For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనాపై పోరులో చంటిబిడ్డతోనే విధులు నిర్వర్తిస్తున్న ఆ ఐఏఎస్ ఆఫీసర్ కు హ్యాట్సాఫ్...

కరోనా వైరస్ నుండి నగరాన్ని కాపాడేందుకు తన చంటి బిడ్డను ఎత్తుకుని విధులకు హాజరైంది.

|

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేస్తుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా వైరస్ కేసులు దాదాపు 20 లక్షల వరకు దాటిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సుమారు ఒక లక్ష మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. మన దేశంలో కరోనా వైరస్ కేసులు 10 వేల మార్కును ఇటీవల దాటింది. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూ అందరినీ ఆందోళన కలిగిస్తుంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే కరోనా వైరస్ మహమ్మారి నుండి భారతదేశాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరి చేతిలో ఉంది.

Month-Old Baby in ARMS, Andhra Pradesh Ias Officer Back at Work

Image Curtosy

అందులోనూ సర్వోన్నతాధికారుల(ఐఏఎస్) చేతుల్లో చాలా ఎక్కువ బాధ్యత ఉంది. ఈ బాధ్యతను నెరవేర్చేందుకు ఓ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ తన చేతిలో చంటి బిడ్డతో సహా విధుల్లో చేరి తను ఎంతో నిబద్ధతతో పని చేస్తుండటం అభినందనీయం. ఆమె పేరే స్రుజన గుమ్మళ్ల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాణిజ్య రాజధాని అయిన వైజాగ్ సిటీలో కమిషనర్ గా పనిచేస్తున్నఈమె ఎందుకని ఇలాంటి నిర్ణయం తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం...

నెల రోజుల క్రితం..

నెల రోజుల క్రితం..

గత నెలలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ కు ఇంకా ఐదు నెలల వరకు ప్రసూతి సెలవులో ఉన్నాయి. అయితే వాటిని వినియోగించుకుని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోవాల్సిన ఆ అధికారిణి తన చంటి బిడ్డతో సహా విధుల్లో చేరడం గమనార్హం. కరోనా నుండి విశాఖ నగరాన్ని కాపాడేందుకు ఆమె విధుల పట్ల చూపుతున్న నిబద్ధతపై కేంద్ర మంత్రి షేకావత్ కూడా ట్విట్టర్ ద్వారా ఆమెను అభినందించారు.

తన వంతు సాయం..

తన వంతు సాయం..

కరోనా రోజు రోజుకు చాప కింద నీరు పెరుగుతున్న సమయంలో ఓ మనిషిగా ఇది తన బాధ్యత అని ఆ ఆఫీసర్ చెబుతున్నారు. తాను తిరిగి విధుల్లో చేరితే తమ పరిపాలన విభాగానికి కాస్త సాయం చేసినట్లు అవుతుందని చెబుతున్నారామె.

కరోనాపై పోరులో..

కరోనాపై పోరులో..

కరోనా వైరస్ పై పోరు సమయంలో అధికారులు, ప్రజలందరూ కలిసి పని చేస్తే మరింత బలం చేకూరుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. 2013 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈ ఆఫీసర్ కు దేశ వ్యాప్తంగా నెటిజన్లు హ్యాట్సాప్ చెబుతున్నారు.

‘యోధులు ఉండటం‘

‘యోధులు ఉండటం‘

‘కరోనా వైరస్ పై పోరాటంలో మన దేశంలో ఇలాంటి యోధులు ఉండటం మన భారతదేశం చేసుకున్న అద్రుష్టం అని, విధుల పట్ల నిబద్ధత చూపుతూ ఇలాంటి యోధులకు ఓ ఉదాహరణగా నిలుస్తోన్న ఆ తల్లికి నా హ్రుదయపూర్వ శుభాకాంక్షలు‘ అని కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్ ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో..

అయితే ఈ విషయం కాస్త సోషల్ మీడియాకు చేరడంతో ప్రస్తుతం ఆమె గురించి వార్తలు వైరల్ అయిపోయాయి. నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది ఆమె ఫోటోతో సహా సోషల్ మీడియాలో షేర్ చేసి ‘మీరు గ్రేట్ మేడమ్‘ అని మరీ అభినందిస్తున్నారు.

English summary

Month-Old Baby in ARMS, Andhra Pradesh Ias Officer Back at Work

Here we talking about month-old baby in arms, andhra pradesh ias officer back at work. Read on
Story first published:Wednesday, April 15, 2020, 18:41 [IST]
Desktop Bottom Promotion