For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లి ఘాటు లొల్లిపై ట్రెండింగ్, ఫన్నీ మీమ్స్ ను చూసేయండి...

|

మన దేశంలో ఉల్లిపాయ లేనిదే ఏ వంట పూర్తి కాదు. అయితే ఆ ఉల్లి ఇప్పుడు బాగా లొల్లి చేస్తుంది. గల్లీ నుండి ఢిల్లీ నుండి ఉల్లి ధరల్లో విరాట్ కోహ్లీలాగా సెంచరీని దాటేసి డబుల్ సెంచరీకి చేరువవుతోంది. సాధారణంగా ఉల్లిపాయలను కోసేటప్పుడు కంటనీరు తెప్పిస్తుంది. కానీ ఇప్పుడు వినియోగదారులెవరూ ఉల్లి ముక్కలను కట్ చేయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోందని అందరూ తెగ బాధపడుతున్నారు.

ఈ ఉల్లి ధరలకు సంబంధించి కొందరు సర్కార్ పై నిందలు వేస్తుండగా, మరికొందరు ఉల్లిపాయ ధరల పెరుగుదల వెనుక వరదల ప్రభావం ఉందని మిన్నకుండి పోతున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఉల్లి ధరల లొల్లిపై జోకులను జోడిస్తున్నారు. వీటిపై మీమ్స్ ను తయారు చేస్తున్నారు. కొందరేమే కామెడీ వీడియోలను చేస్తున్నారు. ఇంకొందరు రోడ్డుపై డబ్బులు, ఉల్లి ఉంటే డబ్బులను వదిలేసి ఉల్లిని తమ బ్యాగులో వేసుకుని వెళ్తున్నారు. మరికొందరైతే ఉల్లిపాయలను, ఉల్లి సంచులకు తాళాలేసి భద్రంగా దాచుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన తెలుగు సినిమాలో కోట శ్రీనివాసరావు 'అహ నా పెళ్లంట' సినిమాలో కోడిని తలకిందులుగా వేలాడదీసి ఒట్టి అన్నం తిన్న విధంగా ఉల్లిపాయను, వెల్లుల్లిని, టమోటను వేలాడదీసి అదే మాదిరిగా తింటున్న వీడియోను చేశాడు. ఇలాంటివి ఈ మధ్య ట్విట్టర్లో, టిక్ టాక్, ఫేస్ బుక్ తో పాటు మరిన్ని సోషల్ మీడియా సైట్లలో తెగ వైరల్ మరియు ట్రెండింగ్ గా మారిపోయాయి. ఆ వీడియోలను, ఫొటోలను చూసి మీరు కూడా ఒకసారి నవ్వుకోండి.

బాలీవుడ్ శైలిలో..

బాలీవుడ్ శైలిలో..

PC : Twitter

కొందరు బాలీవుడ్ స్టైల్ లో హృతిక్ రోషన్ నటించిన ఓ సినిమా పోస్టర్ ను పెట్టి ఉల్లిపాయలకు ఇతర కూరగాయలకు ముడిపెట్టారు. ‘మాకు సమయం వస్తుంది. అప్పుడు మేము మా ప్రతాపం చూపుతాం‘ అన్న పోస్టర్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

బీరువాలో భద్రంగా..

ఇక కొందరు అయితే ఏకంగా ఉల్లిపాయలను తమ ఇంట్లో డబ్బులు, నగలు, చీరలు దాచుకునే లాకర్ లో ఉల్లిపాయను చాలా జాగ్రత్తగా భద్రపరుస్తున్నారు. దీన్ని వీడియో తీసి ట్విట్టర్, టిక్ టాక్ లో షేర్ చేశారు. ఇది అందరినీ తెగ నవ్విస్తోంది.

చంద్రుడితో సమానంగా..

చంద్రుడితో సమానంగా..

PC : Twitter

నెట్ ఫ్లిక్స్ సిరీస్ నుండి స్టిల్ ను చూడగలిగే మరో ఫొటో చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ నటుడు తన సామాజిక పరిస్థితి గురించి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇది చంద్రుడిపై ఉండటానికి సమానంగా కనిపిస్తుంది.

అప్పట్లో కోట.. ఇప్పుడు ఇతను..

అప్పట్లో కోట శ్రీనివాసరావు కేవలం కోడిని వేలాడదీసి తింటే.. ఇప్పుడు ఇతను ఏకంగా ఉల్లిపాయ, టమోట, వెల్లుల్లి గడ్డల వాసన చూస్తూ భోజనం చేస్తున్నాడు. ఈ వీడియోను చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.

డబ్బును వదిలి ఉల్లిని..

అన్నింటి కంటే ఈ వీడియోలో మరీ విచిత్రంగా డబ్బులను వదిలేసి ఉల్లిపాయలను తీసుకెళ్లడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక అతను రోడ్డుపై ఉల్లిపాయలను, డబ్బును పెడితే, ఆ దారిలో వస్తున్న ఒక మహిళ డబ్బులను వదిలేసి తన బ్యాగులో ఉల్లిపాయలను వేసుకుని వెళ్తుంది.

ఉల్లికి ఐఫోన్ ఉచితం..

ఉల్లికి ఐఫోన్ ఉచితం..

PC : Twitter

ఇంకో పోస్టులో అయితే మరీ దారుణమైన కామెడీ చేసేశారు. ఓ షాపులోని కూరగాయల విక్రేతలు ఒక కిలో ఉల్లిపాయలతో ఒక ఐఫోన్ ను ఉచితంగా అందిస్తున్నారని, అయితే ఇప్పటికీ తమ స్టాకును పూర్తిగా అమ్మలేకపోతున్నారని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.

రింగ్ కంటే ఉల్లినే..

రింగ్ కంటే ఉల్లినే..

PC : Twitter

మీరు మీ ప్రేమను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే లేదా మీ కలల రాకుమారిని వివాహం చేసుకోమని అడగాలి అనుకుంటే, మీరు డైమండ్ రింగ్ కొనడం కంటే మీరు ఆమెకు ప్రపోజ్ చేయడానికి ఉల్లిపాయలను ఉపయోగించవచ్చు అని పోస్ట్ చేశారు. ఉల్లిపాయ సహాయంతో ఓ అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్న వీడియోను సైతం పోస్టు చేశారు.

English summary

#OnionPrice: These Trending Funny Memes On Onions Have Left Netizens In Splits

The price of onions have gone upto Rs. 100 per kg in some urban areas. However at some places it is somewhere between Rs. 80-90 per kg. This has made people go teary-eyed while some are enjoying by making some funny memes.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more