For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధుడు మకరంలోకి ఎంట్రీ ఇస్తే.. ఏ రాశి వారిపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటే...!

|

2021 ఆంగ్ల నూతన సంవతర్సంలో బుధ గ్రహం దాని స్థానాన్ని మారనున్నాడు. జనవరి 5వ తేదీన తెల్లవారుజామున 3:42 గంటలకు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఇదే రాశిలో జనవరి 25వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. ఆ తర్వాత మకరం నుండి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఇదే సమయంలో ఈ రాశిలో గురుడు, శని గ్రహాలు కూడా నివాసముంటున్నారు.

జనవరి 5వ తేదీన బుధుడి ఎంట్రీతో త్రిగ్రహ సంయోగం ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరాశిచక్రంపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. సాధారణంగా బుధుడు మన మేధస్సు, విజ్ణానశాస్త్రం, వ్యాపారం, కమ్యూనికేషన్ వంటి వాటికి కారణమని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతుంటారు.

ఈ నేపథ్యంలో బుధుడు మకరంలోకి ఆగమనం చేసే సమయంలో రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ధనస్సు రాశిలోకి శుక్రుడి ఆగమనంతో.. ఏ రాశుల వారికి అనుకూలమంటే...!

మేషరాశి..

మేషరాశి..

బుధుడు మకరంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి నుండి పదో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో మేష రాశి వారికి అభివృద్ధి ఫలాలు లభించొచ్చు. మీరు ఎంచుకున్న రంగంలో శుభఫలితాలు కూడా వస్తాయి. మీ జీవితంలో మీరు ముందుకు వెళ్లేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

పరిహారం : బుధవారం రోజున వినాయకుడిని గరికను సమర్పిస్తే శుభ ఫలితాలొస్తాయి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి నుండి బుధుడు తొమ్మిదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో వృషభరాశి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య సంఘీభావం ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా అంతా బాగుంటుంది. మీరు మతపరమైన కార్యకలాపాల వైపు ఎక్కువ ఆసక్తి చూపుతారు.

పరిహారం : ప్రతిరోజూ ఉదయాన్నే ‘విష్ణు సహశాస్త్రం' పఠించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఎనిమిదో స్థానం గుండా ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో మిధున రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు మానసికంగా మరియు శారీరకంగా అలసిపోయినట్లు అనిపించొచ్చు. మీరు మంచి ఫలితాలను పొందడానికి మీరు అదనపు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మీరు భవిష్యత్తులో పని చేసే క్లిష్ట పరిస్థితుల నుండి చాలా నేర్చుకుంటారు. డబ్బు ఆదా చేయడానికి మీరు తెలివిగా వ్యవహరించాలి. ఈ కాలంలో మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : మీ కుడి చేతి చిన్నవేలికి బంగారం లేదా వెండితో రూపొందించిన అధిక నాణ్యత గల ఉంగరం ధరించండి.

ఈ ఏడాది ఏ రాశిచక్రం వారికి ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుందంటే...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఏడో స్థానం నుండి మకరంలోకి ఆగమనం చేయనున్నాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ఎక్కువ ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీరు సుదూర ప్రయాణం ప్రయాణించాల్సి ఉంటుంది. దీని వల్ల మీకు మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంటుంది. కోర్టు సంబంధిత కేసుల్లో మీరు విజయం సాధించొచ్చు. మీ వైవాహిక జీవితంలో సమస్యలు తొలగించబడతాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పరిహారం : మీ ఇల్లు మరియు కార్యాలయంలో దీపం వెలిగిస్తే మీకు బుధుడి యొక్క సానుకూల శక్తి లభిస్తుంది.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఆరో స్థానం నుండి మకరంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సమయంలో సింహ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు తమ పని విషయంలో ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు. వ్యాపారవేత్తలకు సానుకూలంగా ఉంటుంది. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయవంతమవుతారు. అయితే మీరు ఏదైనా కొత్తగా చేసేందుకు తొందరపడకూడదు. ఓపికతో వ్యవహరించాలి.

పరిహారం : బుధవారం రోజున హిజ్రాల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శుభఫలితాలొస్తాయి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఐదో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో కన్య రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు ఓపికగా పనిచేస్తే, ఈ పరిస్థితిని నిర్వహించడం సులభంగా మారుతుంది. మీ కుటుంబంలో వాతావరణం మంచిగా ఉంటుంది. పిల్లల వైపు నుండి మీరు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీరు క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండాలి.

పరిహారం : ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు, ప్రార్థనలు చేయండి.

ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి బుధుడు నాలుగో స్థానం గుండా రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో తుల రాశి వారికి చాలా పవిత్రంగా ఉంటుంది. మీ శారీరక సుఖాలు పెరుగుతాయి. ఈ కాలంలో మీ తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వారి ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. లేదంటే మీ వైద్య ఖర్చులు పెరుగుతాయి. మీ ఆదాయాన్ని పెంచడానికి మీరు చాలా మార్గాలు కనుగొనవచ్చు. ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : బుధవారం రోజున ‘బుధ మంత్రాన్ని' జపించాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి బుధుడు మూడో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు రావొచ్చు. ఈ సమయం మీ కెరీర్ లో ఆహ్లాదకరమైన మార్పులు రావొచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం బుధ మంత్రం జపిస్తూ ధ్యానం చేయాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి బుధుడు రెండో స్థానం నుండి మకరంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ధనస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరోవైపు సింగిల్ గా ఉండేవారికి మ్యారేజ్ ప్రపోజల్స్ రావొచ్చు. మీకు మీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో వ్యాపారులు చాలా ప్రయోజనం పొందుతారు. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు మంచి ఫలితాలను పొందొచ్చు.

పరిహారం : మీకు తెలిసిన వారికి పుస్తకాలు మరియు స్టేషనరీ దానం చేయాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశిలోనే బుధుడు ప్రవేశించనున్నందున మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశం ఉంటుంది. మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. మీ శక్తిని తప్పుగా ఉపయోగించుకోవద్దు. మీరు అవనసరమైన వివాదాల్లో చిక్కుకోకండి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు శుభ మరియు చెడు రెండు ఫలితాలను ఎదుర్కొంటారు.

పరిహారం : ప్రతిరోజూ ఉదయాన్నే ‘ఓం నమో భగవతే వాసుదేవే' మంత్రం జపించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి బుధుడు పన్నెండో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో కుంభ రాశిలోని విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ కష్టానికి తగ్గ పలితాలను పొందుతారు. ఉద్యోగులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉండొచ్చు. మరోవైపు మీ ఖర్చులు పెరగొచ్చు. దీని వల్ల మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పొచ్చు. మీరు మానసికంగా కొద్దిగా చంచలంగా ఉంటారు. మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పరిహారం : మీ ఇంట్లో లేదా కార్యాలయంలో కర్పూర హారతి వెలిగించి దేవుడిని ప్రార్థించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి బుధుడు పదో స్థానం నుండి మకరంలోకి ప్రవేశించనున్ానడు. ఈ సమయంలో మీన రాశి వారికి వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతును పొందుతారు. మీరు పని రంగంలో పురోగతి సాధిస్తారు. దీని వల్ల మీ ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారులు కూడా వివిధ వనరుల నుండి కూడా డబ్బు పొందవచ్చు. మీరు పిల్లల వైపు నుండి కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. మరోవైపు ఈ రాశి విద్యార్థులు తమ విద్యపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు.

పరిహారం : ప్రతిరోజూ తులసి మొక్కను పూజించాలి.

English summary

Mercury Transit in Capricorn on 05 January 2021 Effects on Zodiac Signs in Telugu

Mercury Transit in Capricorn Effects on Zodiac Signs in Telugu: The Mercury Transit in Capricorn will take place on 05 January 2021. Learn about remedies to perform in Telugu.