For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mars Transit in Scorpio : వృశ్చికరాశిలో కుజుడి సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం...!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అంగారకుడు(కుజుడు)ని ధైర్యం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో అయితే కుజుడి యొక్క సానుకూల ప్రభావం ఉంటుందో.. అలాంటి వ్యక్తులు పోటీతత్వాన్ని ప్రదర్శిస్తారు.

ఇది వారిని కెరీర్లో ముందుకు సాగేందుకు సహాయపడుతుంది. అంతేకాదు కొందరు దూకుడుగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో కుజుడు మరోసారి తన స్థానాన్ని మారనున్నాడు. 2021వ సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీన ఉదయం 5:01 గంటలకు తుల రాశి నుండి వృశ్చికరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇక్కడే 4 జనవరి 2022 వరకు నివాసం ఉండనున్నాడు. అదేరోజు తెల్లవారుజామున 4:53 గంటలకు ధనస్సురాశిలోకి ప్రయాణం చేయనున్నాడు. ఈ సందర్భంగా కుజుడు వృశ్చికరాశిలోకి రవాణా చేయడం వల్ల ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. ఏయే రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ 6 రాశుల వారు 2022లో సొంత ఇల్లు కొనే అదృష్టవంతులు కావచ్చు... మరి ఇక్కడ మీ రాశి ఉందో లేదో చూసేయండి?

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు కుజుడి రవాణా వల్ల కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీ ప్రత్యర్థులు మీపై కొన్ని కుట్రలు చేయొచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో కూడా కష్టంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. అయితే పనికి సంబంధించిన విషయాల్లో మాత్రం విజయం సాధిస్తారు. మరోవైపు ఈ కాలంలో మీరు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించారు. వివాహిత జంటలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : మహాశివుడిని పూజించి.. గోధుమలు దానం చేస్తే మంచి ఫలితాలొస్తాయి.

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి వారు అంగారకుడి సంచారం వల్ల వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఈ సమయంలో మీరు ఇతరులతో మంచి సంబంధాలను పెంచుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొంత డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. మీ కోపం మీ సంబంధాలను నాశనం చేస్తుంది. మీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే విజయం సాధిస్తారు. ఆరోగ్య పరంగా మంచిగానే ఉంటుంది.

పరిహారం : మీరు ఈ కాలంలో హనుమంతుడిని ఆరాధించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి కుజుడి రవాణా సంచారం వల్ల కొంత బలహీనంగా ఉంటుంది. అయితే మీరు కష్టపడటం వల్ల.. సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ కాలంలో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. మీరు ఫిట్ గా ఉండాలనుకుంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. కొత్త వెంచర్ ప్రారంభించడానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో, మంచి కెరీర్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు విజయం సాధిస్తారు.

పరిహారం : మంగళవారం రోజున ఎర్రచందనం దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది.

2022లో ఏఏ రాశికి ఏ నెల అదృష్ట మాసమో తెలుసా?

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి కుజుడి సంచారం వల్ల పని విషయంలో కొన్ని సవాళ్లు ఎదురుకావొచ్చు. మీ కార్యాలయంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ ప్రేమ జీవితంలో కొంత గందరగోళం ఉంటుందది. మీ సమస్యల పరిష్కారం కోసం మూడో వ్యక్తి సహాయం తీసుకోవాల్సి వస్తుంది.

పరిహారం : మంగళవారం రోజున బెల్లం దానం చేయాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు అంగారకుడి ప్రయాణం వల్ల కుటుంబ జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఇల్లు కట్టుకోవడానికి లేదా కొత్త వాహనం కొనేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు అనేక పెట్టుబడుల నుండి లాభాలను పొందుతారు. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. మీరు మీ మార్గంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. మీరు మానసికంగా మరియు శారీరకంగా కూడా అలసిపోయినట్లు అనిపించొచ్చు. మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడానికి అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండాలి. యోగా లేదా వ్యాయామం కోసం కొంత సమయం కేటాయించండి. ఈ సమయంలో విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.

పరిహారం : మీరు మణికట్టుపై వెండిగాజులను ధరిస్తే మంచి ఫలితాలు రావొచ్చు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి కుజుడి సంచారం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ నైపుణ్యాలను పెంచుకుంటారు. మీ ప్రేమ జీవితంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆర్థిక పరంగా ఈ కాలంలో మీరు రుణాల కోసం ఎదురుచూడొచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో బాగా రాణిస్తారు. మీరు కొత్త కోర్సును కూడా ఎంచుకోవచ్చు. ఆరోగ్య పరంగా ఈ కాలంలో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.

పరిహారం : మంగళవారం రోజున అనంతమూలం వేరును చేతికి లేదా మెడపై ధరిస్తే సానుకూల ఫలితాలొస్తాయి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు కుజుడి రవాణా సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే మీ సంబంధాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో వాదించడానికి బదులుగా పరిస్థితిని నిర్వహించాలి. మీరు వివాహం చేసుకోవాలని అనుకుంటే, తెలియని కారణాల వల్ల అది ఆలస్యం కావొచ్చు. మీరు మీ భాగస్వామికి ప్రేమ మరియు గౌరవం ఇవ్వాలి. మీరు విదేశాల్లో చదువుకోవాలన్నా.. అవకాశాల కోసం వెతుకుతున్న వారికి అంతా అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మంచిగానే ఉంటుంది.

పరిహారం : మంగళవారం రోజున శివలింగానికి గోధుమలు లేదా శనగలను సమర్పించొచ్చు.

వృశ్చికరాశి

వృశ్చికరాశి

ఈ రాశిలోకి కుజుడు సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకోవాలనుకుంటే అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకోవాలి. మరోవైపు ఈ కాలంలో వ్యాపార ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు కొన్ని ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. మీరు చేసే పనిలో కూడా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆస్తి లేదా వాహన కొనుగోలుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : రాగి మరియు ఎరుపు రంగు పువ్వులను దానం చేస్తే మంచి ఫలితాలు రావొచ్చు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి కుజుడి రవాణా వల్ల శుభప్రదంగా ఉంటుంది. మీకు శక్తివంతంగా అనిపించొచ్చు. ఈ సమయంలో మీ వివాహిత జంటలకు కొన్ని సమస్యలు రావొచ్చు. మీ జీవిత భాగస్వామితో కొంత ఇబ్బంది ఉండొచ్చు. అయినప్పటికీ ఈ కాలంలో మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. మీరు మీ తల్లిదండ్రుల పట్ల మరింత శ్రద్ధ వహించాలి.

పరిహారం : ఈ కాలంలో మీరు అంగార గ్రహానికి సంబంధించిన బీజ్ మంత్రాన్ని పఠించాలి.

మకర రాశి..

మకర రాశి..

కుజుడి రవాణా వల్ల ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు మీ సంబంధంలో అపార్థం ఉండొచ్చు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోరికలు నెరవేరొచ్చు. మరోవైపు ఆరోగ్య పరంగా కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి. పనికి సంబంధించి మీరు చాలా ఓపికగా ఉండాలి. మీకు ఈ సమయంలో స్నేహితులు చాలా చక్కగా సహాయపడతారు. మీ వ్యక్తిగత జీవితం కూడా బాగుంటుంది.

పరిహారం : మీరు వెండి పాత్రలను క్రమం తప్పకుండా వాడాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

కుజుడి సంచారం వల్ల ఈ రాశి వారు అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి గౌరవం లభిస్తుంది. మీరు ప్రత్యర్థుల విషయం జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీరు ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పూర్తి ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు.

పరిహారం : ఈ కాలంలో పేదలకు దానిమ్మపండు దానం చేస్తే మంచి ఫలితాలొస్తాయి.

మీన రాశి..

మీన రాశి..

కుజుడి రవాణా వల్ల ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. మీరు మీ భాగస్వామి ప్రాపంచిక జీవితం నుండి విరామం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. మీరు దీర్ఘకాలిక పెట్టుబడి గురించి ఆలోచించొచ్చు. విద్యార్థులు కష్టపడి పని చేస్తే ఆశించిన ఫలితాలు రావొచ్చు. ఈ కాలంలో వారు ఏదైనా కొత్త కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ కాలంలో వ్యాపారులు లాభాలను అర్జిస్తారు.

పరిహారం : మంగళవారం ఎర్ర పప్పు దానం చేస్తే శుభ ఫలితాలొస్తాయి.

కుజుడు డిసెంబరులో ఏ రాశి నుండి ఏ రాశిలోకి ప్రవేశించనున్నాడు?

2021వ సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీన ఉదయం 5:01 గంటలకు తుల రాశి నుండి వృశ్చికరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇక్కడే 4 జనవరి 2022 వరకు నివాసం ఉండనున్నాడు అదేరోజు తెల్లవారుజామున 4:53 గంటలకు ధనస్సురాశిలోకి ప్రయాణం చేయనున్నాడు.

English summary

Mars Transit in Scorpio on 05 December 2021, Effects on Zodiac Signs and Remedies in Telugu

Mangal rashi parivartan december 2021 in Vrishchik Rashi; Mars Transit in Scorpio Effects on Zodiac Signs in Telugu : The Mars Transit in Scorpio will take place on 05 December 2021. Learn about remedies to perform in Telugu
Story first published: Monday, December 6, 2021, 12:47 [IST]