Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డు ! వధూవరుల పేర్లకు బదులు ‘‘శర్మ గారి అబ్బాయి.. వర్మ గారి అమ్మాయి‘‘..
వధూవరులు కలిసి ఏడడుగులు వేసే అద్భుత ఘడియలు.. అలాంటి పెళ్లిని ఎంతోమంది శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఎంతో ఖర్చు పెట్టి చాలా ఆడంబరంగా జరుపుకుంటారు.
పెళ్లి అంటే నూరేళ్ల పంట.. రెండు జీవితాలు ఒక్కటయ్యే మధుర క్షణం.. వధూవరులు కలిసి ఏడడుగులు వేసే అద్భుత ఘడియలు.. అలాంటి పెళ్లిని ఎంతోమంది శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఎంతో ఖర్చు పెట్టి చాలా ఆడంబరంగా జరుపుకుంటారు.
ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలయ్యింది కాబట్టి, ఒక్కొక్కరు ఒక్కో రీతిలో వినూత్నంగా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ వివాహానికి ముందు అత్యంత ముఖ్యమైనది వెడ్డింగ్ కార్డు. అలాంటి వెడ్డింగ్ కార్డును వెరైటీగా చేయించిన ప్రముఖులను ఇదివరకే చూశాం. కానీ ఇప్పుడు తాజాగా మరో వెరైటీ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ అనేక కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాలేంటో మీరు చూసేయండి..

చమత్కారమైన వెడ్డింగ్ కార్డు..
ఢిల్లీకి చెందిన హాస్య నటుడు అక్షర్ పాథక్ చమత్కారమైన మరియు ఆసక్తికరమైన వెడ్డింగ్ కార్డును రూపొందించాడు. ఇది భారతీయ వివాహాల గురించి పలు అంశాలను హైలెట్ చేస్తోంది. ‘‘హమ్నే కిత్నా ఖర్చ్ కియా, అంబానీ సే కామ్ నహి హై హమ్‘‘ అంటే ‘ఈ పెళ్లి కోసం మేము ఖర్చు చేయాల్సిన మొత్తం గురించి మీరు తెలుసుకోవచ్చు. మేము అంబానీ కంటే ఏమీ తక్కువ కాదు‘ అనే వివరాలను పొందుపరిచాదు. అంతే కాదు వీటితో పాటు....

‘శర్మ గారి అబ్బాయి.. వర్మ గారి అమ్మాయి‘..
సాధారణంగా వెడ్డింగ్ కార్డులో ఎవరైనా వధూ వరుల పేర్లు ప్రచురిస్తారు. వారికి విద్య, ఉద్యోగానికి సంబంధించిన వివరాలను కూడా జత చేస్తారు. కానీ ఈ వెరైటీ వెడ్డింగ్ కార్డులో వారి పేర్లు విచిత్రంగా ఉంటాయి. అవేంటంటే ‘శర్మ జీ కా లడ్కా‘ మరియు ‘వర్మ జీ కి లడ్కీ‘ ఇలా పెళ్లి పత్రికలో పేరడీని జత చేశాడు. దీనికి ఆ కమెడియన్మ తమ సొంత వివాహ హ్యాష్‌ట్యాగ్‌ను కలిగి ఉన్నందుకు జంటల మధ్య వ్యామోహాన్ని చూపించడానికి #ShaVerma అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఇచ్చారు.

వివాహ తేదీ గురించి..
తమ వివాహ తేదీ గురించి పలు ఆసక్తికరమైన పదాలు చేర్చాడు. ‘‘తాము వివాహం జరుపుకోబోయే రోజు పవిత్రమైనది కాబట్టి ఆరోజు కొన్ని వేల పెళ్లిళ్లు జరుగుతాయి. ఆరోజు మీరు అనేక మంది ట్రాఫిక్ లో చిక్కుకుంటారు. వేదిక వివరాల కోసం గందరగోళానికి గురై తప్పు దారిలో కూడా వెళతారు. (అనేక ఇతర వివాహాలు జరిగే ప్రదేశాలకు వెళ్లడం).

‘బహుమతి వద్దు.. నగదే ముద్దు..
తమ వివాహానికి విచ్చేసి అతిరథ మహారథులందరూ తమ వివాహం సందర్భంగా ఎలాంటి బహుమతులను ఇవ్వకండి. కేవలం నగదు మాత్రమే ఇవ్వండి అని అభ్యర్థిస్తున్నట్లు కార్డులో వివరాలు పొందుపరిచాడు.

మేము కూడా రెండు లేదా మూడు రిసెప్షన్లు...
అలాగే ప్రముఖ బాలీవుడ్ ఫేమస్ హీరో హీరోయిన్ల వివాహ కార్యక్రమాలను తన వెడ్డింగ్ కార్డులో వివరించాడు. రణవీర్- దీపికా మరియు నిక్-ప్రియాంక చోప్రాతో పాటు వరుసగా ఆరు మరియు ఎనిమిది వివాహ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, హాస్యనటుడు 'హమ్ భీ టీన్ రిసెప్షన్ కరెంగే కామ్ సే కామ్' (మేము రెండు లేదా మూడు రిసెప్షన్లను కూడా నిర్వహిస్తాము) అని పేర్కొన్నారు.

వెరైటీ మ్యాప్..
వెడ్డింగ్ కార్డ్ దిగువన, "aage direction k liye ek bahut hi confusing map hai" (మీరు కార్డు యొక్క మరొక వైపు గందరగోళ పటాన్ని కనుగొంటారు). మ్యాప్ యొక్క మరొక వైపు పెళ్లిలో విస్కీ వివరాలతో కూడిన ఫన్నీ మ్యాప్ ఉంది, ఇది మింటు పాపా ఆర్మీ క్యాంటీన్ నుండి కొన్నట్లు పేర్కొంది.



Click it and Unblock the Notifications

