For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Longest Lunar Eclipse:ఆకాశంలో మరో అద్భుతం.. అత్యంత సుదీర్ఘమైన చంద్ర గ్రహణం ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుందంటే...

21వ శతాబ్దంలో నవంబర్ 18-19వ తేదీల మధ్య అతిపెద్ద చంద్ర గ్రహణం మనం ఎక్కడ ఎలా చూడబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం త్వరలో రానుంది. నవంబర్ 18, 19వ తేదీల్లో గురువారం లేదా శుక్రవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడబోతోంది.

Longest Lunar Eclipse Of 21st Century To Occur On Nov 18-19; How and Where to Watch

ఈ చంద్ర గ్రహణం ప్రత్యేకత ఏంటంటే.. వంద సంవత్సరాల్లో ఇదే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణమట. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA)ఈ శతాబ్దంలోనే అత్యంత ఎక్కువకాలం నిలిచే చంద్రగ్రహణం ఏర్పడనున్నట్లు ప్రకటించింది. నాసా అంచనాల ప్రకారం.. 18, 19వ తేదీల్లో ఈ అద్భుతం ఆకాశంలో కనిపిస్తుంది.

Longest Lunar Eclipse Of 21st Century To Occur On Nov 18-19; How and Where to Watch

ఈ రెండు రోజుల్లో దాదాపు మూడు గంటల 28 నిమిషాల పాటు పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా అత్యంత సుదీర్ఘమైన చంద్ర గ్రహణం చూసే అవకాశం ఎవరికి వస్తుంది? ఏయే దేశాల వారికి ఈ సువర్ణావకాశం లభించనుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కార్తీక మాసంలోనే వనభోజనాలెందుకు చేస్తారు.. ఆ చెట్టు కిందే తినాలని ఎందుకంటారో తెలుసా...కార్తీక మాసంలోనే వనభోజనాలెందుకు చేస్తారు.. ఆ చెట్టు కిందే తినాలని ఎందుకంటారో తెలుసా...

సుదీర్ఘమైన గ్రహణం..

సుదీర్ఘమైన గ్రహణం..

2021 సంవత్సరంలో నవంబర్ 18, 19వ తేదీన అత్యంత సుదీర్ఘమైన చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ అద్భుతమైన చంద్ర గ్రహణాన్ని చాలా మంది ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ అద్భుతమైన చంద్రుడిని చూసేందుకు అందరికీ అవకాశం రాదు. ఈ అద్భుతాన్ని చూసేందుకు ఉత్తర, దక్షిణ అమెరికాతో పాటు తూర్పు, ఆసియా, అస్ట్రేలియాలో ఉండే వారికి మాత్రమే అవకాశం ఉంటుందట. వీరందరిలోనూ ఆస్ట్రేలియావాసులకు ఈ చంద్ర గ్రహణం బాగా దగ్గరగా కనిపించబోతోందట.

ఏ సమయంలో కనిపిస్తుందంటే..

ఏ సమయంలో కనిపిస్తుందంటే..

అయితే అందరికీ ఒకేసారి కాకుండా కొన్ని నిమిషాలు లేదా గంటల తేడాతో కన్నులవిందు చేయనుంది. అమెరికాలోని తూర్పు తీరంలో ఉండేవారికి నవంబర్ 19వ తేదీన అర్ధరాత్రి 2 గంటల నుండి ఈ గ్రహణం కనిపిస్తుంది. పశ్చిమ తీరంలో వారికి మాత్రం నవంబర్ 18వ తేదీ రాత్రి 11 గంటల నుండే కనిపిస్తుంది. అంతేకాదు ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్ర గ్రహణం. అంతేకాదు 2001 నుండి 2100 శతాబ్దంలో ఇదే అత్యంత సుదీర్ఘమైనది కూడా.

మన దేశంలో ఎప్పుడంటే..

మన దేశంలో ఎప్పుడంటే..

అత్యంత సుదీర్ఘమైన చంద్ర గ్రహణం మన దేశంలో నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు ఏర్పడనుంది. ఈ సమయంలో చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి వస్తుంది. ఈ మూడు గ్రహాలు ఒకే వరుసలో వచ్చి ఉంటాయి. చంద్రునిపై సూర్యుని వెలుగు పడకుండా భూమి అడ్డుగా నిలుస్తుంది. అదే సమయంలో భూమి నీడ దాదాపు 97 శాతం చంద్రుని మీదే పడుతుంది. దీంతో చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు.

Kartik Month 2021: కార్తీక దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించరాదు... మరి ఎలా వెలిగించాలో చూసెయ్యండి...Kartik Month 2021: కార్తీక దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించరాదు... మరి ఎలా వెలిగించాలో చూసెయ్యండి...

ఎవరికి కనిపిస్తుందంటే..

ఎవరికి కనిపిస్తుందంటే..

మన దేశంలో అత్యంత సుదీర్ఘమైన చంద్ర గ్రహణం అన్ని రాష్ట్రాల వారికి కనిపించదు. కేవలం కొన్ని రాష్ట్రాల వారికి మాత్రమే ఈ చంద్ర గ్రహణాన్ని చూసే అవకాశం లభిస్తుంది. అందులోనూ ఈశాన్య రాష్ట్రాలైనా అస్సోం, అరుణాచల్ ప్రదేశ్ వాసులు మాత్రమే దీన్ని చూడగలరు. కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడే ఈ గ్రహాణాన్ని ‘ఫ్రాస్ట్ మూన్' అని కూడా అంటారు. అంటే మంచుతో కప్పబడిన చంద్రుడు అని అర్థం.

రెండో చంద్ర గ్రహణం..

రెండో చంద్ర గ్రహణం..

ఇప్పటివరకు మన దేశంలో 2021 సంవత్సరంలో తొలి చంద్ర గ్రహణం మే 26వ తేదీన విజయవంతంగా పూర్తయ్యింది. ఇక రెండోది నవంబర్ 18, 19వ తేదీన ఏర్పడబోతోంది. ఇదే అత్యంత సుదీర్ఘమైన చంద్ర గ్రహణం కూడా. ఈ గ్రహణాల ప్రభావం వల్ల మన దేశంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడనున్నాయి.

కొన్ని ఆచారాలు..

కొన్ని ఆచారాలు..

హిందూ పంచాంగం ప్రకారం చంద్ర గ్రహణం సమయంలో ముఖ్యంగా సూతక కాలంలో దేవాలయాలను మూసేస్తారు. ఇంట్లో పూజా మందిరాలు, ప్రార్థనా స్థలాలను కూడా మూసేస్తారు. ఈ సమయంలో భగవంతుడిని తాకడం వంటివి చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుభ్రం చేసి పూజలు చేయడం ప్రారంభిస్తారు.

FAQ's
  • 2021లో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఎప్పుడు రానుంది?

    అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA)ఈ శతాబ్దంలోనే అత్యంత ఎక్కువకాలం నిలిచే చంద్రగ్రహణం ఏర్పడనున్నట్లు ప్రకటించింది. నాసా అంచనాల ప్రకారం.. 18, 19వ తేదీల్లో ఈ అద్భుతం ఆకాశంలో కనిపిస్తుంది. ఈ రెండు రోజుల్లో దాదాపు మూడు గంటల 28 నిమిషాల పాటు పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది.

English summary

Longest Lunar Eclipse Of 21st Century To Occur On Nov 18-19; How and Where to Watch

Here we are talking about the longest lunar eclipse of 21st century to occur on nov 18-19; How and where to watch. Read on
Desktop Bottom Promotion