For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జమ్మూ,కాశ్మీరులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ఎలాంటి మార్పులొచ్చాయంటే...

ఆర్టికల్ 370 రద్దై ఏడాది పూర్తయిన సందర్భంగా దాని యొక్క అనుకూలతలు మరియు ప్రతికూలతలను తెలుసుకుందాం...

|

భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి ఆగస్టు 5వ తేదీకి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. దీంతో జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కోల్పోయి, భారత దేశంలో పూర్తిగా అంతర్భాగమైంది.

One year of Article 370 abrogation : What are the advantages and disadvantages of the article 370?

ఎన్డీయే-2 ప్రభుత్వం నుండి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడి ప్రజల జీవన విధానంలో ఏమైనా మార్పులొచ్చాయా? అక్కడ ఏమైనా అద్భుతాలు జరిగాయా?

One year of Article 370 abrogation : What are the advantages and disadvantages of the article 370?

ఎవరికైనా ఏమైనా ప్రయోజనాలు కలిగాయా? అసలు ఈ ఆర్టికల్ 370 రద్దు అయినప్పటి నాటి నుండి నేటి వరకు అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆర్టికల్ 370 అంటే ఏమిటి?

ఆర్టికల్ 370 అంటే ఏమిటి?

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపతి హోదా ఇవ్వడానికి అందించిన ‘తాత్కాలిక నిబంధన'. దీని వల్ల పార్లమెంటు చేసే చట్టాలను అక్కడి అసెంబ్లీలో ఆమోదం పొందితేనే అవి ఆచరణలోకొస్తాయి. భారత చట్టాలేవీ అక్కడ పని చేసేవి కాదు. అంతేకాదు వారికి ప్రత్యేక జెండా.. అజెండా ఉండేది. దీనికి కూడా 370 కారణమే.

అన్ని స్థానికులకే..

అన్ని స్థానికులకే..

ఈ ఆర్టికల్ వల్ల అక్కడ శాశ్వతంగా ఎవరైతే నివసిస్తుంటారో.. వారే అక్కడి ఆస్తులను, భూములను కొనుగోలు చేయడం వంటివి చేయాలి. అలాగే అక్కడి ప్రభుత్వ ఉద్యోగాలు సైతం స్థానికులకే దక్కే అవకాశం ఉండేది. పెళ్లిళ్ల విషయంలో కూడా అవే నిబంధనలు కొనసాగేవి. ఒకవేళ జమ్మూకాశ్మీర్ మహిళలు బయటి వ్యక్తులను పెళ్లి చేసుకుంటే, వారికి ఆస్తి హక్కులో వాటా లభించేది కాదు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత..

ఆర్టికల్ 370 రద్దు తర్వాత..

అయితే ఇలాంటి వాటన్నింటనికీ కేంద్ర ప్రభుత్వ గత ఏడాది ఆగస్టు 5వ తేదీన చెక్ పెట్టింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ పార్లమెంటులో బిల్లు తెచ్చి దాన్ని ఆమోదించింది. దీని ప్రకారం జమ్మూ,కాశ్మీర్ రెండురాష్ట్రాలుగా విభజించబడింది. లద్దాక్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది.

అవి కూడా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగా మారిపోయాయి. అలాగే స్వయం ప్రత్యేకప్రతిపత్తిని కూడా కోల్పోయాయి.

అక్కడ శాసనసభ పదవీ కాలం కూడా ఆరు సంవత్సరాల నుండి 5 సంవత్సరాలుకు తగ్గించబడింది.

ఆస్తులు కొనేందుకు..

ఆస్తులు కొనేందుకు..

గతంలో ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయులు ఎవ్వరూ అక్కడి ఆస్తులను కొనుగోలు చేసేందుకు అనుమతి వీలుండేది కాదు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అందరికీ అక్కడి ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం దక్కింది.

కరోనా ప్రభావం...

కరోనా ప్రభావం...

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్ లో పరిస్థితులు ప్రశాంతంగా ఉందని కేంద్రప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. అయితే అక్కడ ఇప్పటికీ పరిస్థితులు సాధారణ స్థాయికి రాలేదు. అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ.. ఇంటర్నెట్ సోషల్ మీడియా ఆంక్షలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావం అక్కడి వ్యాపార రంగంపైనా భారీగానే పడింది. ఇదిలా ఉండగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అక్కడ వ్యాపారులు దాదాపు 80 శాతం మేరకు తీవ్ర నష్టాలను చూశారట.

హిందూస్థాన్ జిందాబాద్ నినాదాలు..

హిందూస్థాన్ జిందాబాద్ నినాదాలు..

ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ హిందూస్థాన్ జిందాబాద్ నినాదాలు ఎక్కువగా వినబడుతున్నాయి. వేర్పాటువాదుల బెడద కూడా చాలా వరకు తగ్గింది. ఈ ఏడాదిలో జమ్మూకాశ్మీర్ లో వచ్చిన అతిపెద్ద మార్పు ఏదైనా ఉందంటే అది భారత్ మాతాకీ జై అనే నినాదమే.

English summary

One year of Article 370 abrogation : What are the advantages and disadvantages of the article 370?

Here we talking about one year of article 370 abrogation:what are the advantages and disadvantages. Read on
Story first published:Tuesday, August 4, 2020, 15:57 [IST]
Desktop Bottom Promotion