For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తన బిడ్డ కోసం ఆ తల్లి చేసిన సాహసానికి సలామ్ చేయాల్సిందే... ఇంతకీ ఆమె ఏమి చేసిందంటే...

కరోనా వైరస్ కు భయపడకుండా తన కొడుకు కోసం ఏకంగా స్కూటీపై 1400 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

|

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. మన దేశంలో దాదాపు 400 మందికి పైగా చనిపోయారు. కరోనా పాజిటివ్ కేసులు కూడా 12 వేల మార్కును దాటిపోయింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

Lockdown Effect : A mother drives 1,400 kms to get her stranded son back

Image Curtosy

వీటన్నింటి సంగతి పక్కనబెడితే లాక్ డౌన్ సమయంలో తన కొడుకు వేరే రాష్ట్రంలో చిక్కుకుపోయాడని తల్లడిల్లిన ఆ తల్లి గుండె.. ఎట్టకేలకు ధైర్యం చేసింది. కరోనా వైరస్ కు ఏ మాత్రం భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. అంతేకాదు అధికారులతో అనుమతి సైతం తీసుకుని తన కొడుకు కోసం స్కూటీ పై తెలంగాణ నుండి బయలుదేరింది.

Lockdown Effect : A mother drives 1,400 kms to get her stranded son back

Image Curtosy

అయితే ఆ తల్లి ఏ పది కిలోమీటర్లో లేదా 100 కిలోమీటర్లో ప్రయాణించింది అనుకుంటే పొరపాటే. ఆమె స్కూటీపై 100 కాదు 200 కాదు ఏకంగా 1400 కిలోమీటర్ల

ఏకధాటిగా ప్రయణం చేసింది. అలా స్కూటీపై వెళ్లి తన తనయుడి వద్దకు చేరుకుంది. ఈ తల్లి చేసిన సాహసానికి అందరూ సలామ్ చేస్తున్నారు...

తల్లీ బిడ్డల ప్రేమ..

తల్లీ బిడ్డల ప్రేమ..

ఇటీవలే న్యూస్ ఛానెళ్లలో, సోషల్ మీడియాలో తల్లీకూతుళ్లకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది. అందులో నర్సుగా పని చేస్తున్న తల్లిని చూడాలని తన కూతురు మారం చేయడంతో.. ఆ తండ్రి తన బిడ్డను సముదాయించలేక ఆమెను దూరం నుండి చూపిస్తాడు. అయితే, తన తల్లిని చూసిన వెంటనే ‘అమ్మా రా అమ్మ‘ అంటూ ఆ కూతురు రోధిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.

తెలంగాణ తల్లి..

తెలంగాణ తల్లి..

అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఓ తల్లి తన కొడుకు కోసం తల్లడిల్లిపోయింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఆమె బెంగ అంతా తన కొడుకు ఎలా ఉన్నాడో అని తరచుగా ఆవేదన చెందుతూ ఉండేది. ఇలా ప్రతిరోజూ ఆందోళన చెందుతూ కూర్చుంటే ఫలితం ఉండదని నిర్ణయించుకుంది.

అధికారులను కలిసి..

అధికారులను కలిసి..

తన కొడుకు ఎక్కడ చిక్కుకున్నాడో.. తను ఎంతలా తల్లడిల్లుతున్నానో అనే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారికి వివరించింది. అందుకు సానుకూలంగా స్పందించిన ఆ అధికారి ఆమెకు అనుమతి ఇచ్చారు.

700 కిలోమీటర్ల ప్రయాణం..

700 కిలోమీటర్ల ప్రయాణం..

ఎట్టకేలకు అనుమతి తీసుకున్న రజియా భేగం అనే మహిళ స్కూటీపై సోమవారం 700 కిలోమీటర్ల దూరంలో నెల్లూరుకు పయనాన్ని ప్రారంభించింది. మరుసటి రోజు అంటే మంగళవారం నాడు క్షేమంగా కుమారుడి వద్దకు చేరుకుంది. అదే రోజు సాయంత్రం అదే స్కూటీపై సాయంత్రం మళ్లీ తన సొంతూరికి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది.

కొడుకును చూడాలనే తపన..

కొడుకును చూడాలనే తపన..

బుధవారం మధ్యాహ్నం తన సొంత ఊరికి చేరుకుంది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడింది. ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్న తాను తన కొడుకును చూడాలనే తపనతోనే అంత దూరం ధైర్యంగా వెళ్లగలిగానని, తన కుమారుడిని క్షేమంగా తీసుకురాగలిగానని, అడవి ప్రాంతంలో వెళ్లినా కూడా తనకు ఎలాంటి భయం కలగలేదన్నారు. చాలా చోట్ల పోలీసులు ఆపారని, బోధన్ ఏసీపీ ఇచ్చిన ఉత్తరాన్ని చూపించడంతో వారు అనుమతించారని చెప్పింది. ఈ సందర్భంగా పోలీసులకు ధన్యవాదాలు కూడా తెలిపింది.

గత నెల్లూరుకు..

గత నెల్లూరుకు..

రజియా భేగానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు మహమ్మద్ నిజాముద్దీన్. ఈ కుర్రాడు ఇటీవలే ఇంటర్ పూర్తి చేసుకుని హైదరాబాద్ నారాయణ మెడికల్ కాలేజీ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే తన స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో, తనకు తోడుగా నెల్లూరు వెళ్లాడు. అయితే అదే సమయంలో కరోనా వైరస్ నేపథ్యంలో తొలుత జనతా కర్ఫ్యూ, తర్వాత లాక్ డౌన్ విధించడంతో నిజాముద్దీన్ అక్కడే చిక్కుకుపోయాడు.

English summary

Lockdown Effect : A mother drives 1,400 kms to get her stranded son back

Here we talking about lockdown effect : a mother drives, 1400 kms to get her stranded son back. Read on
Story first published:Thursday, April 16, 2020, 17:17 [IST]
Desktop Bottom Promotion