For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Lunar New Year 2022:చైనీస్ న్యూ ఇయర్ ఎప్పుడు.. ఎలా జరుపుకుంటారో తెలుసా...

చంద్రమాన నూతన సంవత్సరం 2022:చైనీయుల కొత్త సంవత్సర తేదీ, చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

Lunar New Year 2022: శీతాకాలపు అయనాంతం తర్వాత చంద్రుని పరిమాణం పెరగడంతో చైనీస్ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. 2022 సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీన చైనీస్ న్యూ ఇయర్ జరుపుకుంటారు. చైనా దేశ వ్యాప్తంగా ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ సుమారు రెండు వారాల పాటు కొనసాగుతుంది. చైనా కమ్యూనిటీకి చెందిన ప్రజలు దీన్ని లూనార్ న్యూ ఇయర్ మరియు స్ప్రింగ్ ఫెస్టివల్ గా కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా చైనీస్ న్యూ ఇయర్ చరిత్ర, ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Lunar New Year 2022

గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం జనవరి 20 నుండి ఫిబ్రవరి 21వ తేదీ మధ్యన చైనీస్ న్యూ ఇయర్ వస్తుంది. ప్రతి సంవత్సరం 12 రాశిచక్రాల జంతువులలో ఒక దానితో సంబంధం కలిగి ఉంటుంది. ఎలుక, ఎద్దు, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, మేక, కోతి, రూస్టర్, కుక్క మరియు పంది వంటి జంతువులను పోలుస్తారు. 2022 సంవత్సరాన్ని టైగర్ ఇయర్ గా పేర్కొంటున్నారు.

Lunar New Year 2022

లునార్ న్యూ ఇయర్ చరిత్ర..
చైనీస్ నూతన సంవత్సరానికి సంబంధించిన వేడుకలు 14వ శతాబ్దం BC నాటివి. ఈ పండుగకు సంబంధించిన అనేక కథలు మరియు ఇతిహాసాలు అందుబాటులో ఉన్నాయి. పురాణాల ప్రకారం.. పురాతన కాలంలో నియాన్ అనే రాక్షసుడు ప్రజలను భయాందోళనకు గురి చేసి వారిని హింసించేవాడు. అయితే ఆ రాక్షసుడు ఎరుపు రంగు, పటాకులు మరియు బాణ సంచా వంటి శబ్దాలకు భయపడేవాడట. అందుకే అప్పటి ప్రజలు ఆ రాక్షసుడిని భయపెట్టేందుకు వీటిని ఉపయోగించారట. ఆరోజు నుండి ప్రజలు చైనీస్ న్యూ ఇయర్ జరుపుకోవడం ప్రారంభించారు.

Lunar New Year 2022

లునార్ న్యూ ఇయర్ వేడుకలు..
చంద్ర నూతన సంవత్సరం ఒక పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. చైనీస్ కమ్యూనిటీకి చెందిన ప్రజలకు ఎరుపు రంగు అంటే ఎంతో ముఖ్యమైనది. ఈ వేడుక రెండు వారాలు లేదా 14 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ పౌర్ణమి రోజున లాంతరు పండుగతో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు ముగుస్తాయి. ఈరోజున ప్రజలు ప్రతికూల శక్తిని వదిలించుకోవాలనే తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. తమ ఇంటిపై ప్రకాశవంతమైన రెడ్ కలర్ బ్యానర్లు మరియు రెడ్ కలర్ వస్తువులతో అందంగా అలంకరిస్తారు. ఈరోజున పిల్లలకు రెడ్ కలర్ కవర్లో మనీ కూడా ఇస్తారు. బాణసంచా కాల్చడం, డ్యాన్స్ చేసే డ్రాగన్లు మరియు సింహాలు కూడా ఈ వేడుకలో అంతర్భాగంగా ఉంటాయి. అంతేకాదు గొప్ప విందులు కూడా నిర్వహించబడతాయి. అనంతరం గెట్-టు గెదర్ మరియు ప్రజలు కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా బహుమతులు కూడా మార్చుకుంటారు.

దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, వియత్నాం, మంగోలియా తదితర దేశాలు కూడా ఈ పండుగను వివిధ పేర్లతో మరియు సంప్రదాయాలతో జరుపుకుంటారు. ఈ సమయంలో వారు చాలా ఉత్సాహంగా ఉంటాయి.

FAQ's
  • చైనా న్యూ ఇయర్ వేడుకలను ఎలా జరుపుకుంటారు?

    చంద్ర నూతన సంవత్సరం ఒక పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. చైనీస్ కమ్యూనిటీకి చెందిన ప్రజలకు ఎరుపు రంగు అంటే ఎంతో ముఖ్యమైనది. ఈ వేడుక రెండు వారాలు లేదా 14 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ పౌర్ణమి రోజున లాంతరు పండుగతో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు ముగుస్తాయి. ఈరోజున ప్రజలు ప్రతికూల శక్తిని వదిలించుకోవాలనే తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. తమ ఇంటిపై ప్రకాశవంతమైన రెడ్ కలర్ బ్యానర్లు మరియు రెడ్ కలర్ వస్తువులతో అందంగా అలంకరిస్తారు. ఈరోజున పిల్లలకు రెడ్ కలర్ కవర్లో మనీ కూడా ఇస్తారు.

  • చైనా నూతన సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

    గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం జనవరి 20 నుండి ఫిబ్రవరి 21వ తేదీ మధ్యన చైనీస్ న్యూ ఇయర్ వస్తుంది. ప్రతి సంవత్సరం 12 రాశిచక్రాల జంతువులలో ఒక దానితో సంబంధం కలిగి ఉంటుంది. ఎలుక, ఎద్దు, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, మేక, కోతి, రూస్టర్, కుక్క మరియు పంది వంటి జంతువులను పోలుస్తారు. 2022 సంవత్సరాన్ని టైగర్ ఇయర్ గా పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన లునార్ న్యూ ఇయర్ వచ్చింది.

English summary

Lunar New Year 2022: Date, history, significance of Chinese New Year in Telugu

Lunar New Year 2022: Know Chinese New Year Date, History and Significance in Telugu. Read on
Story first published:Tuesday, February 1, 2022, 10:42 [IST]
Desktop Bottom Promotion