Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఇలా చేస్తే... మిడతల దండు మీ పంటల వైపు కన్నెత్తి కూడా చూడదు...!
ఇలా చేస్తే మిడతల దండు పారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఒకవైపు భారతదేశం ఇప్పుడిప్పుడే కరోనా లాక్ డౌన్ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుంటే.. పశ్చిమ భారతంలో మాత్రం మిడతల దండు రూపంలో పెద్ద విధ్వంసమే జరిగింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా కరోనా మహమ్మారితోనే అల్లాడుతున్న మన దేశంలోకి మిడతలు దండు ప్రవేశించి వేల ఎకరాల పంటలను నాశనం చేసింది.

అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటివరకు ఏ మిడతల దండు ప్రవేశించలేదు. అయితే తెలంగాణ సరిహద్దులో మాత్రం మిడతల ప్రభావం కొంత ఎక్కువగా ఉన్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.

కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో లోకల్ మిడతలు మాత్రం దర్శనమిచ్చాయి. వాటిని చూసి చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లోకి కూడా ప్రవేశించాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అది అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా మిడతల దండు నుండి పంటలను కాపాడుకోవాలంటే పెద్ద పెద్ద శబ్దాలు చేయాలని, టపాసులు కాల్చాలని వ్యవసాయాధికారులు చెప్పడంతో చాలా మంది ఇదే పని చేస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. గాలి వీచినప్పుడల్లా శబ్దం వచ్చేలా ఓ పరికరాన్నే తయారు చేసేశాడు. దాన్ని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అయిపోయింది. ఇంతకీ ఆ వ్యక్తి ఏ పరికరాన్ని కనిపెట్టాడో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...
గాలి వీచినప్పుడల్లా..
మిడతల దండు నుండి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి వినూత్న ప్రయోగం చేశాడు. పొడవుగా ఉండే ఒక కర్రను తీసుకుని, దానికి ఇనుప రాడ్ గుచ్చి దానికి ఒక ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్ అమర్చాడు. ఆ బాటిల్ కు ముందువైపు ఫ్యాన్ రెక్కలు, వెనుకవైపు ఇనుప డబ్బాను ఉంచాడు. డబ్బా ఉన్న పై భాగాన డ్రమ్ స్టిక్స్ లాంటివి ఉంచాడు. ఈ రెండింటిని ఇనుప రాడ్ ద్వారా కలిపాడు.

ఆటోమేటిక్ సౌండ్..
ఆ పరికరాన్ని తీసుకెళ్లి పొలంలో నిలబెట్టాడు. దీంతో అది గాలి వీచినప్పుడల్లా ఫ్యాన్ రెక్కలు వాటికున్న రాడ్ తో పాటు తిరిగి డ్రమ్ స్టిక్స్ లాంటివి డబ్బాపై శబ్దం చేస్తుంది. ఇది అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. దీని వల్ల నిత్యం పొలంలో ఉండాల్సిన అవసరం లేదని అందరూ చెబుతున్నారు. మీరు కూడా ఆ ద్రుశ్యాలను పై వీడియోలో చూడొచ్చు.

గాలి గమనాన్ని బట్టి..
గాలి గమనాన్ని బట్టి వచ్చే మిడతలు ఈ శబ్దానికి భయపడి పారిపోతాయని అక్కడి రైతులు భావిస్తున్నారు. ఈ వీడియోను ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ తన ట్విట్టర్ పేజీలో పంచుకున్నారు. ‘మోడర్న్ ప్రాబ్లమ్ కు మోడర్న్ సొల్యుషన్.. మిడతలను ఎదుర్కొనేందుకు అద్భుతమైన స్థానిక ఆవిష్కరణలు ఉత్తమమైనవి, అద్భుతమైన ఆలోచన' అని ట్వీట్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుండి తెగ ప్రశంసలు లభిస్తున్నాయి.

27 ఏళ్ల తర్వాత..
ఈ మిడతల దండు ఇప్పటివరకు జైపూర్, అమరావతి, నాగ్ పూర్, జోద్ పూర్ మరియు మాల్వాతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో మిడతల దండు భయంకరంగా దాడులు చేశాయి. భారతదేశంలో ఇలా దాడి చేయడం 27 సంవత్సరాలలో ఇదే మొదటిసారి.

గాలి ఎలా వస్తే..
ఈ మిడతలు గాలి ఎలా వస్తే అలా వాటి గతిని అర్థం చేసుకుని, గంటకు 16 నుండి 19 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన తర్వాత మొత్తం పంటలను చదరపు కిలోమీటర్ లో ప్రమాదకరంగా దాడులు చేస్తాయి. వీటి దాడి చాలా భయంకరంగా ఉంటుంది.

మిడతల దాడిని నివారించడానికి..
ఈ కీటకాలు వాటి చుట్టూ ఉండే ప్రాంతమంతా దండెత్తి, పంటలను తినడం మరియు తీవ్రమైన వ్యవసాయ నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి పురాతన ఈజిప్టులో ఫరో కాలం నుండి మానవ నివాసాలను నాశనం చేశాయని ఆధారాలు ఉన్నాయి. అందువల్ల, ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) ప్రపంచంలోని పురాతన వలస తెగులుగా వర్ణించబడింది.

మిడతల దాడిని నివారించడానికి..
ఈ సంవత్సరం మిడతల దాడి, దూకుడు మరింత కఠినంగా మారే అవకాశం ఉంది. పురుగుమందులు లేదా ఆర్గానో ఫాస్పేట్ రసాయనాలను చల్లడం సహా వీటిని నియంత్రించడానికి ప్రాథమిక చర్యలు తీసుకోవచ్చు. పురుగుమందులను డ్రోన్ ల ద్వారా డ్రోన్ ల ద్వారా పిచికారి చేయవచ్చు. ఇదిలా ఉండగా రాబోయే వారాల్లో మిడతల దాడులు పెరుగుతాయని ఆహార, వ్యవసాయ సంస్థ హెచ్చరించింది.



Click it and Unblock the Notifications
