంలో మీరు సోమరితనాన్ని వదులుకోవాలి. రాబోయే సంవత్సరం పాటు మీకు సానుకూల ఫలితాలు రానున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

పరిహారం : ఆవుకు ఏదైనా ఆహారం తినిపించడం వల్ల మంచి ఫలితాలు రానున్నాయి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి గురుడి సంచారం వల్ల ప్రత్యేక ఫలితాలేమీ ఉండవు. ఈ కాలంలో మీరు కొత్త పనులు ప్రారంభించకూడదు. వీలైనంత మేరకు ప్రయాణాలకు కూడా దూరంగా ఉండాలి. మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ సమయం మీకు వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా అజాగ్రత్తగా ఉండొద్దు. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

పరిహారం : ప్రతిరోజూ నుదుటిపై తిలకం లేదా కుంకుమ పెట్టుకుంటే శుభ పలితాలు వస్తాయి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి గురుడి రవాణా కారణంగా రాబోయే సంవత్సరం పాటు సానుకూలంగా ఉంటుంది. పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. మీరు కెరీర్లో ముందుకు సాగేందుకు సరైన మార్గాన్ని పొందుతారు. మానసికంగా మీరు చాలా మంచి అవకాశాలను పొందుతారు. మీరు దూర ప్రయాణాలు చేయొచ్చు. వాటి నుండి కూడా మీరు మంచి లాభాలను పొందుతారు. మీ భవిష్యత్ ప్రణాళిక పరంగా ఈ సమయం చాలా ముఖ్యమైనది.

పరిహారం : గురు మంత్రం ‘ఓం గ్రాన్ గ్రిం గ్రౌన్ సహ గురవే నమః'జపించండి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి గురుడి సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. మీరు మీ భాగస్వామి ప్రవర్తనను చూసి అసూయపడొచ్చు. ఈ కాలంలో మీరు మోసపోవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ అత్తమామలతో విభేదాలు ఉండొచ్చు. మీరు మీ సమయాన్ని మతపరమైన కార్యకలాపాలు మరియు ఆధ్యాత్మికతతో గడపాలి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : తెల్లని రంగులో ఉండే ఆవుకి తిలకం దిద్ది.. ఏదైనా ఆహారం తినిపించండి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి గురుడు కుంభంలోకి ప్రవేశించే సమయంలో శుభప్రదమైన ఫలితాలు రావొచ్చు. ఈ సమయం వివాహితులకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు ప్రతి ప్రయత్నంలో మీ జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. మీ నిలిచిపోయిన పని కూడా పూర్తవుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోరు. ఉద్యోగులు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి.

పరిహారం : ప్రతి గురువారం రావి చెట్టును తాకకుండా నీటిని సమర్పించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి గురుడి సంచారం వల్ల ప్రత్యేక ఫలితాలు ఉండవు. మీరు చేసే పనిలో ఆటంకాలు రావొచ్చు. ఉద్యోగులు ఉద్యోగం మారాలనే ఆలోచనలో ఉంటే, ఇందులో కూడా సమస్యలు ఎదురవ్వచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ విషయాలను నియంత్రణలో ఉంచుకోవాలి. అనవసరంగా ఖర్చులు కూడా పెరగొచ్చు. ఈ సమయం మీకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు ఓపికగా ఉండాలి.

పరిహారం : ఆవుకు బెల్లం, గోధుమలు నైవేద్యంగా పెడితే శుభ ఫలితాలొస్తాయి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారికి గురుడి సంచారం కారణంగా ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, మీ జీవితంలోకి ప్రత్యేకంగా ఎవరైనా ప్రవేశించొచ్చు. ఈ సంబంధం తర్వాత వివాహానికి దారి తీస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగవుతుందది. మీ పాత ప్రాజెక్టును పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించొచ్చు. ఆరోగ్య పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : గురుడి అనుగ్రహం కోసం బీజ్ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి గురుడి రవాణా వల్ల ఖర్చులు విపరీతంగా పెరగొచ్చు. ఈ సమయంలో మీరు ఆదాయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు. మీరు మీ వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ వహించాలి. పిల్లలు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రాబోయే కాలంలో మీ ఇంటి మరమ్మత్తు పనిని పూర్తి చేయొచ్చు.

పరిహారం : గురుడి అనుగ్రహం కోసం చూపుడు వేలికి మెరుగైన నాణ్యమైన నీలమణి రత్నాన్ని ధరించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి గురుడి రవాణా వల్ల మంచి ప్రయోజనం లభిస్తుంది. మీరు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయొచ్చు. ఇది మీకు ఫలప్రదంగా ఉంటుంది. అవివాహితులు ఈ కాలంలో వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే ఈ కాలంలో శుభవార్తలు వింటారు. మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. మీ కుటుంబంతో అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

పరిహారం : గురువారం రోజున బ్రాహ్మాణులకు భోజనం పెడితే మంచిది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు గురుడి రవాణా సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రాబోయే కాలంలో మీరు సానుకూలతతో నిండి ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఏదైనా రంగంతో సంబంధం కలిగి ఉంటే.. ఎలాంటి రిస్కులు తీసుకోకుండా ఉండాలి. పెట్టుబడికి ఇది అనుకూల సమయం. అయితే మీరు నిపుణులు లేదా అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవాలి. మీ కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది.

పరిహారం : ప్రతి గురువారం మీకు సాధ్యమైనంత మేరకు పసుపు బియ్యం తయారు చేసి ప్రజలకు పంచాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు గురుడు సంచారం సమయంలో మంచి ప్రయోజనాలను పొందొచ్చు. వ్యక్తిగత జీవిత పరంగా ఈ సమయం మీకు చాలా బాగుంటుంది. మీరు కొత్త ప్రాజెక్టులో ప్రారంభించొచ్చు. త్వరలో అవివాహితులకు వివాహం జరగొచ్చు. ఉద్యోగం మారాలనుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారులు తమ పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ప్రతిరోజూ కుంకుమను నుదుటిపై రాయడం వల్ల శుభ ఫలితాలు పొందొచ్చు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి గురుడి రవాణా వల్ల కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతుంది. కొన్ని సందర్భాల్లో రుణాలు తీసుకోవడానికి దారి తీయొచ్చు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. శత్రువులు మీపై ఆధిపత్యం చేయొచ్చు. ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది.

పరిహారం : ప్రతి గురువారం తప్పనిసరిగా ఆలయాన్ని సందర్శించాలి.

FAQ's
  • 2021లో గురుడు కుంభరాశిలోకి ఎప్పుడు ప్రవేశించనున్నాడు?

    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలలో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉందని పండితులు చెబుతారు. 2021 సంవత్సరంలో నవంబర్ 20వ తేదీన ఉదయం 11:23 గంటలకు మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు.

  • గురుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారేందుకు పట్టే సమయం ఎంత?

    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలలో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉందని పండితులు చెబుతారు. గురుడు(బృహస్పతి) మంచి స్థానంలో ఉంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. గురుడు ఒక రాశిలో సుమారు ఒక సంవత్సరం నివాసం ఉంటాడు. ఈ కారణంగా గురుని సంచార ప్రభావాలు ఏడాది పొడవునా రాశిచక్రాలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి.

  • 2022లో గురుడు ఏ రాశిలోకి ప్రవేశించనున్నాడు?

    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గురుడు 2021లో కుంభ రాశిలోకి ప్రవేశించనుండగా.. 2022లో మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. అది కూడా సరిగ్గా సంవత్సరం తర్వాత గురుడు మీన రాశిలోకి రవాణా చేయనున్నాడు.

English summary

Jupiter Transit in Aquarius Guru Rashi Parivartan 2021: Effects on 12 Zodiac Signs and Remedies in Telugu

Jupiter Transit in Aquarius Guru Rashi Parivartan November 2021 on 20th November. Check out Guru Rashi Parivartan horoscope, Effects and Remedies for 12 zodiac signs in Telugu
Desktop Bottom Promotion