For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వామ్మో! టాయ్ లెట్ కు వెళ్లిన ఓ కుర్రాడిని సరిగ్గా అక్కడే కొరికిన కొండచిలువ...!

|

సాధారణంగా పాములు మనుషుల్ని కరవడం అనే వార్తలను మనం వింటూ ఉంటాం. ఎలాంటి పాము అయినా సరే, మనుషుల కాళ్లకో లేదా చేతులకో కాటేస్తుంటాయి. లేదా ఇతర చోట్ల కాటేస్తుంటాయి.

కానీ ఓ యువకుడికి మాత్రం పాము సరిగ్గా అక్కడే కరిచేసింది. ఉదయాన్నే టాయ్ లెట్ కు వెళ్లిన ఆ కుర్రాడికి ఉన్నట్టుండి పురుషాంగంలో తీవ్రమైన నొప్పి పెరగడంతో.. ఏం కరిచిందా అని చూసేసరికి, అక్కడ ఓ పాము కనిపించింది.

అంతే ఆ యువకుడు అంగాన్ని గట్టిగా పట్టుకుని, ఆసుపత్రికి పరుగందుకుని.. వైద్యులకు జరిగిన విషయం అంతా చెప్పేశాడు. ఇది విని ఆశ్చర్యపోయిన డాక్టర్లు అతనికి చికిత్స మొదలుపెట్టారు.

ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో పోస్టు అవ్వడంతో గంటల వ్యవధిలోనే ఇది వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్న వీడియోలో చూడండి. ఆ యువకుడు పంటి బిగువన ఎంత నొప్పిని భరించాడో తెలుస్తుంది. అలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదనిపిస్తుంది.

18 ఏళ్ల యువకుడు..

18 ఏళ్ల యువకుడు..

బ్యాంకాక్ దేశంలోని నాదాబ్యూరీ అనే ప్రాంతంలో 18 ఏళ్ల షిరాపప్ మసుకరత్ అనే యువకుడు ప్రతిరోజూ మాదిరిగానే తన రూమ్ లోని టాయ్ లెట్ కు వెళ్లాడు. అలా వెళ్లిన కాసేపటికే ఆ యువకుడికి అంగం నుండి విపరీతంగా నొప్పి మొదలైంది. భరించలేని నొప్పి రావడంతో వెంటనే లేచి నిలబడ్డాడు.

పాము వేలాడుతూ..

పాము వేలాడుతూ..

అంతే అసలు తనకు ఎందుకంతా నొప్పి వచ్చింది.. ఏమి కరిచింది అనే టాయ్ లెట్ లో తొంగి చూస్తే పాము వేలాడుతూ కనిపించింది. అది చూసిన ఈ యువకుడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే గట్టిగా కేకలు వేశాడు. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు తనను వెంటనే బ్యాంగ్ యాయి ఆసుపత్రికి తరలించారు.

మూడు కుట్లు..

మూడు కుట్లు..

విషయం తెలుసుకున్న వైద్యులు ఆ కుర్రాడికి యాంటి బయోటిక్స్ తో ముందుగా అంగాన్ని శుభ్రం చేశారు. అంగం చిట్లడంతో మూడు కుట్లను కూడా వేశారు. మరోవైపు మసుకరత్ పాములను పట్టుకునే వ్యక్తికి సమాచారం అందించారు.

పాముని పట్టుకుని..

పాముని పట్టుకుని..

వెంటనే అక్కడికి చేరుకున్న అతను టాయిలెట్ లో ఉన్న పామును పట్టుకుని అడవుల్లో వదిలిపెట్టాడు. ఈ సందర్భంగా మసుకరత్ మాట్లాడారు. ‘పాము చిన్నగా ఉన్నప్పటికీ.. అది చాలా గట్టిగా కరిచింది. దీంతో అతనికి భరించలేని నొప్పి వచ్చింది' అని తెలిపాడు.

పాము విషపూరితం కాదు..

పాము విషపూరితం కాదు..

ఈ సందర్భంగా బాధితుడి తల్లి మాట్లాడుతూ ‘పాము ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలియదు. బహుశా డ్రైనేజీ పైపు నుండి టాయిలెట్ లోకి వచ్చి ఉండొచ్చు' అని తెలిపారు. అయితే అద్రుష్టవశాత్తు ఆ పాము విషపూరితం కాదని, కొండచిలువ జాతికి చెందిన పామని తెలిసింది. అది గట్టిగా కొరకడం వల్లే వైద్యులు తెలిపారు.

తస్మాత్ జాగ్రత్త..

తస్మాత్ జాగ్రత్త..

మీరు కూడా ఎప్పుడైనా టాయిలెట్ కు వెళ్లినప్పుడు ఒక్కసారి ముందే నీళ్లు వేయడం.. లేదా టాయ్ లెట్ ను ఫ్లష్ చేసి చెక్ చేసుకోవడం మంచిది. లేదంటే మనకు కూడా ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

ఈ విషయంపై మీరెమేనుకుంటున్నారో, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ భాగంలో తెలియజేయగలరు. మీకు ఈ ఆర్టికల్ నచ్చితే లైక్, షేర్, చేయగలరు. ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాల కోసం సబ్ స్క్రైబ్ చేసుకోగలరు.

English summary

Python Bites Man's Penis On The Toilet

Here we talking about python bites man's penis on the toilet.Read on