For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Republic Day 2022 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన తొలి మహిళ ఎవరో తెలుసా...

భారత గణతంత్ర వేడుకల్లో తొలి మహిళా కెప్టెన్ గా పరేడ్ లో పాల్గొన్న తానియా గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

|

జనవరి 26వ తేదీ అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. 2021వ సంవత్సరంలో 72వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్నారు. ఇదే ప్రత్యేకమైన విషయమంటే.. ఈ రోజు చిరకాలం గుర్తుండిపోయేలా సన్నాహాలను ఏర్పాట్లు చేస్తున్నారు.

Meet Captian Tania Shergil the 1st Woman Republic Day Parade adjutant

మన మహిళా జవాన్లు 2019లో తొలిసారిగా పూర్తిగా మహిళలతో కూడిన ఓ దళం(All woman contigent) రాష్ట్రపతికి గౌరవ వందనం చేయడం విశేషం. అందులో కొందరు మహిళా జవాన్లు దేశం కోసం ప్రాణాలను అర్పించిన సైనికుల కుటుంబ సభ్యులు కావడం ఈ గౌరవ వందనానికి మరింత ప్రత్యేకతను జోడించింది. మరో విశేషమేమిటంటే.. గతేడాది రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాజ్ పథ్ లో 147 మంది పురుషుల గ్రూపుకు ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ కమాండ్ అధికారి తాన్య షెర్గిల్ నాయకత్వం వహించారు. ఇలా పరేడ్ అడ్జటెంట్(మిలిటరీ ఆఫీసర్) అయిన సైన్యంలో మొదటి మహిళ ఆమె కావడం విశేషం. అడ్జ్యూటెంట్ సాధారణంగా కమాండింగ్ ఆఫీసర్ ను నియమిస్తాడ మరియు కరస్పాండెన్స్ చూసుకుంటారు. అయితే గతేడాది జరిగిన ఆర్మీడే పరేడ్ కు నాయకత్వం వహించినప్పుడు ఒక్కసారిగా తాన్య వెలుగులోకి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా తాన్య గురించి చర్చ మొదలైంది. ఎవరీ తాన్య.. పురుషుల టీమ్ కు ఆమె నాయకత్వం ఎలా వహించిందనే విషయాలను కనుక్కోవడం మొదలెట్టారు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీకోసం తీసుకొచ్చాం.

Meet Captian Tania Shergil the 1st Woman Republic Day Parade adjutant

పంజాబ్ లోని హోషియార్ పూర్ కు చెందిన 26 ఏళ్ల తాన్య జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ కవాతుకు ఆకర్షణగా మారింది. వాస్తవానికి, తాన్య షెర్గిల్ పేరు నాలుగో తరం సైనిక అధికారి బట్టి ఆమె చర్చ మొత్తం అప్పుడు వైరల్ అయిపోయింది.

తాన్యా 2017 సంవత్సరంలో చెన్నైలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో బిటెక్ పూర్తి చేసింది. అక్కడే చెన్నై ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ నుండి కమిషన్ అందుకుంది. అయితే తాన్య తన ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత, సైన్యంలో చేరాలని నిర్ణయించుకుంది.

FAQ's
  • రిపబ్లిక్ వేడుకల్లో తొలిసారిగా పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన మహిళ ఎవరు?

    రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాజ్ పథ్ లో 147 మంది పురుషుల గ్రూపుకు ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ కమాండ్ అధికారి తాన్య షెర్గిల్ నాయకత్వం వహించారు. పంజాబ్ లోని హోషియార్ పూర్ కు చెందిన 26 ఏళ్ల తాన్య జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ కవాతుకు ఆకర్షణగా మారింది. వాస్తవానికి, తాన్య షెర్గిల్ పేరు నాలుగో తరం సైనిక అధికారి బట్టి ఆమె చర్చ మొత్తం అప్పుడు వైరల్ అయిపోయింది.

English summary

Meet Captian Tania Shergil the 1st Woman Republic Day Parade adjutant

Captain Tania Shergill, an officer with Armys Corps of Signals, will be the first woman parade adjutant for the Republic Day parade. A parade adjutant is responsible for the parade.
Desktop Bottom Promotion