For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంద్ర గ్రహణం జూన్ 2020 : ఈ నెలలోనే వచ్చే 2 గ్రహణాలు ఎలాంటి ప్రభావం చూపుతాయంటే...

2020 జూన్ లో చంద్ర గ్రహణం తేదీ, సమయం ఎప్పుడొచ్చింది. ఎలా దాన్ని చూడాలో తెలుసుకోండి.

|

జూన్ నెలలో లాక్ డౌన్ సడలింపులు దాదాపు పూర్తిగా వచ్చేశాయి. ఇప్పుడిప్పుడే అందరూ సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు. 2020 సంవత్సరం మనతో నిజంగా టి20 ఆడుకుంటోందనిపస్తుంది. వీటన్నింటి సంగతిప పక్కనబెడితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జూన్ నెలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ నెలలో ఒకేసారి రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి.

Lunar Eclipse June 2020: Date, Timings And How To Watch

వీటిలో తొలి గ్రహణం చంద్ర గ్రహణం. ఇది జ్యేష్ఠ పౌర్ణమి అయిన జూన్ 5వ తేదీన వస్తుంది. రెండో గ్రహణం సూర్య గ్రహణం. ఇది జూన్ 21వ తేదీన ఏర్పడనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.

Lunar Eclipse June 2020: Date, Timings And How To Watch

ఎందుకంటే గ్రహాల అనుగ్రహం.. వాటి స్థితిగతుల ఆధారంగా గడిచిన కాలం, వర్తమాన కాలం, భవిష్యత్తును అంచనా వేస్తారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. అయితే గ్రహణాల రోజున వీటి ప్రభావం మానవులపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా జూన్ నెల అస్థిరంగా ఉండి దేశవ్యాప్తంగా ప్రభావం ఉంటుంది. దీంతో ఈ చంద్ర గ్రహణం చాలా ప్రాముఖ్యత సంపాదించుకుంది. అసలు జూన్ 5న ఏర్పడే చంద్ర గ్రహణం ఎందుకు ప్రత్యేకమైనదో.. అసలు ఇది మన దేశంలో కనిపిస్తుందో లేదో తెలియాలంటే ఈ ఆర్టికల్ ను పూర్తిగా చూడాల్సిందే...

జూన్ 5 తర్వాత ఈ 5 రాశుల వారు బిలీనియర్లు అయ్యే అవకాశముందట...జూన్ 5 తర్వాత ఈ 5 రాశుల వారు బిలీనియర్లు అయ్యే అవకాశముందట...

ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..

ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..

హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలో జూన్ 5న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజున గ్రహణం సుమారు అర్థరాత్రి 11.16 గంటలకు ప్రారంభమవుతుంది. అలా మొదలైన గ్రహణం జూన్ 6వ తేదీన తెల్లవారుజామున 2:34 గంటలకు ముగుస్తుంది.

సంపూర్ణ చంద్ర గ్రహణం..

సంపూర్ణ చంద్ర గ్రహణం..

ఈ చంద్ర గ్రహణాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో ఉండే వారు చూడొచ్చు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా చంద్రుడి ఆకారంలో ఎలాంటి మార్పులు సంభవించవు. అయితే చంద్రుడిలో కొంత కాంతి తక్కువగా అయిపోతుంది. ఈ సంవత్సరంలో ఇప్పటికే జనవరి నెల 10వ తేదీన తొలి చంద్రగ్రహణం కూడా పూర్తయ్యింది.

మరో గ్రహణం..

మరో గ్రహణం..

జూన్ 5వ తేదీ రెండు చంద్ర గ్రహణాలు పూర్తవుతున్నా.. ఇంతవరకు సూర్య గ్రహణం ఏర్పడలేదు. కానీ ఇదే నెలలో జూన్ 21వ తేదీన సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం ఆరోజున ఉదయం 9:15 గంటలకు మొదలవుతుంది. ఆ సమయంలో సూర్యుడు దాదాపు 100 శాతం కనిపించకపోవచ్చు. అయితే అక్కడక్కడా కొంతకాంతి ప్రసరిస్తుంది.

జూన్ నెలలో ఈ రాశుల వారికి ఉద్యోగావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి... మీ రాశి కూడా ఉందేమో చూడండి...జూన్ నెలలో ఈ రాశుల వారికి ఉద్యోగావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి... మీ రాశి కూడా ఉందేమో చూడండి...

ఎంతసేపు ఉంటుందంటే..

ఎంతసేపు ఉంటుందంటే..

ఈ సూర్య గ్రహణం చంద్ర గ్రహణం కన్నా ఎక్కువగానే ఉంటుంద. ఇది దాదాపు 5 గంటల 48 నిమిషాల 3 సెకండ్ల పాటు కొనసాగనుంది. ఈ గ్రహణాన్ని మన దేశంతో పాటు చైనా, ఆఫ్రికా, ఐరోపా వంటి దేశాల వారు కూడా చూడొచ్చు. దీని ప్రభావం వీటితో పాటు ఇంకా చాలా దేశాల్లో పడుతుంది. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో విశ్వవ్యాప్తంగా ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సమస్యలు అందరినీ వేధిస్తున్నాయి.

వచ్చేనెలలోనే మూడో గ్రహణం..

వచ్చేనెలలోనే మూడో గ్రహణం..

జూన్ 5వ తేదీన రెండో చంద్ర గ్రహణం పూర్తయిన, నెల రోజుల్లోనే మూడో చంద్ర గ్రహణం కూడా ఏర్పడనుంది. జులై మొదటివారంలో ఈ గ్రహణం ఏర్పడనుంది. ఇది కూడా మిగిలిన రెండు గ్రహాణాల మాదిరిగా సంపూర్ణ చంద్రగ్రహణం కాకుండా పాక్షికంగా ఏర్పడనుంది. అయితే ఈ చంద్ర గ్రహణాన్ని భారతదేశ ప్రజలు చూడలేరు. ఎందుకంటే ఇది ఏర్పడేది పగటిపూట. ఆ సమయంలో సూర్యుడు ఉండటం వల్ల ఈ గ్రహణం ప్రభావం మన దేశంపై అంతగా ఉండకపోవచ్చు.

చివరి గ్రహణం ఎప్పుడంటే..

చివరి గ్రహణం ఎప్పుడంటే..

ఇక చివరి గ్రహణం మాత్రం డిసెంబరు నెలలో ఏర్పడనుంది. డిసెంబర్ 14వ తేదీన సూర్య గ్రహణంతో ఈ 2020 సంవత్సరం ముగుస్తుంది. ఈ గ్రహణం యొక్క ప్రభావం కూడా మన దేశంపై అంతగా ఉండదు. ఎందుకంటే ఈ సూర్య గ్రహణాన్ని భారత ప్రజలు చూడలేరు. ఎందుకంటే సూర్య గ్రహణం ప్రారంభమయ్యే లోపే సూర్యాస్తమయం అయిపోతుంది. అప్పటికే సగం సమయం గ్రహణంలోనే గడిచిపోతుంది. దీని కారణంగా మనం ఈ గ్రహణాన్నిచూడలేం.

English summary

Penumbral Lunar Eclipse June 2020: Date, Timings And How To Watch

Here we talking about lunar eclipse june 2020 : date, timings and how to watch.Read on
Desktop Bottom Promotion