For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Most influential women of 2021:ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళ ఎవరో తెలుసా...

|

List of Most Influential Women of 2021: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్ ఇటీవలే విడుదల చేసింది. ఈ జాబితాలో మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ ముచ్చటగా మూడోసారి చోటు సంపాదించుకున్నారు. 2021 సంవత్సరంలో ఆమె ర్యాంకు 37వ స్థానానికి పెరిగింది. మన నిర్మలమ్మ అమెరికన్ కౌంటర్ జానెట్ యెల్లెన్ కంటే రెండు స్థానాలు ముందు ఉన్నారు. గత ఏడాది నిర్మలా సీతారామన్ 41వ స్థానంలో నిలిచారు. అయితే అమెరికాకు చెందిన మెకెంజీ స్కాట్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. మరోవైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్.. భారత సంతతికి చెందిన మహిళ కమలా హ్యారిస్ రెండో స్థానంలో నిలిచారు.

ఇక మూడో స్థానంలో క్రిస్టీన్ లగార్డ్(ఫ్రాన్స్), నాలుగో స్థానంలో మేరీ బర్రా(అమెరికా), ఐదో స్థానంలో మెలిండా ఫ్రెంచ్ గేట్స్(యుఎస్), ఆరో స్థానంలో అబిగ్రెల్ జాన్సన్(అమెరికా), ఏడో స్థానంలో అనా ప్యాట్రిసియా బోటిన్ (స్పెయిన్), ఎనిమిదో స్థానంలో ఉర్సులా వాన్ డెర్ లెయెన్(జర్మనీ), తొమ్మిదో స్థానంలో సాయ్ ఇంగ్-వెన్(తైవాన్), పదో స్థానంలో జూలీ స్వీట్(అమెరికా) నిలిచారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు ప్రతి ఒక్క రంగంలోనూ రాణిస్తున్నారు. ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్క దాంట్లో పురుషులతో సమానంగా పని చేస్తూ, మహిళల సత్తా ఏంటో చాటుతున్నారు. ఇదిలా ఉండగా.. భారతదేశం నుడి నైకా వ్యవస్థాపకురాలు, సిఇఒ ఫల్గుణి నాయర్ 88వ స్థానంలో నిలిచారు. తను ఇటీవలే ఇండియాలో ఏడో మహిళా బిలీనియర్ గా నిలిచారు. స్టాక్ మార్కెట్లో తన కంపెనీ ఎంటరైన తర్వాత అత్యంత సంపన్నమైన మహిళగా ఒక్కసారిగా వెలుగులోకొచ్చారు. తనతో పాటు ఫోర్బ్స్ జాబితాలో ఇతర భారతీయ వ్యాపారవేత్తలు రోషిణి నాడార్, హెచ్ సిఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్, మన దేశంలో ఐటి కంపెనీ తొలిసారి లీడర్ గా వ్యవహరించిన మహిళ 52వ స్థానంలో, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్, వ్యవస్థాపకులు కిరణ్ మజుందార్ షా 72వ స్థానంలో నిలిచారు. ఇదిలా ఉండగా.. ఫోర్బ్స్ జాబితాలో ఫస్ట్ ర్యాంకులో ఉన్న మెకెంజీ స్కాట్ తన సంపదలో 8.6 బిలియన్ల డాలర్లను విరాళంగా ప్రకటించారు.

నిర్మలా సీతారామన్..

నిర్మలా సీతారామన్..

2021 సంవత్సరానికి సంబంధించి ఫోర్బ్స్ విడుదల చేసిన 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మరోసారి చోటు దక్కింది. 61 ఏళ్ల వయసు ఉన్న సీతారామన్ కు 37వ స్థానంలో నిలిచారు. అంతకుముందు నిర్మలమ్మ 41వ స్థానంలో నిలిచారు. మన దేశంలో మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రిగా, పూర్తి కాలంలో అదే శాఖలో కొనసాగడం విశేషం. ఆమె 2019 సంవత్సరంలో మే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో నిర్మలా సీతారామన్ పీఎం కేర్స్ ఫండ్ కు 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. సీతారామన్ కూడా చాలా ధైర్యంతో అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్న నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు.

రోష్నీ నాదర్ మల్హొత్రా..

రోష్నీ నాదర్ మల్హొత్రా..

మన దేశంలో ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీలలో ఒకటైన రోష్ని నాదర్ మల్హొత్రా ఫోర్బ్స్ విడుదల చేసిన 2021లొ అత్యంత శక్తివంతమైన భారతీయ మహిళల్లో 52వ స్థానంలో నిలిచారు. అంతకు ముందు ఈమె 2019 సంవత్సరంలో 54వ స్థానంలో ఉన్నారు. తండ్రి మరియు హెచ్ సిఎల్ వ్యవస్థాపకుడు శివ నాదర్ 2020 జులైలో తన ఏకైక కుమార్తెకు మొత్తం బాధ్యతలను అప్పగించారు. హెచ్ సిఎల్ కు కార్యనిర్వహణాధికారి(CEO)గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, రోష్ని చెన్నైలోని శ్రీ శివసుబ్రమణ్య నాదర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రయోజనం కోసం నడుస్తున్న శివ నాదర్ ఫౌండేషన్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఇది కాకుండా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రజలకు సహాయపడే విద్యాజ్ణాన్ లీడర్ షిప్ అకాడమీ అధ్యక్షురాలు కూడా. 38 ఏళ్ల రోష్ని కెల్లాగ్ స్కూల్ మేనేజ్ మెంట్ నుండి పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం ఈమె భారత దేశంలో ధనిక వ్యాపార మహిళల్లో ఒకరుగా ఉన్నారు.

కిరణ్ మజుందర్ షా..

కిరణ్ మజుందర్ షా..

కిరణ్ మజుందర్ షా గురించి చాలా మందికి తెలుసు. ఫోర్బ్స్ విడుదల చేసిన 100 మంది అత్యంత శక్తివంతమైన భారతీయ మహిళల్లో 72వ స్థానంలో నిలిచారు. బయోకాన్ వ్యవస్థాపకులు మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన కిరణ్ 1978 సంవత్సరంలో ఐర్లాండ్ లోని కార్క్ లో బయోకాన్ కెమికల్స్ లిమిటెడ్ లో ట్రైనీ మేనేజర్ గా చేరారు. ఈమె బెంగళూరులో ఒక అద్దె ఇంట్లో నివసించారు. అక్కడే బయోకాన్ ను గ్యారేజీలో కేవలం 10 వేల రూపాయలతో ప్రారంభించారు. డిసెంబర్ 16, 2020న ఫోర్బ్స్ అధ్యయనం ప్రకారం, కిరణ్ యొక్క నికర విలువ 74.7మిలియన్లుగా వివరించింది. బెంగళూరుకు చెందిన ఔషధ సంస్థ బయోకాన్ కూడా గత సంవత్సరం కరోనావైరస్ ఔషధ పదాన్ని తయారు చేయడానికి అనుమతించింది.

రేణుకా జగ్తీయాని

రేణుకా జగ్తీయాని

ల్యాండ్ మార్క్ గ్రూపునకు అధిపతి అయిన రేణుకా జగ్దియాని ఫోర్బ్స్ 2020కి సంబంధించి విడుదల చేసిన 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల్లో భారతదేశం తరపున 98వ స్థానంలో నిలిచారు. అయితే 2021 సంవత్సరంలో విడుదల చేసిన జాబితాలో ఈమె చోటు దక్కించుకోలేకపోయింది. దుబాయ్ కేంద్రంగా ఉన్న ల్యాండ్ మార్క్ గ్రూప్ మల్టీ నేషనల్ కంపెనీ. ల్యాండ్ మార్క్ దుస్తులు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్, మిఠాయి, సౌందర్య సాధనలు మొదలైన వాటిని రిటైల్ చేస్తుంది. ల్యాండ్ మార్క్ ను ప్రియాంక భర్త మిక్కీ జగ్తీయాని 1973లో స్థాపించారు. రేణుకా తన క్రుషి మరియు అంకితభావంతో ల్యాండ్ మార్క్ ను విజయాల దిశగా తీసుకెళ్లారు. నేడు ల్యాండ్ మార్క్ ప్రపంచంలోని ప్రతి మూలకు చేరిపోయి ప్రసిద్ధ సంస్థగా పిలువబడుతోంది. ఫోర్బ్స్ తో పాటు, ఫార్చ్యూన్ మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇంటర్నేషనల్ జాబితాలో రేణుకా తన పేరు నమోదు చేసుకుంది.

2021లో ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ కు ఎన్నో స్థానం దక్కింది?

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్ ఇటీవలే విడుదల చేసింది. ఈ జాబితాలో మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ ముచ్చటగా మూడోసారి చోటు సంపాదించుకున్నారు. 2021 సంవత్సరంలో ఆమె ర్యాంకు 37వ స్థానానికి పెరిగింది. మన నిర్మలమ్మ అమెరికన్ కౌంటర్ జానెట్ యెల్లెన్ కంటే రెండు స్థానాలు ముందు ఉన్నారు.

నిర్మలా సీతారామన్ తో పాటు ఇంకా ఏ భారత మహిళలు ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు?

2021 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు రోషిణి నాడార్, కిరణ్ మజుందార్ లకు టాప్-100 జాబితాలో చోటు దక్కింది.

2021లో ఫోర్బ్స్ జాబితాలో అత్యంత శక్తివంతమైన మహిళగా అగ్రస్థానం ఎవరికి దక్కింది?

అమెరికాకు చెందిన మెకెంజీ స్కాట్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. మరోవైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్.. భారత సంతతికి చెందిన మహిళ కమలా హ్యారిస్ రెండో స్థానంలో నిలిచారు.

English summary

List of most influential women of 2021

Here are the list of most influential women of 2021. Take a look
Story first published: Saturday, December 18, 2021, 10:42 [IST]
Desktop Bottom Promotion