For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mars Transit in Taurus : కుజుడు వృషభంలోకి సంచారం... ఈ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది...!

కుజుడు వృషభరాశిలోకి సంచారం చేసే సమయంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

నవగ్రహాలలో అంగారకుడు(కుజుడు)ని దేవతల సేనాధిపతిగా పిలుస్తారు. జ్యోతిష్యశాస్త్రం ఎంతో విశిష్టత కలిగిన అంగారకుడు ఫిబ్రవరి 22వ తేదీన తెల్లవారుజామున 4.33 గంటలకు మేష రాశి నుండి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు.

Mars Transit in Taurus on 22 February 2021 Effects on Zodiac Signs in Telugu

ఇదే రాశిలో దాదాపు నెలన్నర పాటు నివాసముండి.. తరువాత మిధున రాశిలో అడుగుపెడతాడు. ఇలా కుజుడు ఒక స్థానం నుండి మరో స్థానంలోకి మారే సమయంలో రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది..

Mars Transit in Taurus on 22 February 2021 Effects on Zodiac Signs in Telugu

ఈ సమయంలో ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది.. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

Venus Transit in Aquarius: కుంభంలోకి శుక్రుడి సంచారం... 2 రాశుల వారు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!Venus Transit in Aquarius: కుంభంలోకి శుక్రుడి సంచారం... 2 రాశుల వారు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి అంగారకుడు వృషభరాశిలోకి అడుగు పెట్టడం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో అనైక్యత మరియు మానసిక క్షోభ పెరుగుతుంది. కానీ ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. వ్యాపారులకు పురోగతి లభిస్తుంది. మీరు ఖర్చులను నియంత్రించడం ద్వారా మీకు ఎక్కువ విజయాలు లభిస్తాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. రియల్ ఎస్టేటుకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి.

పరిహారం : ఈ కాలంలో వెండి లేదా రాగితో చేసిన నాణ్యత గల ఎర్రని పగడాలను ధరించండి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశిలోకి అంగారకుడు అడుగు పెట్టడం వల్ల వృషభరాశి వారు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మరోవైపు వ్యాపారులకు హెచ్చుతగ్గులుంటాయి. ఉద్యోగులు కష్టపడి పని చేయలి. అధికారులతో వివాదాలు పెట్టుకోవద్దు. వివాదాల నుండి దూరంగా ఉండండి.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం సుబ్రహ్మణ్యం స్వామిని పూజించండి.

మిథున రాశి..

మిథున రాశి..

అంగారకుడు వృషభరాశిలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి ఎక్కువ ఖర్చులు ఉంటాయి. అంతేకాదు చాలా విషయాల్లో అడ్డంకులు ఎదురవుతాయి. మీరు స్నేహితులు లేదా బంధువుల నుండి ప్రతికూల వార్తలను వినొచ్చు. ఈ సమయంలో మీరు ఎవ్వరికీ డబ్బు ఇవ్వకండి. లేకపోతే మీరు సమయానికి డబ్బును స్వీకరించే అవకాశం తక్కువగా ఉంటుంది. ప్రతి చర్య మరియు నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.

పరిహారం : దుర్గాదేవిని ఎర్రని పువ్వులతో ఆరాధించండి.

ఏఏ రాశుల వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలరు..అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి...ఏఏ రాశుల వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలరు..అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

వృషభరాశిలోకి అంగారకుడు రవాణా చేసినప్పుడు మీ విజయానికి బ్రేకులు పడొచ్చు. అయితే మీరు మొక్కవోని ధైర్యంతో క్లిష్టమైన పరిస్థితులను సులభంగా అధిగమిస్తారు. దీని వల్ల మీ గౌరవం పెరుగుతుంది. సామాజిక హోదా ప్రతిష్ట కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మరియు సోదరుల మధ్య విభేదాలు పెరగనివ్వవద్దు. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : శుభఫలితాల కోసం రెగ్యులర్ గా భజరంగిని ఆరాధించండి.

సింహ రాశి..

సింహ రాశి..

అంగారకుడు వృషభరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం రావొచ్చు. భూమి, ఆస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు లభించొచ్చు. కోర్టు కేసులు ఉన్న వారికి విజయం లభిస్తుంది. శత్రువులపై మీరు ఆధిపత్యం చెలాయిస్తారు.

పరిహారం : హనుమంతుడికి మంగళవారం రోజు స్వీట్లు ఇవ్వండి.

కన్య రాశి..

కన్య రాశి..

అంగారకుడు వృషభరాశిలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారు ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరోవైపు మీకు మతం మరియు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. విదేశీ సంస్థలలో ఉపాధి లేదా పౌరసత్వం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు తీసుకున్న నిర్ణయం మరియు చర్యలు కూడా ప్రశంసించబడతాయి.

పరిహారం : ఈ కాలంలో మంగల్ స్తోత్ర పారాయణం చేయాలి.

అంగారకుడు మేషరాశిలోకి ప్రవేశిస్తే.. ఈ 6 రాశుల వారికి అద్భుత ఫలితాలు...!అంగారకుడు మేషరాశిలోకి ప్రవేశిస్తే.. ఈ 6 రాశుల వారికి అద్భుత ఫలితాలు...!

తుల రాశి..

తుల రాశి..

అంగారకుడు వృషభరాశిలోకి అడుగు పెట్టే సమయంలో ఈ రాశ వారికి కొంత హెచ్చుతగ్గులు ఉంటాయి. మీరు కష్టపడి పనిచేస్తే, మీరు అదృష్టవంతులు కావచ్చు. మీ గత జన్మ ఫలాలు ప్రస్తుత ఫలితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆరోగ్య సమస్యలపై జాగ్రత్త వహించండి. చాలా జాగ్రత్తగా ప్రయాణించండి మరియు ఇబ్బందులను నివారించండి. కోర్టు కేసులలో కూడా విజయం లభించొచ్చు. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు అధ్యయనాలపై చాలా శ్రద్ధ వహించాలి.

పరిహారం : ఈ కాలంలో నరసింహ దేవుని కథను వినండి లేదా చదవండి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

అంగారకుడు వృషభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు క్షీణించవచ్చు. అవివాహితులకు వివాహ పనులు ఆలస్యం కావొచ్చు. నిరుద్యోగులకు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగాలు అందుబాటులో ఉండవచ్చు. మరోవైపు మీరు చేసే వ్యాపారంలో భాగస్వామ్యం లేకుండా చూసుకోండి. ఈ కాలంలో ఎవరికీ ఎక్కువ రుణాలు ఇవ్వకండి. లేకుంటే నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

పరిహారం : మీ కుడి చేతి ఉంగరపు వేలికి రాగి లేదా బంగారంతో కూడిన నాణ్యత గల పగడాన్ని ధరించాలి.

ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి..

అంగారకుడు వృషభరాశిలోకి అడుగు పెట్టే సమయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్కు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. మీ కోర్టు కేసులలో తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులతో సంబంధాలు బలపడతాయి. మిమ్మల్ని తక్కువ అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్న వారు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఈ కాలంలో ఎన్నికలకు సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే, విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : ప్రతిరోజూ ఉదయాన్నే హనుమాన్ చాలీసా పఠించాలి.

మకర రాశి..

మకర రాశి..

అంగారకుడు వృషభరాశిలోకి అడుగు పెట్టినప్పుడు ఈ రాశి విద్యార్థులకు ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి. అయితే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలలో ఉదాసీనత ఉంది. కొత్త దంపతులకు పిల్లలు పుట్టే అదృష్టం ఉంది. ఈ సమయం వ్యాపారులకు మరింత అనుకూలంగా ఉంటుంది మరియు వారు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మాత్రం విజయానికి అవకాశాలు చాలా ఉన్నాయి.

పరిహారం : మంగళవారం రోజున హనుమాన్ ఆరాధన చేసి, స్వీట్లు పంచండి.

కుంభ రాశి..

కుంభ రాశి..

అంగారకుడు వృషభరాశిలోకి రవాణా చేసే సమయంలో ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో అసమ్మతి పెరుగుతుంది. దీంతో మీరు మానసిక క్షోభకు గురవుతారు. స్నేహితులు మరియు బంధువుల నుండి చెడు వార్తలను వినొచ్చు. మరోవైపు మీ ఖర్చులను మీరు అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సహోద్యోగుల పట్ల సక్రమంగా ప్రవర్తించాలి. లేదంటే మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు.

పరిహారం : ప్రతిరోజూ ఉదయాన్నే గాయత్రి మంత్రాన్ని జపించాలి.

మీన రాశి..

మీన రాశి..

అంగారకుడు వృషభరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు క్లిష్ట పరిస్థితులను సైతం ధైర్యంగా, సులభంగా అధిగమిస్తారు. మరోవైపు మీకు రుణగ్రహీతల సంఖ్య పెరుగుతుంది. ట్రేడింగ్ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు ఆర్థిక నష్టాన్ని నివారించలేరు. మతం మరియు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. విదేశీ పౌరసత్వం కోసం ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

పరిహారం : ప్రతిరోజూ కాలభైరవుడిని ఆరాధించడం వల్ల పవిత్రంగా ఉంటుంది.

English summary

Mars Transit in Taurus on 22 February 2021 Effects on Zodiac Signs in Telugu

Here we are talking about the mars transit in Taurus on 22 February 2021 effects on zodiac signs in Telugu. Read on,
Story first published:Saturday, February 20, 2021, 12:23 [IST]
Desktop Bottom Promotion