Just In
- 4 hrs ago
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- 6 hrs ago
ఆదివారం దినఫలాలు : ఓ రాశి వారికి ఆన్ లైన్ బిజినెస్ లో కలిసొస్తుంది...!
- 16 hrs ago
లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఈ ఘోరమైన క్యాన్సర్ గురించి మీకు తెలుసా?
- 17 hrs ago
మార్చి మాసంలో మహా శివరాత్రి, హోలీతో పాటు వచ్చే ముఖ్యమైన పండుగలు, శుభముహుర్తాలివే...
Don't Miss
- News
ప్రపంచంలో తొలి సింగిల్ డోసు టీకా -జాన్సన్ అండ్ జాన్సన్ తయారీ కొవిడ్ వ్యాక్సిన్‌కు అమెరికా ఆమోదం
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- Movies
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Subhas Chandra Bose Jayanti 2021 : భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నేతాజీదే...
మన భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలంటే కేవలం అహింస మార్గం ఒక్కటే కాదని, ఆంగ్లేయుల పాలన నుండి మనకు విముక్తి కావాలంటే మనం కూడా సాయుధ పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నమ్మిన వ్యక్తుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరు.
అంతేకాదు దీని గురించి కాంగ్రెస్ పార్టీతో కూడా విభేధించిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఈయనే. గాంధీ వంటి నాయకులు అహింస, శాంతి మార్గంలో స్వరాజ్యం వస్తుందని నమ్మి పోరాటం చేస్తుంటే,
సాయుధ పోరాటం ద్వారా బ్రిటీష్ వారిని భారతదేశం నుండి తరిమి కొట్టొచ్చని నమ్మి, దాన్ని ఆచరించిన గొప్ప నాయకుడు సుభాష్ చంద్రబోస్. జనవరి 23వ తేదీన నేతాజీ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

నేతాజీ జననం..
సుభాష్ చంద్ర బోస్ 1879 సంవత్సరంలో జనవరి 23వ తేదీన ఒడిశాలోని కటక్ లో జానకీనాథ్, ప్రభావతీ బోస్ లకు జన్మించారు. చిన్నతనంలో నుండి విద్యలో అందరికంటే ముందుండేవారు. ఆయన తత్త్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.

స్వామి వివేకానందుని మార్గంలో..
రామక్రిష్ణ పరమహంస, స్వామి వివేకానందుల మార్గంలో పయనించి సన్యాసం తీసుకోవడానికి తీర్మానించారు. ‘మానవసేవే మాధవసేవ' అనే నినాదం, రామక్రిష్ణ ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగారు.

కాంగ్రెస్ లో చేరిక..
జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి దేశస్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్నారు. శ్రీ ఆర్యా పత్రికలో ఆయన సంపాదకులుగా రాసిన వ్యాసాలు స్వాతంత్య్ర సమరంలో పాల్గొనే వీరుల్లో మంచి ఉత్సాహాన్ని నింపాయి. తను డిగ్రీ పూర్తి చేసి ఇంగ్లండ్ కు వెళ్లిన సమయంలోనే జలియన్ వాలా బాగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఐసిఎస్ లో శిక్షణ తీసుకున్న తర్వాత అధికారిగా బాధ్యతలు స్వీకరించకుండా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీల చేరారు.

రెండు సార్లు అధ్యక్షుడిగా..
నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ, మహాత్మగాంధీజీతో సిద్ధాంత పరంగా విభేదించారు. అంతేకాదు తన పదవిని గడ్డి పరకతో సమానంగా భావించి వెంటనే రాజీనామా చేశారు.

పోరుబాట..
గాంధీజీ పాటించిన అహింస, సత్యం, శాంతి మార్గం మాత్రమే మనకు స్వాతంత్ర్యం తీసుకురాదని, మనం కూడా పోరుబాట జరిపితేనే బ్రిటీష్ వారు భయపడతారని.. అదే సందర్భంలో ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు.

11 సార్లు జైలుకు..
బ్రిటీష్ అధికారి వెల్స్ క్యూన్ భారత పర్యటనకు వ్యతిరేకంగా చిత్తరంజన్ తో కలిసి జరిపిన పోరాటంలో అరెస్టయ్యారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 11 సార్లు జైలుకు వెళ్లిన నేతాజీ.. బ్రిటీష్ వారి పాలన నుండి భారతదేశాన్ని రక్షించేందుకు చలో ఢిల్లీ నినాదాన్ని ఇచ్చారు.

1944లో వరల్డ్ వార్..
నేతాజీ ఆధ్వర్యంలో 1944 ఫిబ్రవరి 4వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే సమయంలో సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభం కావడంతో బ్రిటీష్ వారిని దెబ్బ కొట్టేందుకు అదే అద్భుతమైన అవకాశమని భావించారు.

ఆజాద్ హింద్ ఫౌజ్..
అదే సమయంలో యుద్ధం ప్రారంభమైన వెంటనే కూటమి ఏర్పాటు చేసేందుకు రష్యా, జర్మనీ, జపాన్ దేశాలలో పర్యటించారు. జపాన్ సహాయంతో యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో ‘ఆజాద్ హింద్ ఫౌజ్'ను ఏర్పాటు చేశారు. జపాన్ సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరిచినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

బ్రిటీష్ వారిలో భయం..
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరుబాట ఆంగ్లేయుల గుండెల్లో గుబులు రేపింది. మన దేశానికి కూడా ఆయుధాలతో పోరాడటం తెలుసని, ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత నేతాజీకే దక్కుతుంది.

బ్రిటీష్ సైన్యానికి తొలి దెబ్బ..
సాయుధ పోరాటాన్ని బలంగా నమ్మిన బోస్.. జనరల్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగపూర్, మలేషియాలోని భారత జాతీయ సైనిక దళానికి జీవం పోశారు. 1944 ఫిబ్రవరి 4వ తేదీన బర్మా రాజధాని రాంకూన్ నుండి భారత సరిహద్దులకు భారత దళం పయనమైన రెండేళ్లలోనే కోహిమా కోట, తిమ్మాపూర్-కొహిమా సైనిక దళాన్ని చేరుకుంది. భారత జాతీయ సైనిక దళం యొక్క తొలి దెబ్బను బ్రిటీష్ వారికి రుచి చూపించారు.