For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్లు చెమర్చే కేరళ ఏనుగు విషాద గాథ.. పండులో పటాసులు పెట్టి మరీ చంపేశారు...!

|

ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారి కనిపించకుండా అందరిని ప్రాణాలను మట్టిలో కలిపేస్తున్నా.. కొందరికి ఇసుమంతైనా బుద్ధి రావడం లేదు. మానవత్వం వారిలో మచ్చుకైనా కనబడటం లేదు. మనుషులనే జంతువుల్లా వేటాడుతున్న ఈ లోకంలో ఇక జంతవులకు దిక్కెక్కడది. జంతువుల కోసం జాలిపడేంత మానవత్వం ఈ లోకంలో ఉందంటే అది అతిశయోక్తే అవుతుందేమో. అయ్యో పాపం అని ఇప్పుడు సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టడం తప్ప మనం ఏమి చేయగలం.

ఇలాంటి ఆపత్కాలంలో మూగజీవాలను, పశు పక్ష్యాదులను ఆదుకోవాల్సింది పోయి వాటి ప్రాణాలనే హరిస్తున్నారు మానవమృగాలు. ఇలాంటి వారి చేష్టల వల్ల మానవత్వం మంటగలిసిపోతుంది.

గర్భంతో ఉన్న ఏనుగు(Pregnant Elephant)కు పండు ఆశ చూపి... అందులో క్రాకర్స్ పెట్టి కాల్చి చంపేసిన విషాదకర సంఘటన కేరళ రాష్ట్రం మలప్పురంలో మే 27వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుండెలను పిండేసే ఈ విషయం గురించి ఫారెస్ట్ ఆఫీసర్ క్రిష్ణమోహన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయిపోయింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రెటీలు కూడా వీరికి గొంతు కలుపుతూ అలాంటి మానవమృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆకలితో గ్రామంలోకి వస్తే..

ఆకలితో గ్రామంలోకి వస్తే..

కడుపుతో ఉన్న ఏనుగు ఆకలితో కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించింది. వీధుల్లో తిరుగుతున్న ఆ ఏనుగుకు పైనాపిల్ చూపించి ఆశ పెట్టారు. అది కూడా ఆహారం దొరికిందని తొండంతో దాన్ని నోట్లో పెట్టుకుంది.

భారీ శబ్దం..

భారీ శబ్దం..

అంతే వెంటనే భారీ శబ్ధంతో అది కాస్త పేలిపోయింది. ఆ సమయంలో ఏనుగుకు భారీగా రక్తస్రావం అయ్యింది. అప్పుడు అది కీటకాల బారి నుండి రక్షించుకునేందుకు సమీపంలోని వెల్లియార్ నది వద్దకు వెళ్లి తొండాన్ని నీళ్లలో ఉంచినట్టు ఆ అధికారి తన ఫేస్ బుక్ పోస్ట్ లో తెలిపారు.

కాలిపోయిన నాలుక..

కాలిపోయిన నాలుక..

సైలెంట్ వ్యాలీ ప్రాంతంలో నివసించే ఆ ఏనుగు పైనాపిల్ తినేటప్పుడు ఏనుగు నాలుక, ముఖం అంతా కాలిపోయింది. ఆ కాలిన గాయాలను భరించలేక, దగ్గర్లో ఉన్న నీటిలోకి దిగింది.

ఏనుగును రక్షించేందుకు..

ఏనుగును రక్షించేందుకు..

ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది గర్భంతో ఉన్న ఆ ఏనుగును రక్షించేందుకు కొన్ని గంటల పాటు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మే 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఆ ఏనుగు చనిపోయిందని చెప్పారు.

గర్భంతో ఉన్న ఏనుగు..

గర్భంతో ఉన్న ఏనుగు..

అది ఎంత నరకయాతన అనుభవిస్తున్నా.. ఎవరికి హాని చేయలేదని, ఏ ఇంటిపై కూడా దాడి చేయలేదని, అలాంటి మంచి జంతువును చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గర్భంతో ఉన్న ఆ ఏనుగు కడుపులో ఉన్న మరో ప్రాణి గురించి ఆలోచించి ఎంత నరకం ఉన్నా అదొక్కటే అనుభవించిందని తన పోస్టులో ఈ విషాదకర సంఘటనను వివరించారు.

శవ పరీక్షలో విస్తుపోయే నిజాలు..

శవ పరీక్షలో విస్తుపోయే నిజాలు..

ఏనుగును సంరక్షించేందుకు మరియు చికిత్స అందించడానికి అటవీ అధికారులు చాలా కష్టపడ్డారు. సహాయక చర్యకు ముందు గాయపడిన ఏనుగును నీటిలో నుండి బయటకు తీశారు. అప్పటికే చనిపోయిన ఏనుగును శవ పరీక్ష చేశారు. ఆ పరీక్షలో ఏనుగు గర్భవతి అని తెలిసింది.

English summary

Pregnant elephant killed in kerala ate firecraker in pineapple

Pregnant elephant recently died in kerala after eating a pineapple filled with firecrackers. Read on.