For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chandra Grahan 2021:ఈ నెలలో చివరి చంద్ర గ్రహణం ఎప్పుడు? సూతక్ కాలం ఉంటుందా లేదా?

A partial lunar eclipse will take place on Friday, November 19, 2021. Check out the details of the eclipse in Telugu

|

2021 సంవత్సరంలో నవంబరు నెలలో భారతదేశంలో రెండోది మరియు చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అది కూడా ఈ నవంబరు మాసంలోనే ఏర్పడబోతోంది.

Last Lunar Eclipse Of 2021 : Know Date, Time & Sutak Kaal and other details in Telugu

ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఈ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహణం యొక్క స్థానం ప్రతికూల మార్గంలో కనిపిస్తుంది.

Last Lunar Eclipse Of 2021 : Know Date, Time & Sutak Kaal and other details in Telugu

ఈ కారణంగా గ్రహణ సమయంలో అనేక రకాల పనులు చేయడాన్ని నిషేధించారు పెద్దలు. అందుకే చాలా మంది హిందువులు గ్రహణం సమయంలో ఎలాంటి శుభ కార్యాలు నిర్వహించరు.

Last Lunar Eclipse Of 2021 : Know Date, Time & Sutak Kaal and other details in Telugu

ఈ సందర్భంగా 2021 సంవత్సరంలో రెండో మరియు చివరి చంద్ర గ్రహణం ఎప్పుడొచ్చింది? దీన్ని ఎక్కడ చూడొచ్చనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Longest Lunar Eclipse:ఆకాశంలో మరో అద్భుతం.. అత్యంత సుదీర్ఘమైన చంద్ర గ్రహణం ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుందంటే...Longest Lunar Eclipse:ఆకాశంలో మరో అద్భుతం.. అత్యంత సుదీర్ఘమైన చంద్ర గ్రహణం ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుందంటే...

చంద్ర గ్రహణం తేదీ, సమయం..

చంద్ర గ్రహణం తేదీ, సమయం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2021 సంవత్సరంలో రెండో మరియు చివరి చంద్ర గ్రహణం నవంబర్ 19న తేదీన జరగనుంది. ఈ పవిత్రమైన రోజున కార్తీక మాసంలో పౌర్ణమి తిథి కూడా. ఈ గ్రహణం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.33 గంటలకు ముగుస్తుంది. ఇదిలా ఉండగా.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA)ఈ శతాబ్దంలోనే అత్యంత ఎక్కువకాలం నిలిచే చంద్రగ్రహణం ఏర్పడనున్నట్లు ప్రకటించింది. నాసా అంచనాల ప్రకారం.. 18, 19వ తేదీల్లో ఈ అద్భుతం ఆకాశంలో కనిపిస్తుంది. ఈ రెండు రోజుల్లో దాదాపు మూడు గంటల 28 నిమిషాల పాటు పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది.

చంద్ర గ్రహణాన్ని ఎక్కడ చూడొచ్చు.

చంద్ర గ్రహణాన్ని ఎక్కడ చూడొచ్చు.

2021 సంవత్సరంలో నవంబర్ 18, 19వ తేదీన అత్యంత సుదీర్ఘమైన చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ అద్భుతమైన చంద్ర గ్రహణాన్ని చాలా మంది ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ అద్భుతమైన చంద్రుడిని చూసేందుకు అందరికీ అవకాశం రాదు. ఈ అద్భుతాన్ని చూసేందుకు ఉత్తర, దక్షిణ అమెరికాతో పాటు తూర్పు, ఆసియా, అస్ట్రేలియాలో ఉండే వారికి మాత్రమే అవకాశం ఉంటుందట. వీరందరిలోనూ ఆస్ట్రేలియావాసులకు ఈ చంద్ర గ్రహణం బాగా దగ్గరగా కనిపించబోతోందట. మన భారతదేశంలో అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో వారికి మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన వారికి కనిపించదు.

ఛాయా గ్రహణం..

ఛాయా గ్రహణం..

ఈ చంద్ర గ్రహణం అందరికీ ఒకేసారి కాకుండా కొన్ని నిమిషాలు లేదా గంటల తేడాతో కనులవిందు చేయనుంది. అమెరికాలోని తూర్పు తీరంలో ఉండేవారికి నవంబర్ 19వ తేదీన అర్ధరాత్రి 2 గంటల నుండి ఈ గ్రహణం కనిపిస్తుంది. పశ్చిమ తీరంలో వారికి మాత్రం నవంబర్ 18వ తేదీ రాత్రి 11 గంటల నుండే కనిపిస్తుంది. అంతేకాదు ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్ర గ్రహణం. అంతేకాదు 2001 నుండి 2100 శతాబ్దంలో ఇదే అత్యంత సుదీర్ఘమైనది కూడా. అయితే ఈ కాలంలో సూతక్ కాలం ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది పాక్షిక చంద్ర గ్రహణం. కేవలం చంద్ర గ్రహణం వచ్చినప్పుడు మాత్రమే సూతక్ కాలం ఉంటుంది. అప్పుడే అందుకు సంబంధించిన నియమాలను పాటిస్తారు. కానీ ఈ కాలంలో గర్భిణులు మరియు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి.

ఎర్రగా మారే చంద్రుడు..

ఎర్రగా మారే చంద్రుడు..

అత్యంత సుదీర్ఘమైన చంద్ర గ్రహణం మన దేశంలో నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు ఏర్పడనుంది. ఈ సమయంలో చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి వస్తుంది. ఈ మూడు గ్రహాలు ఒకే వరుసలో వచ్చి ఉంటాయి. చంద్రునిపై సూర్యుని వెలుగు పడకుండా భూమి అడ్డుగా నిలుస్తుంది. అదే సమయంలో భూమి నీడ దాదాపు 97 శాతం చంద్రుని మీదే పడుతుంది. దీంతో చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు.

శుభాకార్యలు నిలుపుదల..

శుభాకార్యలు నిలుపుదల..

మరోవైపు హిందూ పంచాంగం ప్రకారం చంద్ర గ్రహణం సమయంలో ముఖ్యంగా సూతక కాలంలో దేవాలయాలను మూసేస్తారు. ఇంట్లో పూజా మందిరాలు, ప్రార్థనా స్థలాలను కూడా మూసేస్తారు. ఈ సమయంలో భగవంతుడిని తాకడం వంటివి చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుభ్రం చేసి పూజలు చేయడం ప్రారంభిస్తారు.

FAQ's
  • 2021లో నవంబరు నెలలో ఎన్నో చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది?

    2021 సంవవత్సరంలో నవంబరు నెలలో రెండోది, చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA)ఈ శతాబ్దంలోనే అత్యంత ఎక్కువకాలం నిలిచే చంద్రగ్రహణం ఏర్పడనున్నట్లు ప్రకటించింది. నాసా అంచనాల ప్రకారం.. 18, 19వ తేదీల్లో ఈ అద్భుతం ఆకాశంలో కనిపిస్తుంది. ఈ రెండు రోజుల్లో దాదాపు మూడు గంటల 28 నిమిషాల పాటు పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది.

  • 2021లో ఏర్పడే చివరి చంద్ర గ్రహణం మన దేశంలో ఎక్కడ కనిపిస్తుంది?

    మన దేశంలో అత్యంత సుదీర్ఘమైన చంద్ర గ్రహణం అన్ని రాష్ట్రాల వారికి కనిపించదు. కేవలం కొన్ని రాష్ట్రాల వారికి మాత్రమే ఈ చంద్ర గ్రహణాన్ని చూసే అవకాశం లభిస్తుంది. అందులోనూ ఈశాన్య రాష్ట్రాలైనా అస్సోం, అరుణాచల్ ప్రదేశ్ వాసులు మాత్రమే దీన్ని చూడగలరు. కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడే ఈ గ్రహాణాన్ని ఫ్రాస్ట్ మూన్ అని కూడా అంటారు. అంటే మంచుతో కప్పబడిన చంద్రుడు అని అర్థం.

  • చంద్ర గ్రహణం సమయంలో శుభకార్యాలు జరగవా?

    హిందూ పంచాంగం ప్రకారం చంద్ర గ్రహణం సమయంలో ముఖ్యంగా సూతక కాలంలో దేవాలయాలను మూసేస్తారు. ఇంట్లో పూజా మందిరాలు, ప్రార్థనా స్థలాలను కూడా మూసేస్తారు. ఈ సమయంలో భగవంతుడిని తాకడం వంటివి చేయరు. గ్రహణం ఉన్నంతసేపు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుభ్రం చేసి పూజలు చేయడం ప్రారంభిస్తారు.

English summary

Last Lunar Eclipse of 2021 : Know Date, Time & Sutak Kaal and other details in Telugu

Here we are talking about the last lunar eclipse of 2021 : Know the date, time and sutak kal and other details in Telugu. Have a look
Desktop Bottom Promotion