For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధుడు తులరాశిలోకి ఎంట్రీ ఇస్తే.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టమో చూసెయ్యండి...!

తులరాశిలోకి బుధుడి ఎంట్రీ ఇవ్వడం వల్ల ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలలో యువరాజు బుధుడు. ఈ బుధుడు కన్య రాశిని వదిలి తులరాశిలోకి అక్టోబర్ 2020 14వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు ఉండి నవంబర్ 3వ తేదీన ప్రత్యక్షంగా మారి.. నవంబర్ 28వ తేదీన వృశ్చికరాశిలోకి మారనున్నాడు.

Mercury In Retrograde In Libra from 14 October 2020 Know the Impact on All Zodiac Signs in telugu

ఇలా బుధుడు తులరాశిలోకి సంచరించే సమయంలో కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రాశిచక్రాల వారి జాతకాన్ని బట్టి బుధుడు ఉన్నత స్థానంలో ఉంటే కొన్ని రాశుల వారికి చాలా అదృష్టం కలిసి వస్తుందట.

Mercury In Retrograde In Libra from 14 October 2020 Know the Impact on All Zodiac Signs in telugu

బుధుడి అనుగ్రహం వల్ల మీరు ఏ పని చేపట్టినా చాలా సులభంగా పూర్తవుతుంది. విద్యార్థులు విద్యలో.. ఉద్యోగులు కార్యాలయంలో.. వ్యాపారులు వ్యాపారంలో.. ఇతర సంపద వచ్చే మార్గాలకు బుధుడు కారణమని భావిస్తారు.

Mercury In Retrograde In Libra from 14 October 2020 Know the Impact on All Zodiac Signs in telugu

ఈ సందర్భంగా బుధుడు కన్య రాశి నుండి తన స్థానాన్ని మార్చుకుని తులరాశిలోకి ప్రవేశించే సమయంలో ఏయే రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి..ఏయే రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి.. ఈ సమయంలో బుధుడి బలహీనతను అధిగమించేందుకు ఏయే పరిహారాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ వారం మీ రాశి ఫలాలు అక్టోబర్ 11 నుండి 17వ తేదీ వరకు...ఈ వారం మీ రాశి ఫలాలు అక్టోబర్ 11 నుండి 17వ తేదీ వరకు...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఏడో స్థానంలో తిరోగమనం కానున్నాడు. ఈ సమయంలో మీ వైవాహిక జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదురవుతాయి. వ్యాపారులు భాగస్వాములతో మంచి సంబంధాలు కొనసాగించాలి. లేకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ అవసరాలను తీర్చడానికి డబ్బులు ఖర్చు చేయొచ్చు. ఉద్యోగులకు అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీరు ఇతర ఆదాయ వనరుల గురించి తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపండి.

పరిహారం : ‘విష్ణు సహస్రానం' అని పఠించడం వల్ల శుభఫలితాలొస్తాయి..

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి చక్రం ఆరో స్థానంలోకి బుధుడు తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో ఉద్యోగులకు కార్యాయలంలో సమస్యలు ఎదురుకావచ్చు. మీరు ఆఫీస్ పాలిటిక్స్ కి దూరంగా ఉండండి. ఆర్థిక పరంగా ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. మీరు డబ్బులు ఖర్చు చేయడంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

పరిహారం : తులసి చెట్టుకు ప్రతిరోజూ నీరు పోయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి చక్రం నుండి బుధుడు ఐదో స్థానంలో కదలనున్నాడు. ఈ సమయంలో మిధున రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు కూడా భవిష్యత్ ప్రణాళికలను వేసుకుంటారు. మీ ప్రతిభను చూపించే అవకాశం కూడా లభిస్తుంది. మీ కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి. వారి నుండి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మీ వివాహ జీవితంలో ఉత్తమమైన సమయం అవుతుంది. సంబంధాలు బలపడతాయి.

పరిహారం : మీ కుడి చేతి చిటికిన వేలికి బంగారు ఉంగరాన్ని ధరించండి.

బతుకమ్మ పండుగను పూలతోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా...!బతుకమ్మ పండుగను పూలతోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి చక్రం నుండి బుధుడు నాలుగో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి శారీరక సుఖాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఇంటి మరమ్మతులు కోసం సమయం కేటాయిస్తారు. మీ వైవాహిక జీవితంలో కొత్తదనంగా అనిపిస్తుంది. అయితే మీరు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు.

పరిహారం : వెండి గాజులో నీరు తాగడం వల్ల మంచి ఫలితాలొస్తాయి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి చక్రం నుండి బుధుడు మూడో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. మీ నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ఈ సమయంలో మీ కుటుంబంలో అనుకూలమైన ఫలితాలొస్తాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగులు పై అధికారులను సంప్రదించడం ద్వారా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు కోరుకున్న ఫలితాలను పొందుతారు.

పరిహారం : వినాయకుడికి గరికను సమర్పించడం ద్వారా శుభఫలితాలొస్తాయి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి చక్రం నుండే బుధుడు తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కన్యరాశి వారు కాసులను పోగు చేసుకోవడంలో సఫలం అవుతారు. మీ కుటుంబ భవిష్యత్తును నిర్ణయించే ప్రణాళిక విజయవంతమవుతుంది. వ్యాపారులకు ఏదైనా పెట్టుబడి పెట్టే విషయంలో సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు ఈరోజు కష్టపడాల్సి ఉంటుంది. మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించండి.

పరిహారం : గోమాతకు పశుగ్రాసం అందించాలి.

అక్టోబరులో పుట్టిన వారికి ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుందట... అవేంటో చూసేయ్యండి...!అక్టోబరులో పుట్టిన వారికి ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుందట... అవేంటో చూసేయ్యండి...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశిచక్రంలోకి బుధుడు సంచరించనున్నాడు. అంటే మొదటిస్థానంలో ఉండబోతున్నాడు. ఈ సమయంలో తుల రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు ఎవరికైనా సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. మీరు భూమి మరియు వాహనాలను కొనాలని ఆలోచిస్తుంటే, ఆ కోరిక కూడా నెరవేరుతుంది. మీకు కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. వారి వల్ల మీరు భవిష్యత్తులో ప్రయోజనం పొందుతారు.

పరిహారం : బుధవారం రోజున యువతులకు స్వీట్లు దానం చేయాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి చక్రం నుండి బుధుడు 12వ స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీ ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారులకు పెట్టుబడి పెట్టేందుకు సమయం సరైనది కాదు. మీరు చట్టపరమైన వివాదాల్లో చిక్కుకోవచ్చు. అయితే మీకు మానసిక శాంతి లభిస్తుంది.

పరిహారం : రాధాక్రిష్ణులకు ప్రార్థనలు చేయాలి..

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి చక్రం నుండి బుధుడు 11వ స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి తోబుట్టువుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వారితో మీరు మంచి సమయం గడుపుతారు. ఆర్థిక పరమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారులు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కూడా పొందుతారు.

పరిహారం : బుధవారం జోగినిలకు డబ్బు లేదా ఆహారం దానం చేయాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి చక్రం నుండి బుధుడు 10వ స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో రాజకీయాలలో ఉండే వారు అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మీరు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఆఫీసులో అందరి నుండి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మీ పని సామర్థ్యం పెరుగుతుంది. మీకు కొత్త సాంకేతిక పరిజ్ణానం లభిస్తుంది. దీని నుండి మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు.

పరిహారం : బుధుడి ఫలితాలను పొందడానికి తేలికపాటి కర్పూరంతో ఏదైనా దేవాలయంలో హారతి ఇవ్వాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి చక్రం నుండి బుధుడు తొమ్మిదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో కుంభ రాశి వారు శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగుల పనితీరును సీనియర్లు మెచ్చుకుంటారు. మీరు మీ ప్రియమైన వారి నుండి బహుమతులను కూడా అందుకుంటారు. మీరు వివాహం చేసుకుంటే.. మీ సంబంధం బలపడుతుంది. మీ కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది.

పరిహారం : పుస్తకాలను మరియు రచనా సాధనాలను దానం చేస్తే.. బుధుడి యొక్క శుభ ఫలితాలను పొందొచ్చు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి చక్రం నుండి బుధుడు ఎనిమిదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీన రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ భాగస్వామితో బంధం ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు కూడా సమయం ప్రతికూలంగా ఉంటుంది. ప్రభుత్వ విషయాల గురించి ఎక్కువ ఆలోచించి.. చిక్కుల్లో పడకండి..

పరిహారం : బుధుడి సంచారం సమయంలో బుధగ్రహ మంత్రాన్ని జపించండి.

English summary

Mercury Retrograde In Libra from 14 October 2020 Know the Impact on All Zodiac Signs in telugu

Mercury will turn retrograde and enter Libra on 14th October 2020. Check out the effects on all zodiac signs, and learn about remedies to perform in Telugu.
Desktop Bottom Promotion