For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Penumbral Lunar Eclipse July 4-5 2020 : ఉంబ్రా చంద్ర గ్రహణమెప్పుడు... ఎక్కడో చూసేయ్యండి...

|

ప్రస్తుత కరోనా మహమ్మారితోనే ప్రపంచం అతలాకుతలం అవుతోంది. గతేడాది డిసెంబరులో సూర్య గ్రహణం తర్వాత వచ్చిన ఈ కరోనా భూతం మొన్న వెళ్లిన సూర్యగ్రహణం తర్వాత ఇంకా వెళ్లలేదు.

అంతేకాదు 2020లో కేవలం 30 రోజుల వ్యవధిలో మూడు గ్రహణాలు రావడం అశుభంగా పరిగణించబడుతోంది. జూన్ 5వ తేదీన రెండో చంద్ర గ్రహణం పూర్తవ్వగా, జులై 5న మరో పాక్షిక చంద్ర గ్రహణం రాబోతోంది. ఇటీవలే జూన్ 21వ తేదీన సూర్య గ్రహణాన్ని కూడా మనం చూశాం.

నాలుగో గ్రహణమైన ఈ చంద్ర గ్రహణం ప్రపంచంలోని అన్ని దేశాల్లో కనిపించదు. కేవలం కొన్ని దేశాల్లోనే కనిపిస్తుంది. ఉత్తర, దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో పాటు యూరప్, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో కూడా కనిపిస్తుంది.

ఈసారి వచ్చే చంద్ర గ్రహణానికి ఉపచాయా చంద్రగ్రహణం నామకరణం చేశారు పండితులు. హిందూ ధర్మం ప్రకారం ఏ గ్రహణాన్ని అయినా నేరుగా చూడకూడదు.

ఉపచాయా గ్రహణం రోజున చందమామ భూమి నీడకు అవతలివైపు నుండి కదులుతుంది. భూమ నీడ పడే ప్రాంతాన్ని ఉంబ్రా(Umbra) అంటారు. ఆ ఉంబ్రా నీడను దాటి చంద్రుడు వెళ్లిపోతాడు.

చంద్ర గ్రహణం నాడు సూర్యుడు, చంద్రుడు మధ్యలో భూమి ఉంటుంది. అందువల్ల సూర్యుడి కాంతి చందమామపై పడదు. భూమి పక్కన జరిగినప్పుడే తిరిగి కాంతి అనేది చంద్రుడిపై పడుతుంది. ఇదంతా జులై 5వ తేదీన జరుగుతుంది. అయితే మన దేశంలో ఈ చంద్ర గ్రహణం ఏ సమయంలో జరుగుతుంది. ఏ సమయంలో జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కుబేరుడిని ఇలా పూజిస్తే ధనవంతులు అవ్వడం ఖాయం, సుఖ సంపదలు మీ సొంతం! అప్పుడు ఈ మంత్రాలను జపించండి!

జులై 5న చంద్ర గ్రహణం..

జులై 5న చంద్ర గ్రహణం..

జులై నెలలో 5వ తేదీ మూడో చంద్ర గ్రహణం ధనస్సు రాశిలో జరుగుతుంది. ఈ కారణంగా ధనస్సు రాశి వారికి కొన్ని సమస్యలు పెరుగుతాయి. అయితే దాని ప్రభావం తగ్గించుకోవడానికి ఇప్పటినుండే దాని నివారణ చర్యలు తీసుకోవడం ప్రారంభించాలి.

ఈ సమయంలో..

ఈ సమయంలో..

జులై నెలలో చంద్ర గ్రహణం 5వ తేదీ ఆదివారం నాడు ఉదయం 8:38 నుండి ఉదయం 11.21 గంటల వరకు ఉంటుంది. ఇది మొత్తం 2 గంటల 43 నిమిషాల 24 సెకన్లపాటు ఉంటుంది. అయితే ఇది ఆయా ప్రాంతాలను బట్టి సమయంలో స్వల్పమార్పులు కూడా ఉంటాయి. దీన్ని మీరు గమనించాలి. మరో గ్రహణం నవంబర్ 30వ తేదీన సోమవారం మధ్యాహ్నం 1:34 నుండి సాయంత్రం 5:22 గంటల వరకు జరుగుతుంది.

ఎక్కడ కనిపిస్తుందంటే?

ఎక్కడ కనిపిస్తుందంటే?

జులై 5వ తేదీన చంద్ర గ్రహణం జరగబోతోంది. ఇది మన దేశంతో పాటు అమెరికా, యూరప్ మరియు ఆస్ట్రేలియాతో పాటు దక్షిణ ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. నాలుగో గ్రహణం నవంబర్ 30న జరుగుతుంది. ఇది ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహా సముద్రం, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.

శుక్ర సంచారం వల్ల ఈ 2 రాశుల వారికి కష్టంగా ఉంటుంది... మీ రాశి ఉందేమో చూడండి...!

ఏమీ తినరు..

ఏమీ తినరు..

మన దేశంలో చాలా మందికి చంద్ర గ్రహణం వల్ల మంచి లేదా చెడు జరుగుతుందని పండితులు చెబుతుంటారు. అలా కొంతమందికి గ్రహణం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. మరికొందరికి మాత్రం ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి. అందుకే గ్రహణం సమయంలో ఎవ్వరు ఏమి తినరు. ఎక్కువ మంది ఉపవాసమే ఉంటారు.

గ్రహణం సమయంలో..

గ్రహణం సమయంలో..

మన దేశంలో సూర్య గ్రహణమైనా.. చంద్ర గ్రహణమైనా.. భూమి ఆకర్షణ, విక్షరణ బలాల వల్ల కడుపులో ఆహారం సరిగా జీర్ణం కాదని చాలా మంది భావిస్తారు. అందుకే గ్రహణం సమయలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదని చెబుతుంటారు.

అక్షయ పాత్ర గురించి మనం నమ్మలేని నిజాలు...

ప్రభావం ఉండదు..

ప్రభావం ఉండదు..

జులై 5న ఏర్పడబోయే పాక్షిక చంద్ర గ్రహణం వల్ల ఎవ్వరిపైనా ఎటువంటి ప్రభావం ఉండదు. ఏదైనా శుభకార్యాలకు ఎలాంటి నిషేధాలు ఉండవు. అలాగే దేవున్ని ఆరాధించడం, ఉపవాసం వంటివి చేయొచ్చు. అలాగే గ్రహణం యొక్క నియమాలను పాటిస్తే మంచిది.

సైన్స్ ప్రకారం..

సైన్స్ ప్రకారం..

ఇక శాస్త్రవేత్తలు మాత్రం గ్రహణానికీ.. ఆహారం తినడానికీ ఎలాంటి సంబంధం లేదంటున్నారు. ఈ గ్రహణాలు అనేవి సహజంగా ఏర్పడుతుంటాయనీ, వీటిని పెద్దగా నమ్మాల్సిన పని లేదని కొట్టిపారేస్తున్నారు. ఈసారి గ్రహణాన్ని చూసేందుకు నాసా శాస్త్రవేత్తలతో సహా.. అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల ప్రజలు సిద్ధమవుతున్నారు.

English summary

Penumbral Lunar Eclipse July 4-5 2020: Date, timings and when, how to watch

Penumbral lunar eclipse on July 4–5, 2020: Where and when is the Moon eclipse visible and what will it look like?
Story first published: Saturday, June 27, 2020, 16:11 [IST]