Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
మరో రికార్డు సాధించిన మహిళా స్టార్ బాక్సర్ మేరీ కోమ్..
ఇద్దరు పిల్లల తల్లి అయిన 36 ఏళ్ల మేరీ కోమ్ సెప్టెంబర్ 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు రష్యాలో ప్రారంభమయ్యే ప్రపంచ ఛాంపియన్ లో మరోసారి పాల్గొననుంది.
భారతదేశంలోని ప్రముఖ మహిళా బాక్సర్ ఛాంపియన్ మేరీ కోమ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన ఆమెకు అంతర్జాతీయంగా మరోసారి అదిరిపోయే గుర్తింపు దక్కింది. ఆసియా స్పోర్ట్స్ రైటర్స్ యూనియన్ (ఎఐపిఎస్) ఉత్తమ మహిళా అథ్లెట్ గా ఎంపికైంది. ఇప్పటికే ఆరుసార్లు అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ లు సాధించిన ఈమెకు ఎఐపిఎస్ నిర్వహించిన తొలి 'అవార్డ్స్ ఫర్ ఆసియా' కార్యక్రమంలో మేరో కోమ్ ఉత్తమ మహిళా అథ్లెట్ గా ఎంపికైంది. పురుషుల విభాగంలో దక్షిణ కొరియాకు చెందిను ఫుట్ బాల్ సాటర్ సోన్ హ్యుంగ్-మిన్ ఉత్తమ పురుష అథ్లెట్ గా ఎంపికయ్యాడు.

ఇద్దరు పిల్లల తల్లి అయిన 36 ఏళ్ల మేరీ కోమ్ సెప్టెంబర్ 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు రష్యాలో ప్రారంభమయ్యే ప్రపంచ ఛాంపియన్ లో మరోసారి పాల్గొననుంది. ఈమె జనరల్ వెయిట్ కేటగీరీ 48 కిలోలు కాగా, ఈసారి పాల్గొనబోయే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఆమె 51 కిలోల ఫ్లై వెయిట్ విభాగంలో పోటీ చేయనుంది.

ఏడోసారి ప్రపంచ ఛాంపియన్ షిప్ గా పసిడి పతకాన్ని సాధిస్తే క్యూబా లెజెండ్ ఫెలిక్స్ సావోన్ ను రికార్డును అధిగమించనుంది. అలాగే వచ్చే ఏడాది అంటే 2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కు సైతం ఈమె ఎంపికైంది.
మేరీకోమ్ సాధించిన విజయాలకు ఆమెకు అనేక అవార్డులు వచ్చాయి. లండన్ ఒలింపిక్స్ లో భారత్ తరపున మెడల్ సాధించిన ఆ మణిపూర్ మహిళకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తొలుత 50 లక్షల రివార్డు ప్రకటించింది.

అనంతరం దాన్ని 75 లక్షలకు పెంచింది. దాంతో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంకును కూడా కేటాయించింది.

మరోవైపు ఆసియా మరియు దక్షిణ కొరియా ఫుట్ బాల్ కు చేసిన కృషికి సాటర్ సోన్ కు అవార్డు లభించింది. ప్రీమియర్ లీగ్ మరియు ఛాంపియన్స్ లీగ్ లో టోటెన్ హామ్ తరపున ఆడుతున్న సోన్ గత సంవత్సరం జరిగిన ఆసియా క్రీడలలో దక్షిణ కొరియా తరపున స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఇందుకు గాను అతను ఎఐపిఎస్ అవార్డుకు ఎంపికయ్యాడు.



Click it and Unblock the Notifications
