For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అయోధ్య రామ మందిరం పేరు చెప్పగానే ఎవరెవరి పేర్లు గుర్తుకొస్తాయో తెలుసా...

|

మన దేశంలో ఆగస్టు 5వ తేదీన 'అంతా రామమయం' గా మారిపోయింది.. రాముడు జన్మభూమి అనే హిందువులు నమ్మే అయోధ్యలో అపూర్వ ఘట్టానికి కీలక అడుగు పడింది. ఆ ప్రాంతంలో రామ మందిరం కోసం ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వారి కల అత్యంత త్వరలో నెరవేరబోతోంది.

ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ముందు భూమి పూజ చేశారు.

ఇప్పటికే మీడియా.. సోషల్ మీడియా అంతటా రామ నామస్మరణను జపిస్తున్నాయి. ప్రస్తుతం భారతీయులంతా అయోధ్యపైనే ఫోకస్ పెట్టారు.

అయితే అయోధ్యలో ఇంతటి మహత్తర ఘట్టానికి ముఖ్యపాత్ర పోషించిన వారెవరు? అయోధ్య రామ మందిర ఉద్యమం పేరు చెప్పగానే లాల్ క్రిష్ణ అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ వంటి వారి పేర్లే ప్రముఖంగా ఎందుకు వినిపిస్తున్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడా? వాస్తవాలేమిటి? చరిత్ర ఏం చెబుతోంది...

ఎల్ కే అద్వానీ..

ఎల్ కే అద్వానీ..

1990 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ(భాజపా) మాజీ అధ్యక్షులు అయోధ్య రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అద్వానీ రథయాత్ర చేపట్టడంతో దేశవ్యాప్తంగా ఆయనకు ఊహించని మద్దతు వచ్చింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో శివసేన అధినేత ఠాక్రే కూడా అద్వానీని కలిసి మద్దతు ప్రకటించారు.

అశోక్ సింఘాల్..

అశోక్ సింఘాల్..

అయోధ్య రామ మందిరం ఉద్యమంలో విశ్వహిందూ పరిషత్ కు సుమారు 20 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పని చేసిన అశోక్ సింఘాల్ కూడా పాల్గొన్నారు. ఆయన అయోధ్య వివాదాన్ని భూవివాదం కన్నా విభిన్నంగా దీన్ని చూశారు. దీనిని జాతీయ ఉద్యమంగా తీర్చిదిద్దడంలో ఈయన పాత్ర కూడా మరువలేనిదని, ప్రస్తుత ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు. అంతేకాదు ఆయన ఒక అడుగు ముందుకేసి అశోక్ సింఘాల్ కు ‘భారతరత్న' ఇవ్వాలని ట్వీట్ చేశారు.

ఉమాభారతి..

ఉమాభారతి..

రామ మందిర ఉద్యమంలో అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉమాభారతి కూడా పాల్గొన్నారు. 2003లో ఆమె భాజపాపై తిరుగుబాటు చేసినప్పటికీ, మళ్లీ అదే పార్టీలో చేరారు. నరేంద్ర మోడీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె కేంద్ర మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు.

భూమి పూజకు అంతటి శక్తి ఉందా? అందుకే అయోధ్యలో భూమి పూజకు అంత ప్రాధాన్యత ఏర్పడిందా?

మనోహర్ జోషి ఇతరులు..

మనోహర్ జోషి ఇతరులు..

ఈ అయోధ్య రామ మందిర ఉద్యమంలో అద్వానీ, అశోక్ సింఘాల్ తో మరో పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనే మురళీ మనోహర్ జోషి. ఈయనొక్కటే కాదు. ఇతనితో పాటు వినయక్ కటియార్, సాధ్వీ రితభర, ప్రవీణ్ తోగాడియా, విష్ణుహరి దాల్మియా వంటి వారు పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి.

ఉద్యమ నిర్మాత ఎవరంటే..

ఉద్యమ నిర్మాత ఎవరంటే..

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నిర్మాత ఎవరంటే చాలా మందికి గుర్తుకొచ్చే పేరు అశోక్ సింఘాల్. ఈయన 2011 వరకు విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసిన అనంతరం 2015 నవంబర్ 17వ తేదీన మరణించారు.

రథయాత్ర అక్కడి నుంచే ప్రారంభం..

రథయాత్ర అక్కడి నుంచే ప్రారంభం..

అద్వానీ రామ మందిర నిర్మాణం కోసం గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం నుండి అయోధ్య వరకు రథయాత్రను ప్రారంభించారు. అయితే అప్పుడు బీహార్ సీఎంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీని సమస్తిపూర్ జిల్లాలో అరెస్టు చేశారు. 1992 డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో మసీదు కూల్చివేతకు కుట్రపన్నారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేసినట్లు చార్జీషీటులో పేర్కొన్నారు.

అద్వానీ తర్వాత ఆయనే..

అద్వానీ తర్వాత ఆయనే..

అయితే 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అద్వానీ తర్వాత మురళీ మనోహర్ జోషి పేరు ప్రముఖంగా వినిపించింది. మసీదు కూల్చివేత సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. వారణాసి, అలహాబాద్, కాన్పూర్ నియోజకవర్గాలకు ఆయన ఎంపీగా కూడా పని చేశారు.

కళ్యాణ్ సింగ్..

కళ్యాణ్ సింగ్..

బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కళ్యాణ్ సింగ్ యూపీ సీఎంగా ఉన్నారు. ఆయన ప్రభుత్వంలోని అధికారులు, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే మసీదు కూల్చివేతను అడ్డుకోలేదని ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికి కళ్యాణ్ సింగ్ భాజపా గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే కొన్నేళ్ల తర్వాత తిరిగి అదే పార్టీలో చేరారు.

వీరి పేర్లే ఎక్కువగా...

వీరి పేర్లే ఎక్కువగా...

విశ్వ హిందూ పరిషత్ కు చెందిన మరో ప్రముఖ నాయకుడు ప్రవీణ్ తోగాడియా రామ మందిర ఉద్యమంలో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. అశోక్ సింఘాల్ తర్వాత బాధ్యలన్నీ ఆయనకు అప్పగించారు.

అయోధ్య రామ మందిరం పేరు చెప్పగానే వీరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. వీరు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించడం వల్ల ప్రస్తుతం అక్కడ రామ మందిర నిర్మాణం సాధ్యమయ్యింది భాజపా పెద్దలంతా చెబుతున్నారు.

English summary

Memorable names of Ayodhya Rama Mandir

Here are the memorable names of Ayodhya Rama Mandir. Take a look.