For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Miracle:ఎవరీ ఆనందయ్య.. ఆయుర్వేదిక్ మందుతో కరోనా కంట్రోల్ అవుతోందా...!

|

ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ముఖ్యంగా మన భారతదేశంలో కోవిద్-19 దెబ్బకు రోజూ వేలాది మంది మరణిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వందల సంఖ్యలో చనిపోతున్నారు.

పాజిటివ్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా.. నెల్లూరు జిల్లా క్రిష్ణపట్నంలో ఆనందయ్య (Krishnapatnam Corona Ayurvedic Medicine) అనే వ్యక్తి కరోనాను నయం చేసే ఆయుర్వేదం మందు కనిపెట్టినట్టు.. అది తీసుకుంటే కేవలం 48 గంటల్లో కరోనా రోగులు కోలుకుంటున్నట్టు ప్రచారం జరిగింది.

దీంతో క్రిష్ణపట్నానికి ఆ జిల్లా వాసులే కాక.. ఇతర రాష్ట్రాల నుండి కూడా కరోనా బాధితులు తండోపతండాలుగా వచ్చేశారు. దీంతో అక్కడ అంతా జాతరగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య ఆయుర్వేదం ఔషధం ఎంతమేరకు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందో నిగ్గు తేల్చేందుకు, ఈ పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసింది.

అయితే ప్రాథమిక విచారణలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తేలడంతో మళ్లీ పంపిణీని ప్రారంభించారు. ఈ క్రిష్ణపట్నం కరోనా ఆయుర్వేదం మందు శాంపిల్స్ ని సైతం ICMRకి పంపించి పరిశోధన చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆనందయ్య కనిపెట్టిన కరోనా ఆయుర్వేదిక్ మందులో ఏముంది.. దాన్ని ఎలా వినియోగిస్తున్నారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కరోనా నుండి మీ రక్షణ నిపుణులు సిఫార్సు చేసిన మీరు తాగే టీకి 'ఇది' జోడించండి!కరోనా నుండి మీ రక్షణ నిపుణులు సిఫార్సు చేసిన మీరు తాగే టీకి 'ఇది' జోడించండి!

ఆయుర్వేద వైద్యం..

ఆయుర్వేద వైద్యం..

క్రిష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి వంశ పారంపర్యంగా ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు. కరోనా నివారణకు కూడా ఆయుర్వేద వైద్యం ప్రారంభించారు. ఈ మందు అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందింది. టివిల్లో.. సోషల్ మీడియాలో గత 24 గంటలుగా తెగ వైరల్ అయిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు వేలాది సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

మంచి ఫలితాలు..

మంచి ఫలితాలు..

ప్రస్తుతం కరోనా బారిన పడిన చాలా మందిలో ఆక్సీజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అలాంటి వారికి ఆనందయ్య ఆయుర్వేదిక్ మందును కంట్లో రెండు చుక్కలు వేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, అందుకే ఈ మందు పంపిణీ ప్రారంభించినట్లు స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్థనరెడ్డి కూడా చెప్పారు.

సీఎం జగన్ సమీక్ష..

సీఎం జగన్ సమీక్ష..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆనందయ్య ఆయుర్వేదిక్ మందు గురించి సమీక్ష చేశారు. ఆయుష్ అధికారులు, ICMR నిపుణులు ఇక్కడికి వచ్చి ఈ శాంపిల్స్ ను పరిశీలించనున్నారు.

ఎవరీ ఆనందయ్య..

ఎవరీ ఆనందయ్య..

మరోవైపు క్రిష్ణ పట్నంలో ఆనందయ్య ఉచితంగానే కరోనా మందు ఇస్తున్నారు. ఆయన గొలగమూడి వెంకయ్యస్వామి శిష్యులైన గురవయ్య స్వామి, చెన్నై రెడ్ హిల్స్ ప్రాంతానికి చెందిన వివేకానంద అనే సిద్ధ వైద్యుల దగ్గర ఆయుర్వేద వైద్యం నేర్చుకున్నట్లు ఆనందయ్య తెలిపారు. అంతేకాదు తాను గతంలో సర్పంచ్ గా, ఎంపిటిసిగా కూడా పని చేసినట్లు చెప్పారు. గత నెల శ్రీరామ నవమి నుండి కరోనా చికిత్సను ప్రారంభించినట్టు వివరించారు. మొదట్లో పదుల సంఖ్యలో రోగులు వచ్చేవారని.. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగిపోయిందని, తాను కరోనాకు సుమారు ఐదు రకాల మందులు తయారు చేస్తున్నట్టు చెప్పారు.

కరోనావైరస్: ఊపిరి అందకపోవడం సంకేతాలను ఎలా గుర్తించాలికరోనావైరస్: ఊపిరి అందకపోవడం సంకేతాలను ఎలా గుర్తించాలి

ఇంతవరకు ఇబ్బందుల్లేవు..

ఇంతవరకు ఇబ్బందుల్లేవు..

ఆనందయ్య ఆయుర్వేదిక్ మందు తీసుకున్న వారిలో ఇంతవరకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని.. అందరికీ మంచి ఫలితాలు వచ్చాయని.. కరోనా మందు తీసుకున్న రోగులు త్వరగానే కోలుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఇదంతా విచారణ తర్వాత ఆయుర్వేద చికిత్స శాస్త్రీయంగా నిరూపితం కావాల్సి ఉందని అధికారులు, నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఆనందయ్య ఆయుర్వేదిక్ మందుకు వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. కానీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆశ్చర్యకర ఫలితాలు..

ఆశ్చర్యకర ఫలితాలు..

ఆనందయ్య మందు తీసుకున్న ఓ కరోనా రోగి ఆక్సీజన్ లెవెల్స్ 83 ఉండగా.. తన కంటిలో కరోనా డ్రాప్స్ వేసిన గంట తర్వాత తన ఆక్సీజన్ లెవెల్స్ 95కు పెరిగాయని.. ఆ రోగితో తాము స్వయంగా మాట్లాడినట్లు ఆనందయ్య, అధికారులు వివరించారు.

కరోనా మందులో..

కరోనా మందులో..

ఆనందయ్య ఆయుర్వేద మందులో ఎక్కువగా వంటింటి వస్తువులనే వాడుతున్నట్లు చెప్పారు. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెబుతున్నారు. అంతేకాదు తను తయారు చేసే మందుకు సంబంధించిన వన మూలికలు ఏవైనా మీ ప్రాంతంలో ఉంటే.. వాటిని తీసుకురావాలని కూడా కోరుతున్నారు.

పసరులో ఏమున్నాయంటే..

పసరులో ఏమున్నాయంటే..

ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేదిక్ మందులో అనేక రకాల వనమూలికలు వాడారట. వాటిలో అల్లం, తాటి బెల్లం, తేనే, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్టా, లవంగాలు, వేపాకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి చెట్టు, కొండ పల్లేరుకాయల చెట్టు, బుడ్డ బుడస ఆకులు, పిప్పింట ఆకుల చెట్టు తెల్లపిల్లేడు పూల మొగ్గలు, ముళ్ల వంకాయలతో కరోనాను కట్టడి చేసే ఆయుర్వేద మందును తయారు చేస్తున్నారట.

English summary

'Miracle' Covid cure? Krishnapatnam Ayurvedic medicine to be sent to ICMR

Here we are talking about the 'miracle' COVID cure? Krishnapatnam ayurvedic medicine to be sent to ICMR. Have a look
Story first published: Saturday, May 22, 2021, 12:41 [IST]