For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా దెబ్బకు కొత్త బట్టలు.. కొత్త సినిమాలు.. కూరగాయలు.. ఉప్పు.. పప్పు వరకు అంతర్జాలంలోనే అన్నీ...

|

కరోనా వైరస్ పుణ్యమా అని చాలా మంది కూరగాయల నుండి పప్పు, ఉప్పు వరకు.. క్యారమ్స్ నుండి కాక్స్ వరకు.. కొత్త సినిమాల నుండి కోరుకున్న సినిమాల వరకు మొత్తం ఆన్ లైనులోనే దొరికేస్తున్నయ్.

అంతేకాదండోయ్ ఎవరికైనా ఏదైనా సుస్తీ చేస్తే ఆన్ లైనులోనే డాక్టర్ని సంప్రదించడం.. దవాఖానాకు వెళ్లకుండానే ఒక్క క్లిక్ కొట్టి మందులను ఇంటికి రప్పించుకోవడం.. పిల్లలు పాఠశాలకు పోకుండా స్మార్ట్ ఫోన్లేనే క్లాసులను చెప్పించడం.. టీచర్లు, లెక్చరర్లు సైతం అందులోనే దూరి స్టూడెంట్లకు లెసన్స్ చెప్పడం అంతా ఆన్ లైన్ లోనే జరిగిపోతోంది.

ఇంతటితో అయిపోలేదు షాపింగ్.. పేమేంట్లను.. ఆఖరికి పెళ్లిళ్లను సైతం ఆన్ లైనులోనే చేసేస్తున్నారు. కరోనా దెబ్బకు అందరూ సంక్షోభంలోకి కూరుకుపోతే... అమెజాన్, ఫ్లిప్ కార్ట్, జియో మార్ట్, బిగ్ బాస్కెట్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మాత్రం జోరు పెంచేశాయి.

దీనంతటికీ కరోనా వైరస్, లాక్ డౌనే కారణం. కోవిద్ దెబ్బకు ప్రతి ఒక్కరి జీవితంలో ఆన్ లైన్ అంతర్భాగం అయిపోయింది. దీంతో ప్రస్తుతం అంతా ఆన్ లైన్ యుగం అయిపోయింది. అయితే కరోనా వల్ల వచ్చిన ఈ ఆన్ లైన్ మార్పులతో లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయంట. అవేంటో ఇప్పుడు చూసేద్దాం రండి...

తరచూ చావు కలల వస్తుంటే మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?తరచూ చావు కలల వస్తుంటే మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

కళ్ల ముందే కావాల్సినవన్నీ..

కళ్ల ముందే కావాల్సినవన్నీ..

కరోనా వైరస్ వల్ల దాదాపు మొత్తం కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయి. కానీ, అప్పటివరకు అంతంతమాత్రంగా నడుస్తున్న కంపెనీల బిజినెస్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా డెలివరీ కంపెనీల జోరు అమాంతం పెరిగిపోయింది. కరోనా దెబ్బకు బయటికెళ్లి కూరగాయలు, సరుకులు కొనలేని వారంతా ఆన్ లైన్ బాట పట్టారు. కళ్ల ముందే కావాల్సినవన్నీ ఉండటంతో.. ఒక్క క్లిక్ తో అన్నింటినీ ఇంటికే తెప్పించుకుంటున్నారు.

లాక్ డౌన్ సమయంలో..

లాక్ డౌన్ సమయంలో..

కరోనా దెబ్బకు లాక్ డౌన్ ఎప్పుడైతే వచ్చిందో.. అప్పుడే ఆన్ లైన్ కల్చర్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కంపెనీలన్నీ కూడా ఈ బిజినెస్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాయి. అయితే దీని వల్ల పెద్ద కంపెనీలు లాభపడ్డాయి.. కానీ వ్యాపారులు మాత్రం చాలా దెబ్బతిన్నారు. చాలా మంది అన్ని సర్దుకుని సొంతూళ్లకు వెళ్లిపోయారు.

ఆఫర్లతో అట్రాక్ట్..

ఆఫర్లతో అట్రాక్ట్..

ఒకప్పుడు ఆన్ లైన్ షాపింగ్ అప్పుడప్పుడు చేసేవారు. కానీ ఆన్ లైన్ సేల్స్ రోజురోజుకు అమాంతం పెరగడానికి కారణం ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకోవడమే. ఉదాహరణకు మార్కెట్లో వెయ్యి రూపాయలకు దొరికే వస్తువు డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లతో కేవలం 600 లేదా 700 రూపాయలలోపే వస్తోంది.

అయ్యో! ఫాఫం పంజాబ్.. అంబటి అదుర్స్ మీమ్స్ ట్వీట్లపై లుక్కేయండి...అయ్యో! ఫాఫం పంజాబ్.. అంబటి అదుర్స్ మీమ్స్ ట్వీట్లపై లుక్కేయండి...

పండుగల సమయంలో..

పండుగల సమయంలో..

ఇక పండుగల సమయంలో బిగ్ బిలియన్ డేస్ అని, ఫెస్టివల్ ఆఫర్లు అని, ధమాకా సేల్స్ అనే రకరకాల పేర్లతో ఆఫర్లను పెడుతుంటాయి కంపెనీలు. దీంతో చాలా వర్చువల్ షాపింగుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పటితో పోల్చితే.. ఆన్ లైన్ వస్తువుల క్వాలిటీ కూడా బాగానే పెరిగింది.

ఎక్కువ షాపింగ్ ఇవే..

ఎక్కువ షాపింగ్ ఇవే..

చాలా మంది ఆన్ లైనులో వంటలో కావాల్సిన ఇన్ గ్రేడియంట్స్ ను, గ్రాసరీస్ ను, మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు, బ్రాండెడ్ షూస్, జువెలరీ, పర్ఫ్యూమ్స్, కెమెరాలు, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ల వంటి వాటిని ఎక్కువగా కొంటున్నారు.

ఈ 29న శని మకరంలోకి... కరోనా ప్రభావం తగ్గి.. కొన్ని రాశుల వారికి అదృష్టం...!ఈ 29న శని మకరంలోకి... కరోనా ప్రభావం తగ్గి.. కొన్ని రాశుల వారికి అదృష్టం...!

డాక్టర్ కన్సల్టెన్సీ..

డాక్టర్ కన్సల్టెన్సీ..

కరోనా లాక్ డౌన్ వల్ల వచ్చిన అతి పెద్ద మార్పుల్లో డాక్టర్ వర్చువల్ కన్సల్టెన్సీ ఒకటి. ఒకప్పుడు జ్వరమొచ్చినా.. జలుబొచ్చినా.. తలనొప్పి ఇబ్బంది పెట్టినా.. దగ్గు వచ్చినా ఏ చిన్న సమస్య ఉన్నా సరే డాక్టర్ దగ్గరికే వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కోవిద్ కారణంగా చిన్న చిన్న సమస్యలకు డాక్టర్ దగ్గరికి, ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా పోయింది. కూర్చున్న చోటే నుండి డాక్టర్లు.. ట్రీట్మెంట్, మెడిసిన్ గురించి పెషంట్లకు వివరిస్తున్నారు. ఇక మెడిసిన్ ను కూడా ఇంటి నుండే ఆర్డర్ చేసేస్తున్నారు. అయితే ఇందులో ఓ సమస్య ఉంది. పేషెంట్ సమస్య విని మందులు రాయడమే తప్ప సమస్య మూలాలన్ని గుర్తించలేరు డాక్టర్లు. అసలు హ్యుమన్ టచ్ లేకుండా రోగికి చికిత్స చేయడం కొంత కష్టమే అంటున్నారు వైద్య నిపుణులు

ఆన్ లైన్ స్టడీస్..

ఆన్ లైన్ స్టడీస్..

ఆన్ లైన్ లో బట్టలు, సరుకులే అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.. కరోనా కారణంగా పిల్లల చదువులు కూడా ఆన్ లైన్ అయిపోయాయి. ప్రైవేట్ స్కూల్స్ ఫోన్ స్క్రీన్లనే బ్లాక్ బోర్డులుగా మార్చేశాయి. దీంతో పేరేంట్స్ అప్పు చేసి మరీ స్మార్ట్ ఫోన్లు కొనాల్సి వస్తోంది. ఇంకా కొంతమంది స్మార్ట్ టీవీలు, ల్యాప్ టాప్ లు కొంటున్నారు. అయితే, ఈ చదువులు పిల్లల భవిష్యత్తుకు ఏ మేరకు ఉపయోగపడతాయనేది సందేహమే అంటున్నా చాలా మంది టీచర్లు.

English summary

Life after COVID-19: It’s a machine world in telugu

Here we talking about the life after covid-19 : It's a machine world in telugu. Read on