For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంక్రాంతి స్పెషల్ 2020 : పొంగల్ రోజున ఈ పనులు చేస్తే సకల సంపదలు మీ సొంతం...!

|

సంక్రాంతి పండుగ వచ్చేసింది.. సరదాలు తెచ్చేసింది.. అంతేకాదు అందరిలో హూషారును కూడా తెచ్చేసింది. పట్టణాలు, నగరాలలో ఉండే వారంతా తమ సొంత ఊళ్లకు ఎప్పుడెప్పుడు వెళదామా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

తమ సొంత ఊరిలో భోగి మంటల్లో అందరితో కలిసి చలి కాచుకోవాలని, సంక్రాంతి సంబరాలు.. కోడి పందేలు.. కనుమ పండుగను ఎలా ఎంజాయ్ చేద్దామా అని చాలా మంది ఇప్పటికే అనేక ప్లాన్స్ చేసుకుని ఉంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా మకర సంక్రాంతి నాడు ఎలాంటి పనులు చేయాలో.. ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకోండి.. ఈ మకర సంక్రాంతి పండుగను మరింతగా ఎంజాయ్ చేయండి...

ముందుగా ఏయే పనులు చేయాలో తెలుసుకుందాం...

ముందుగా ఏయే పనులు చేయాలో తెలుసుకుందాం...

సూర్యోదయానికి ముందే..

సంక్రాంతి పండుగ రోజున సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి. స్నానం కూడా సూర్యోదయానికి ముందే పూర్తి చేయాలి. అలాగే మీ ఇంటి శుభ్రం చేసుకోవాలి. మీ ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమ, తోరణాలు కట్టాలి. మీ ఇంటి బయట రంగు రంగుల ముగ్గులను వేయాలి. అలాగే పూజా మందిరంలో ముగ్గులతో అలకరించుకోవాలి.

దేవుడికి నైవేద్యంగా..

దేవుడికి నైవేద్యంగా..

ఆ పండుగ పర్వదినాన కొత్త బట్టలను ధరించాలి. అలాగే చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. అనంతరం సూర్యభగవానుడిని, మీ తల్లిదండ్రులను ప్రార్థించుకుంటే మోక్షం కలుగుతుంది. మీకు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

దాన ధర్మాలు..

దాన ధర్మాలు..

సంక్రాంతి పండుగ రోజున తెల్లవారు జామునే హరిదాసు హరినామ సంకీర్తనలు, సాతాని జియ్యర్లు, జంగపు దేవరలు, బుడబుక్కల దొరలు, పంబలవాండ్లు, బైనాయుడులు, గంగిరెద్దుల వాళ్లు ఇంటింటికీ తిరుగుతుంటారు. వారు ఆరోజు ఉదయం నుండే భక్తి పాటలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇంట్లో ఉండే పెద్దలకు పుణ్య లోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తుంటారు. అలాంటి వారికి మీరు మీకు తోచిన సాయం లేదా దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు దారిద్య్ర బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతారు.

సకల సంపదల కోసం..

సకల సంపదల కోసం..

సంక్రాంతి పండుగ రోజున సకల సంపదల కోసం స్త్రీలు పూలు, పసుపు, కుంకుమ, పండ్ల వంటి వాటిని దానం చేయాలి. దీంతో సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగళి ప్రాప్తం లభిస్తాయని చాలా మంది హిందువుల నమ్మకం.

అల్లుళ్లకు.. ఆడపడుచులకు..

అల్లుళ్లకు.. ఆడపడుచులకు..

మకర సంక్రాంతి పండుగ రోజు అల్లుళ్లను, ఆడపడుచులను ఇంటికి ఆహ్వానించాలి. వారికి కొత్త బట్టలు పెట్టడం అనేది మన హిందూవుల సంప్రదాయం.

గాలిలో పతంగులు..

గాలిలో పతంగులు..

ఈ పండుగ రోజున ఉన్న మరో ముఖ్యమైన సంప్రదాయం ఏంటంటే పతంగులను గాలిలోకి ఎగరవేయటం. ఈరోజులో ఎక్కువ సేపు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి గాలి పటాలను ఎగురవేస్తూ సంక్రాంతి సంబరాలను సంతోషంగా జరుపుకోవడమే ఈ పండుగ యొక్క ప్రత్యేకత.

ఏయే పనులు చేయకూడదంటే..

ఏయే పనులు చేయకూడదంటే..

చెట్లను కొట్టకూడదు..

సంక్రాంతి పండుగ అంటేనే పంట చేతికొచ్చిన కాలం. ఈరోజున ఏ ఒక్కరు కూడా చెట్లను కొట్టడం లేదా నరకడం వంటివి అస్సలు చేయకూడదు. హిందూ మతంలో చెట్లను చాలా పవిత్రంగా భావించడమే కాకుండా వాటిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. చాలా చెట్లు కొన్ని దేవతలకు ప్రతీక అని కూడా నమ్ముతారు.

చుక్క.. ముక్క.. తీసుకోవద్దు..

చుక్క.. ముక్క.. తీసుకోవద్దు..

మకర సంక్రాంతి పండుగ పవిత్రమైనది కాబట్టి. ఆరోజు చాలా పవిత్రంగా ఉండాలి. ఆరోజున ఎట్టి పరిస్థితిలో మందు(చుక్క)ను ముట్టుకోకూడదు. అలాగే మాంసం ( ముక్క) జోలికి కూడా వెళ్లకూడదు. సిగరెట్లు కూడా తాగకూడదు.

అసభ్యంగా ప్రవర్తించకూడదు..

అసభ్యంగా ప్రవర్తించకూడదు..

ఈ పండుగ రోజు ప్రతికూల ఆలోచనలు చేయకూడదు. ఎవరితోనూ అసభ్యంగా మాట్లాడకూడదు. ఈరోజున చెడు మాటలు మాట్లాడితే సూర్యదేవుడు అస్సలు క్షమించడట. అందుకే ఈరోజంతా అందరితోనూ మంచిగా మాట్లాడండి. మంచిగా ప్రవర్తించండి..

English summary

Makar Sankranti 2020 : Do's and Dont's on Makar Sankranti

There are certain things that one should not do on makar sankranti. Cutting tress or consuming alcohol or non-vegetarian foods is strictly prohibited on Makar Sankranti.
Story first published: Wednesday, January 8, 2020, 13:15 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more