For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ketu Transit 2020:కేతు గ్రహ మార్పులతో కేవలం 2 రెండు రాశులకే లాభమా?

|

ప్రస్తుతం కరోనా వైరస్ అనే భయంకరమైన మహమ్మారి వల్ల ప్రపంచమంతా తల్లకిందులుగా మారిపోయింది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దీనంతటికి రాహువు వైరస్ కారణమని కొందరు పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేతు గ్రహం తన స్థానం మారబోతోంది. ఈ కేతు గ్రహానికి ఎలాంటి అస్తిత్వం అనేది లేదు. అందుకే దీనిని ''షాడో గ్రహం'' అని కూడా అంటారు. అది ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 23వ తేదీ ఉదయం 8:20 గంటలకు జరగనుంది.

Ketu Transit 2020: Effects on your Zodiac Sign

ఈ కేతు గ్రహ సంచారం లాభదాయకంగా ఉంటే ద్వాదశ రాశుల వారు ధనవంతులుగా మారిపోతారా? కేతు గ్రహ మార్పు వల్ల సంపద అమాంతం పెరిగిపోతుందా? లేదా కరోనా వైరస్ మాదిరిగానే మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుందా? అనే విషయాలతో పాటు కేతు సంచార ప్రభావం మేష రాశి నుండి మీన రాశి వరకు ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ 4 రాశుల వారు అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తారట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!

మేష రాశి..

మేష రాశి..

ఇప్పటికే కరోనా వైరస్ వల్ల మీ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. కేతు సంచారం 2020 వల్ల మీకు మతపరమైన ప్రయాణాలు చేసేందుకు అవకాశాలు లభిస్తాయి. కేతు గ్రహం తొమ్మిదో స్థానంలో ఉన్న సమయంలో ఆహార అలవాట్లపై నియంత్రణ కలిగి ఉండాలి. మీ పూర్వీకుల ఆస్తి నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. మీరు భూమి, ఆస్తిపై పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి. ఆర్థిక పరమైన సమస్యలను అధిగమించేందుకు ఖర్చులను నియంత్రించాలి.

పరిహారం : మంగళవారం నాడు ఏదైనా దేవాలయంపై ఎరుపురంగు జెండా ఎగురవేయాలి. వీధి కుక్కలకు బ్రెడ్డును ఆహారంగా అందించాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

కేతు గ్రహం ఎనిమిదో స్థానంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా మీరు మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పరిశోధనా రంగం కూడా మిమ్మల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. అయితే సెప్టెంబరులో కేతు సంచారం కారణంగా మీ వివాహ జీవితంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఈ కాలంలో ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. ఈ సమయం ఇతరులకు రుణాలు ఇవ్వకూడదు.

పరిహారం : ప్రతిరోజూ గణపతి స్తోత్రమును పఠించాలి. మల్టీ కలర్స్ దుప్పట్లను పేదవారికి దానం చేయాలి.

మిధున రాశి..

మిధున రాశి..

కేతు గ్రహం మీ చంద్ర ఆధారిత రాశి ప్రకారం ఏడో స్థానంలో నివసించబోతున్నాడు. దీని వల్ల మీ వైవాహిక జీవితంలో సమస్యలు పెరగొచ్చు. ఆర్థిక పరంగా అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడుల బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగులు ట్రాన్స్ ఫర్ కూడాకావచ్చు. అయితే విద్య మరియు ఇతర పనుల్లో మీరు ఆశించిన ఫలితాలను పొందడానికి అదనపు ప్రయత్నాలు చేయాలి.

పరిహారం : అశ్వగంధ వేరును ధరించాలి. వినాయకుడిని పూజించాలి.

మీ రాశిని బట్టి ఏ వయసులో మీరు వివాహం చేసుకోవాలో తెలుసుకోండి...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

కేతు గ్రహం మీ ఇంట్లో ఆరో స్థానంలో ఉంటాడు. దీని కారణంగా మీ శత్రువులు మీకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తారు. సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బ తీస్తారు. విద్యార్థులు చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అయితే మీరు మంచి మనసుతో పనులు చేస్తే, కేతువు అన్ని విషయాలపై సానుకూల ప్రభావం చూపుతాడు.

పరిహారం : 9 ముఖాలుండే రుద్రాక్షను ధరించి ‘ఓం హ్రీం హుం నమః‘ అనే మంత్రాన్ని నిత్యం పఠించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

కేతు గ్రహ సంచారం 2020 ప్రకారం ఈసారి ఐదో స్థానంలో ఉంటుంది. దీని వల్ల మీ మనసు గందరగోళంగా ఉంటుంది. ప్రతి విషయంలో మీరు కలవరపడతారు. అయితే మీ జీవన నాణ్యత పెరుగుతుంది. మీరు అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యుల ప్రాథమిక అవసరాలను సులభంగా తీర్చేస్తారు.

పరిహారం : నాలుగు అరటిపండ్లను హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించండి. దీనితో పాటు మీరు ఉపవాసం ఉండాలి.

కన్య రాశి..

కన్య రాశి..

కేతు ఈ సంవత్సరం మీ నాల్గో స్థానంలో ఉంటారు. ఈ సమయంలో మీకు మానసిక శాంతి లేకుండా పోతుంది. ఇలాంటి సమయంలోనే మీరు ఓపికగా మరియు ప్రశాంతంగా పని చేయాలి. మీ మనసుపై కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబ జీవితం కూడా ప్రభావితమౌతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. అయితే కొత్త పని చేయడానికి సెప్టెంబరులో సమయం అనుకూలంగా ఉంది.

పరిహారం : మహావిష్ణువు యొక్క మత్స్యావతారన్ని పూజించాలి. చేపలకు ఆహారాన్ని అందించాలి.

ఈ సంకేతాలను బట్టి అమ్మాయిల వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు...!

తుల రాశి..

తుల రాశి..

కేతు సంచారం 2020లో మీ రాశి ప్రకారం మూడో స్థానంలో ఉంటుంది. దీని కారణంగా మీరు తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీరు సంపాదించిన సొమ్మంతా కుటుంబ సభ్యుల చికిత్స కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ స్నేహితులే శత్రువులుగా మారొచ్చు. ఎవ్వరిని గుడ్డిగా నమ్మకండి. మీ శారీరక ఆరోగ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టండి.

పరిహారం : ప్రతిరోజూ గణపతి స్తోత్రమును పఠించండి. వినాయకుడికి గరికను సమర్పించండి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

2020 సంవత్సరంలో కేతు గ్రహం రెండో స్థానంలో సంచరిస్తాడు. దీని వల్ల మీరు సమాజంలో సమాజంలో గౌరవం మరియు ప్రశంసలను పొందవచ్చు. క్రీడా రంగంలో ఉండే వారు రాణిస్తారు. అయితే అయోమయంలో నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యం ఆర్థిక పరంగా అన్ని వైపుల నుండి ఆలోచించి పెట్టుబడి పెట్టండి. లేదంటే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. షాడో గ్రహ సంచారం వల్ల మీ లక్ష్యాలకు మిమ్మల్ని దూరం చేస్తుంది. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

పరిహారం : ప్రతిరోజూ కుంకుమను ధరించండి. ‘ఓం కేం కేతవే నమః‘ మంత్రాన్ని జపించండి.

ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి..

కేతు సంచారం కారణంగా మీరు మీ లక్ష్యాల పట్ల కొంత భయాందోళనకు గురవుతారు. ఇలాంటి సమయంలోనే మీరు మానసిక శాంతిని పొందడానికి, మీరు ధ్యానం మరియు యోగా చేయడానికి ప్రయత్నించాలి. మీరు మతపరమైన ప్రదేశాలకు వెళ్లడం, అక్కడి పనులలో పాల్గొనడం వంటివి చేయాలి. అయితే సెప్టెంబర్ లో మీ 12వ స్థానంలో కేతు సంచారం జరుగుతున్న సమయంలో మీకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం రావచ్చు. అదే సమయంలో మీ ఖర్చులు కూడా భారీగా ఉంటాయి.

పరిహారం : అశ్వగంధ మొక్కను నాటండి. మరియు ప్రతి నిత్యం నీరు పోయండి. పేదవారికి దుప్పట్లను అందించండి.

మకర రాశి..

మకర రాశి..

కేతు గ్రహం మీ ఇంట్లో పన్నెండో స్థానంలో ఉంటుంది. దీని కారణంగా మీ ఖర్చులు భారీగా పెరుగుతాయి. కొన్ని ఊహించని ఖర్చులు మీకు ఎదురవుతాయి. అయితే సుదీర్ఘ మత ప్రయాణాలు మీ జీవితంలో శాంతి మరియు సామరస్యాన్ని కలిగిస్తాయి. సెప్టెంబరులో కేతు యొక్క సంచారం మీ పదకొండో ఇంటికి మారుతుంది. దీని వల్ల మీరు కొత్త ఆదాయ వనరులను కనుగొంటారు.

పరిహారం : ప్రతిరోజూ దుర్గాచాలిసాను పఠించాలి. ‘ఓం దుం దుర్గాయై నమః‘ను జపించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

కేతు సంచారం 2020లో కుంభ రాశిలో పదకొండో స్థానంలో ఉంటాడు. దీని కారణంగా మీ ఖర్చులు పెరుగుతాయి. అంతేకాదు మీరు కొత్త వాహనాన్ని కొనే ప్రణాళికను కూడా రూపొందించుకోవచ్చు. మీ కెరీర్లో కొత్త అవకాశాలు రావచ్చు. మీరు పెట్టిన భూమి మరియు ఆస్తి వంటి పెట్టుబడులకు మంచి ఫలితాలే వస్తాయి. అయితే సెప్టెంబర్ లో కేతు సంచారం వల్ల పదో స్థానంలోకి వెళ్లిన సమయంలో మీరు కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూలంగా ఉండదు. ఈ కాలంలో మీరు పెట్టుబడులు పెట్టకూడదు.

పరిహారం : 9 ముఖాలున్న రుద్రాక్షను ధరించండి. మహాలక్ష్మీ మరియు గణపతిని పూజించండి.

మీన రాశి..

మీన రాశి..

కేతు గ్రహం 2020లో మీ రాశి యొక్క పదో స్థానంలో ఉంటుంది. దీని ఫలితం మీరు కొన్ని విషయాల్లో గందరగోళం చెందుతారు. కుటుంబానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఉద్యోగులకు మంచి ప్రయోజనాలు ఉంటాయి. మరోవైపు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. అయితే సెప్టెంబరులో కేతు సంచారం వల్ల తొమ్మిదో స్థానానికి మారడం వల్ల మీరు విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది.

పరిహారం : ‘ఓం స్రాం స్రీం సః కేతవే నమః‘ అనే కేతు బీజ మంత్రాన్ని జపించండి. పేదలకు అరటిపండ్లు, దుప్పట్లు, నువ్వులు వంటి వాటిని దానం చేయాలి.

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Ketu Transit 2020: Effects on your Zodiac Sign

Here we talking about ketu transit 2020 : effects on your zodiac sign. Read on.
Story first published: Wednesday, May 20, 2020, 17:06 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more