For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mercury Transit in Aquarius : బుధుడు కుంభరాశిలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారు జర భద్రం...!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలలో బుధుడి స్థానం ప్ర్యతేకమైనది. అలాంటి బుధుడు జనవరి 25వ తేదీన అంటే సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటల 19 నిమిషాలకు బుధుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు.

సాధారణంగా బుధుడు మన మేధస్సు, విజ్ణానశాస్త్రం, వ్యాపారం, కమ్యూనికేషన్ వంటి వాటికి కారణమని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. బుధుడు మకరం నుండి కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రతి ఒక్కరాశిచక్రంపై కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అనేది ఉంటుంది.

ఈ సందర్భంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. ఎవరెవరికి సానుకూల, ప్రతికూల ఫలితాలుంటాయి.. ఏయే రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు కలుగుతాయనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం...

ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి బుధుడు పదకొండో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ బంధువులతో సంబంధంలో మెరుగుదల కనిపిస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా కనిపించేది. విద్యార్థులు కూడా విజయం సాధించే అవకాశం ఉంది.

పరిహారం : ఈ రాశి వారు బుధుడి మంత్రాన్ని జపించాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి నుండి బుధుడు పదో స్థానం గుండా రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వచ్చే ఉంది. వ్యాపారులు ఈ కాలంలో తమ వ్యాపారాన్ని పెంచుకుంటారు. మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరంగా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో ‘విష్ణు సహస్రనామం' జపించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి బుధుడు తొమ్మిదో స్థానం నుండి కుంభ రాశిలోకి ఆగమనం చేయనున్నాడు. ఈ సమయంలో మిధున రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారులు కొత్త పనులను ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కోరుకున్న విశ్వవిద్యాలయాలలో మరియు ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం పొందే అవకాశం ఉంది.

పరిహారం : బుధవారం రోజున ఆవుకు పచ్చని గడ్డి ఆహారంగా పెట్టండి.

Taurus Horoscope 2021 : వృషభరాశి వారు సంపద పెంచుకుంటారు.. అది ఎప్పుడంటే...?

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఎనిమిదో స్థానం ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయమైన చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. లేదంటే మీరు ప్రతికూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు మాత్రం ఆఫీసులో తమ పనులను సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారులు ఆదాయంలో మెరుగుదల చూడకపోవచ్చు. మరోవైపు మీ పాత అప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం మీ ఇంట్లో కర్పూరంతో హారతి వెలిగించి దేవుడిని ప్రార్థించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఏడో స్థానం గుండా రవాణా చేయనున్నారు. ఈ సమయంలో సింహ రాశి వారికి ఊహించని ఫలితాలు ఎదురవుతాయి. మీ వైవాహిక జీవితంలో అద్భుతంగా ఉంటుంది. మీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను పెంచకుంటారు. ఈ కాలంలో మీరు సౌకర్యాలు మరియు విలాసాలు కూడా పెంచుకుంటారు. విద్యార్థులు ఈ సమయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది.

పరిహారం : మీ కుడి చేతి చిన్న వేలికి బంగారం లేదా వెండితో రూపొందించిన ఉంగరాన్ని ధరించండి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఆరో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో కన్య రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడి రవాణా వల్ల మీకు చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఆరోగ్యంపై చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య కారణాల వల్ల మీ పనులు పెండింగులో పడిపోవచ్చు. వీటితో మరిన్ని సమస్యలను అధిగమించేందుకు మీరు చాలా ఆశాజనకంగా ఉండాలి.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం ‘గజేంద్ర మోక్ష స్తొత్రం' పఠించాలి.

ఈ ఫెంగ్ షూయ్ చిట్కాలతో కేవలం అదృష్టమే కాదు.. దేనిలోనైనా విజయం సాధిస్తారట...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఐదో స్థానం గుండా ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో విద్యార్థులు మాత్రమే అనుకూల ఫలితాలు పొందుతారు. వివాహితులకు ఈ సమయం ప్రతికూలంగా ఉండొచ్చు. ఉద్యోగులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా పని చేయాలి. సొంత వ్యాపారం ఉన్న వారికి వ్యాపారంలో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది.

పరిహారం : బుధవారం రోజున పేదలకు బట్టలు లేదా ఆహారం దానం చేయాలి.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

ఈ రాశి నుండి బుధుడు నాలుగో స్థానం గుండా ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. అయితే ఈ కాలంలో మీరు ఖర్చులు కూడా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు తర్వాత చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు కూడా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.

పరిహారం : ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు పోసి ఆరాధించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి బుధుడు మూడో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి కొంత గందరగోళంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబం మరియు స్నేహితులు, పొరుగువారితో కొన్ని ఇబ్బందులు రావొచ్చు. దీని వల్ల మీ ఇంటి వాతావరణం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. మరోవైపు ఈ సమయం వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి బుధుడు రెండో స్థానం ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు కొత్త ఇల్లు లేదా భూమి వంటి ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు కూడా ఈ సమయం అనేక లాభాలను పొందుతారు. అయితే విద్యార్థులు ఈ సమయం ఎక్కువగా ఆందోళన చెందుతారు. కాబట్టి మీరు ఒత్తిడి లేకుండా ముందుకు సాగాలి.

పరిహారం : బుధవారం రోజున అత్త, మామలకు బహుమతులు ఇస్తే శుభప్రదంగా ఉంటుంది.

కుంభ రాశి..

కుంభ రాశి..

నవ గ్రహాలలో ప్రత్యేక స్థానమున్న బుధుడు ఈ రాశిలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సమయంలో కుంభ రాశి వారికి ఆసక్తికరమైన ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకున్న వారి జీవితంలో పురోగతి కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు, ప్రేమ మరియు అభించే అవకాశం ఉంది.

పరిహారం : బుధవారం రోజున ఆకుపచ్చ రంగులోని వస్తువులను దానం చేయాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి బుధుడు పన్నెండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఎక్కువ ఖర్చులు ఉంటాయి. మీ ప్రత్యర్థులు కూడా ఈ సమయంలో చాలా చురుకుగా ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఆలోచనలు మరియు విధానాలను సమర్థవంతంగా అమలు చేయలేకపోవచ్చు. వ్యాపారులు కూడా ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

పరిహారం : బుధవారం మీరు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరిస్తే శుభఫలితాలు రావొచ్చు.

English summary

Mercury Transit in Aquarius on 25 January 2021 Effects on Zodiac Signs in Telugu

Here we talking about the mercury transit in aquarius on 25 january 2021 effects on zodiac signs ins Telugu.