For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోలోగా 1485 కిలోమీటర్ల అంటార్కిటికా యాత్ర, చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళ

ఏ మహిళకూ సాధ్యం కానీ ఘనతను ఆమె ఒంటరిగా చేసి చూపించారు. భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఆర్మీ అధికారి కెప్టెన్ ప్రీత్ చాందీ సోలో పోలార్ స్కీ యాత్ర చేపట్టి కొత్త చరిత్రను లిఖించారు.

|

కృషి, పట్టుదల, తపన ఉంటే ఎవరైనా అద్భుతాలు చేస్తారు, మనసు పెట్టి శ్రమిస్తే స్త్రీలకు సాధ్యం కానిది ఏదీ లేదని చాలా మంది మహిళలు నిరూపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వారి వరుసలో కెప్టెన్ ప్రీత్ చాందీ నిలిచారు. ఇప్పటి వరకు ఏ మహిళకూ సాధ్యం కానీ ఘనతను ఆమె ఒంటరిగా చేసి చూపించారు. భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఆర్మీ అధికారి కెప్టెన్ ప్రీత్ చాందీ సోలో పోలార్ స్కీ యాత్ర చేపట్టి కొత్త చరిత్రను లిఖించారు.

preet chandi indian british army officer sets new record for polar expedition in Telugu

యాత్రలో ఎన్నో ప్రమాదాలు:

పోలార్ ఎక్స్‌పిడిషన్ అంటే అంటార్కిటికా, ఆర్కిటికా ధ్రువాలకు యాత్ర చేయడం. అక్కడి ప్రాంతాలను పరిశీలించడం. అంటార్కిటికా, ఆర్కిటికా ధ్రువాల వద్ద వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మైనస్ 30 ఉష్ణోగ్రతలు అక్కడ సర్వసాధారణం. అక్కడ నీరు గడ్డకట్టుకుపోయి ఉంటుంది. అలాంటి చోట్ల జనజీవనం కూడా చాలా కష్టం. అందుకే అలాంటి ప్రదేశాల్లో మనుషులు నివసించరు. అలాంటి ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువే.

చలి తీవ్రతను చాలా మంది తట్టుకోలేరు. అధిక మంచుల గాలులు, తుపానులు, వైట్ అవుట్ పరిస్థితులు, కాళ్ల పగుళ్లతో పాటు అక్కడి వన్య ప్రాణాలు ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అందుకే పోలార్ ఎక్స్‌పిడిషన్‌ను బృందాలుగా చేస్తుంటారు. రోజుల తరబడి ఈ యాత్ర ఉంటుంది.

అయితే బ్రిటీష్ ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ ప్రీత్ చాందీ మాత్రం ఎవరి సహాయం లేకుండా, ఎవరి గైడెన్స్ లేకుండా, ఒంటరిగా పోలార్ ఎక్స్‌పిడిషన్ చేశారు.

preet chandi indian british army officer sets new record for polar expedition in Telugu

70 రోజులు, 1485 కిలోమీటర్లు:

కెప్టెన్ ప్రీత్ చాందీ ఒక్కరే ఈ యాత్ర పూర్తి చేశారు. మొత్తం 70 రోజుల 16 గంటల పాటు ఆమె యాత్ర చేశారు. 70 రోజుల్లో 1,485 కిలోమీటర్ల మేర నడిచారు. ఇంత దూరం ఇప్పటి వరకు ఎవరూ యాత్ర సాగించలేదు. ఒంటరిగా ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన మొదటి మహిళగా ప్రీత్ చాందీ చరిత్రలోకెక్కారు.

70 రోజుల ప్రయాణంలో ప్రీత్ చాందీ ఎన్నో విపరీత వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డారు. మైనస్ 30 డిగ్రీల సెల్సియ్ ఉష్ణోగ్రతను తట్టుకున్నారు. రోజూ 13 నుండి 15 గంటల పాటు స్కీ చేశారు. కొన్ని రోజులు కేవలం 5 గంటలు మాత్రమే పడుకున్నారు.

"ప్రీత్ చాందీ చరిత్రలో ఏ మహిళ చేయని సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేశారు. ఒంటరిగా ఎవరి మద్దతు లేకుండా, ఎవరి సాయం తీసుకోకుండా ధ్రువ యాత్ర చేసి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టారని" ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు పెట్టారు.

తీర ప్రాంతానికి వెళ్లాలన్న తన లక్ష్యానికి మరో 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఆమెను రెస్క్యూ సిబ్బంది తీసుకెళ్లారు. 'మానసికంగా క్రాసింగ్ చేయడానికి నాకు తగినంత సమయం లేదని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది, కానీ యాత్ర నా సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఇతరులకు ప్రేరణగా నిలిచింది కాబట్టి నేను ఇలాంటి ఇక ముందు కూడా చేస్తాను' అని 33 ఏళ్ల కెప్టెన్ ప్రీత్ చాందీ పేర్కొన్నారు.

120 కిలోల సామాగ్రితో 1485 కిలోమీటర్ల ప్రయాణం:

తన సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించడానికి కెప్టెన్ ప్రీత్ చాందీ పూర్తి స్థాయి సామాగ్రితో వెళ్లారు. తన కిట్, అలాగే సామాగ్రిని తీసుకెళ్లారు. అయితే ఈ సామాగ్రి బరువు 120 కిలోలు ఉండేది. దానిని ఓ స్లెడ్జ్‌పై పెట్టి లాక్కుంటూ 1485 కిలోమీటర్లు ప్రయాణించారు ప్రీత్ చాందీ. ఆమె యాత్రలో మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను, 60 మైళ్ల వేగంతో వీచే గాలులను తట్టుకుని ప్రయాణం సాగించారు. 'మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎప్పుడు మొదలు పెట్టారు, మీరు ఎవరూ అనే పట్టింపు లేకుండా మీరు ఏదైనా సాధించవచ్చు' అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

'డెర్బీకి చెందిన ఒక పంజాబీ మహిళ దీన్ని చేయగలిగితే, ఎవరైనా ఏదైనా సాధించవచ్చని' ఆమె పోస్టు పెట్టారు.

preet chandi indian british army officer sets new record for polar expedition in Telugu

19 ఏళ్లకు ఆర్మీలో చేరిన ప్రీత్ చాందీ:

ప్రీత్ చాందీ ప్రస్తుతం బ్రిటీష్ ఆర్మీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆర్మీలో ఫిజియో తెరపిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నరాు. గాయపడిన సైనికులకు వైద్య సాయం అందిస్తారు. కెప్టెన్ ప్రీత్ చాందీ 19 ఏళ్ల వయస్సులోనే ఆర్మీలో చేరారు. ప్రీత్ చాందీ ఇప్పటివరకు మరే మహిళ చేయని ఘనతను సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.

English summary

preet chandi indian british army officer sets new record for polar expedition in Telugu

read this to know preet chandi indian british army officer sets new record for polar expedition in Telugu
Desktop Bottom Promotion