Just In
- 34 min ago
Planet Transit in June 2022 :జూన్ నెలలో 5 గ్రహాల రవాణా.. ఏయే తేదీల్లో మారనున్నాయంటే...
- 1 hr ago
మాంసాహారం కంటే ఈ పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండొచ్చు... దృఢమైన శరీరానికి ఇవి చాలు!
- 3 hrs ago
రొయ్యలతో చెట్టినాడ్ స్టైల్ పెప్పర్ ఫ్రైని ప్రయత్నించండి
- 4 hrs ago
Shani Jayanti 2022 Daan: శని మహాదశ కష్టాల నుండి ఉపశమనం కావాలంటే ఇవి దానం చేయండి...
Don't Miss
- Sports
వివాదాన్ని మరిచిపోయి హ్యాపీగా కలిసిపోయిన మేరీ కోమ్, నిఖత్ జరీన్.. వైరలైన ఫోటో
- Movies
Bhool Bhulaiyaa 2 Collections.. 100 కోట్లకు చేరువగా కియారా అద్వానీ మూవీ.. 5 రోజుల్లో ఎంతంటే?
- News
Vastu tips: నిద్రకూ వాస్తు డైరెక్షన్: ఉత్తర దిక్కుకు తలపెట్టి పడుకుంటే ఏమవుతుందో తెలుసా?
- Finance
Digit Insurance IPO: విరాట్ కోహ్లీ కంపెనీ పబ్లిక్ ఇష్యూ: 500 మిలియన్ డాలర్లు టార్గెట్
- Automobiles
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- Technology
Spicejet విమానాలపై Ransomware తో హ్యాకర్ల దాడి ! పూర్తి వివరాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Makar Sankranti 2022:సంక్రాంతి వేళ మీ రాశిని బట్టి ఏ వస్తువులను దానం చేయాలో తెలుసా...
హిందూ మతంలో ప్రతి సంవత్సరం ప్రతి నెలా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరంలోని తొలి నెలలో జనవరి మాసంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన పండుగ వస్తుంది.
అదే మకర సంక్రాంతి. ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు. ఈరోజున అనేక సంఘటనలు ముడిపడి ఉన్నాయి. ఈరోజున సూర్య భగవానుడు ఉత్తరాయణాంలోకి ప్రవేశిస్తాడు.
అంతకుముందు రోజు 14వ తేదీ అంటే శుక్రవారం నాడు భోగీ పండుగను జరుపుకుంటారు. 16వ తేదీ కనుమ పండుగను జరుపుకుంటారు. ఈరోజులన్నీ పూర్తయ్యాకే శుభకార్యాలను మొదలుపెడతారు. వీటితో పాటు సంక్రాంతి రోజున స్నానం చేయడం.. దానం చేయడం విశేష ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున దానధర్మాలు చేయడం వల్ల సూర్యభగవానుడి ఆశీస్సులు తప్పక లభిస్తాయని నమ్ముతారు. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మకర సంక్రాంతి రోజున ఏ రాశి వారు ఏరోజున ఎలాంటి వస్తువులను దానం చేయొచ్చనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
ఈ
6
రాశుల
వారు
2022లో
నిజమైన
ప్రేమను
పొందగలరు...
అయితే
మీ
రాశి
ఇక్కడ
ఉందా?

మేష రాశి..
ఈ రాశి వారు మకర సంక్రాంతి రోజున ఏదైనా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఈ పండుగ రోజున మీరు ఉన్ని మరియు పట్టు వస్త్రాలు, స్వీట్లు, నువ్వులు, తీపి అన్నం మరియు పప్పులు మొదలైన వస్తువులు దానం చేయొచ్చు.

వృషభ రాశి..
ఈ రాశి వారు మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడి అనుగ్రహం పొందడానికి ఆవనూనె, నల్ల నువ్వులు, ఉద్ది పప్పు లేదా ఏదైనా ఆహారాన్ని దానం ఇవ్వండి.

మిధున రాశి..
ఈ రాశి వారు సంక్రాంతి పండుగ రోజున నిరుపేదలకు నల్ల నువ్వులు, ఆవాలు నూనె, శనగపిండి, గొడుగు వంటి వస్తువులను దానం చేయాలి.
జనవరిలో
ఈ
4
రాశుల
వారికి
అదృష్టం
కలిసొస్తుందట...
ఇక్కడ
మీ
రాశి
ఉందేమో
చూసెయ్యండి...

కర్కాటక రాశి..
ఈ రాశి వారు సంక్రాంతి పండుగ రోజున పసుపు రంగు బట్టలు, పప్పు, ఇత్తడి పాత్రలు, పసుపు, పండ్లు తదితర వాటిని దానం చేయడం వల్ల పుణ్యం పొందొచ్చు.

సింహ రాశి..
ఈ రాశి వారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎరుపు రంగు బట్టలు, మసూర్ దాల్, ఏదైనా ఆహారం దానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు.

కన్య రాశి..
ఈ రాశి వారు సంక్రాంతి పండుగ సందర్భంగా పచ్చని రంగు దుస్తులు, చంద్రుని చిత్రపటాన్ని, వేరుశనగ తదితర వస్తువులను దానం చేయాలి.
2022లో
తొలి
వారంలో
శుక్రుడు
ధనస్సులోకి
అస్తమించనున్నాడు...
ఈ
ప్రభావం
12
రాశులపై
ఎలా
ఉంటుందంటే...!

తుల రాశి..
ఈ రాశి వారు మకర సంక్రాంతి పండుగ రోజున వేడి పదార్థాలను, బట్టలు, పండ్లు, పంచదార, మిఠాయిలు మొదలైన వాటిని దానం చేయాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు మకర సంక్రాంతి పండుగ రోజున నువ్వులు, బెల్లం, కిచిడీ మరియు దుప్పట్లు మొదలైన వాటిని అవసరమైన వారికి దానం చేయండి. మీకు సూర్యభగవానుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ఎరుపు రంగు బట్టలు, వేరుశనగ, ఎర్రచందనం, నువ్వులు తదితర వాటిని దానం చేయాలి.

మకర రాశి..
ఈ రాశి వారికి మకర సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమైనది. ఈ పవిత్రమైన రోజున దుప్పట్లు, బట్టలు, ఆహారాన్ని దానం చేయండి.

కుంభ రాశి..
ఈ రాశి వారు మకర సంక్రాంతి పండుగ రోజున కొత్త బట్టలు, నూనె, ఏదైనా ఆహారానికి సంబంధించిన వస్తువులను దానం చేయండి.

మీన రాశి..
ఈ రాశి వారు మకర సంక్రాంతి పండుగ రోజున వేరుశనగ, బెల్లం, నువ్వులు మొదలైన వాటిని దానం చేయొచ్చు.
హిందూ పంచాంగం ప్రకారం, 2022 సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ జనవరి 15వ తేదీన శనివారం నాడు వచ్చింది. అంతకుముందు రోజు 14వ తేదీ అంటే శుక్రవారం నాడు భోగీ పండుగను జరుపుకుంటారు. 16వ తేదీ కనుమ పండుగను జరుపుకుంటారు.