For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తన భార్య డెలివరీని లైవ్ టెలికాస్ట్ చేస్తానన్న మంచు విష్ణు - కాజల్ కూ ధన్యవాదాలు తెలిపిన విష్ణు

|

ఇటీవల ట్విట్టర్లో మంచు విష్ణు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. కొన్ని నెలల క్రితం విష్ణు, అతని భార్య విరానిక నాలుగో బిడ్డను ఈ భూలోకంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అంతే కాదు ఈ విశేషాలన్నింటినీ తన అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య రాబోయే డెలివరీని లైవ్ టెలికాస్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ట్విట్టర్లో తెలిపాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తన అభిమానులు, అనుచరులకు వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని మంచు అభిమానులు కూడా ఆయన సాదరంగా స్వాగతించారు. అంతేకాదు మనోహరమైన ఆ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆ దంపతులిద్దరు కలిసి కాజల్ అగర్వాల్ తో చర్చించినట్లు విష్ణు పేర్కొన్నాడు. అంతేకాదు కాజల్ అగర్వాల్ కు కృతజ్ఞతలు సైతం తెలిపాడు. ఇందుకు గడువు సమీపిస్తున్నందున నివేదిక ప్రకారం ఆ ప్రత్యేకమైన రోజున ఆ నటుడు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వెళ్లాలని యోచిస్తున్నాడు. దీనికి సంబంధించి కూడా కొన్ని ట్వీట్లు చేశాడు.

"అందమైన కాజల్ అగర్వాల్ తో చాలా చర్చల తర్వాత మా కొత్త బిడ్డకు జన్మనిచ్చే @ వినిమంచు యొక్క ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చేయాలనుకుంటున్నాను !!!! ధన్యవాదాలు @MsKajalAggarwal మీ ఆలోచనను ప్రేమించండి" అని మంచు విష్ణు సోషల్ మీడియాలో రాశారు.

మంచు విష్ణు, విరానికా 2008 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఆ జంటకు 2011లో అరియానా, వివియాన్ అనే కవలలు జన్మించారు. అనంతరం 2018లో వారు తమ మూడో సంతానానికి స్వాగతం పలికారు. ఇపుడు మరో కొత్త సభ్యుడు మంచు వారి కుటుంబంలో చేరేందుకు దారిలో ఉన్నట్లు ప్రకటించాడు.

అంతేకాదు ఒక ప్రత్యేక ప్రదేశం నుండి ఒక ప్రత్యేక ప్రకటన సైతం చేశాడు. విని యొక్క సొంత పట్టణం, ఇష్టమైన ప్రదేశం నుండి, అరి, వివి, అవ్రమ్ ఇప్పుడు వెళ్తున్నారని ప్రకటించినందుకు తాము సంతోషిస్తున్నామని, నాలుగో చిన్న దేవదూత సైతం తమ వద్దకు త్వరలో చేరతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మంచు విష్ణు ఇప్పటివరకు 20 వరకు సినిమాలలో హీరోగా నటించాడు. ప్రస్తుతం సరదా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఇప్పటివరకు విష్ణు నటించిన సినిమాలలో "ఢీ" సినిమా ప్రేక్షకులను తెగ అలరించింది. ఆ సినిమాలో తన కామెడీతో అందరినీ ఆకట్టుకున్నాడు. బ్రహ్మానందంతో కలిసి నటించడం కూడా విష్ణుకు బాగా కలిసొచ్చింది.

మంచు విష్ణు ఇప్పటివరకు ఆరు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఎటాక్, సింగం123, మామ మంచు-అల్లుడు కంచు, డైనమైట్, కరెంట్ తీగ, అనుక్షణం సినిమాలకు పెట్టుబడి పెట్టారు.

వీటిలో కరెంట్ తీగ మినహా మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దాదాపు బోల్తా పడ్డాయి. వీటిలో అనుక్షణం, మామమంచు-అల్లుడు కంచు, డైనమైట్ సినిమాల్లో మంచు విష్ణు స్వయంగా నటించిన ఫలితం అంతగా రాలేదు.

English summary

Manchu Vishnu To LIVE Telecast His Wife's Delivery; Thanks Kajal Agarwal!

Manchu Vishnu recently revealed a surprise on Twitter. A few months ago, Vishnu and his wife said they were very anxious to bring their fourth child to earth. He also shared all these features with his fans. He said on Twitter that his wife had decided to make a live telecast of the upcoming delivery. He has revealed this to his fans and followers
Story first published: Saturday, August 10, 2019, 13:55 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more