Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
కరోనాకు వ్యతిరేకంగా పోరాడే సూపర్ హీరోలందరికీ హ్యాట్సాఫ్....
ఈ కరోనా భూతం దెబ్బకు దాదాపు లక్ష మంది బలయ్యారు. 20 లక్షల మంది దీని బారిన పడ్డారు. మన దేశంలో కూడా ఈ వారంలోనే పది వేల మార్కు దాటింది.
కరోనా వైరస్ కనిపించకుండానే ప్రపంచంలోని ప్రతి ఒక్కిరినీ కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలను కమ్మేసింది. ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది వరకు కోవిద్-19 బారిన పడ్డారు. సుమారు లక్ష మంది వరకు కరోనా వైరస్ బారిన పడి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. దీని దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. మన దేశంలో కూడా లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించగలిగాం.

అయితే కరోనా వైరస్ మహమ్మారి నుండి కాపాడేందుకు దేశవ్యాప్తంగా ప్రజలందరూ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అయితే వీరి కంటే ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు, నర్సులు, ఆసుపత్రులలోని ఇతర సిబ్బంది, పోలీసులు, శాస్త్రవేత్తలు, పారిశుధ్య కార్మికులు, డెలివరీ బాయ్స్ తో పాటు ఇంకా ఎంతో మంది కృషి చేస్తున్నారు. ఈ లాక్ డౌన్ విజయవంతం కావడానికి, రోగులకు చికిత్స చేయడానికి, వ్యాక్సిన్ల తయారీలో, ప్రజలకు అవసరమైన వాటిని పంపిణీ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి కఠినమైన సమయంలో వారు చేసే త్యాగానికి మనం కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నుండి మనల్ని కాపాడిన వారికి మీరు కింద ఉన్న కోట్స్ మరియు సందేశాలను షేర్ చేసుకుని వారికి మీరు కూడా అభినందనలు చెప్పండి...

టాప్ -10
‘‘క్లిష్ట సమయంలో ధైర్యంగా ముందుకొచ్చి COVID-19 పాజిటివ్ ఉన్న వారందరికీ చికిత్స చేస్తున్న వైద్యులు మరియు నర్సులకు హ్రుదయపూర్వక ధన్యవాదాలు‘‘

టాప్ - 9
‘‘తమ గురించి.. తమ కుటుంబం గురించి కానీ చింతించని పోలీసులకు, ఆరోగ్య మరియు పారిశుధ్య కార్మికులకు వేల వేల వందనాలు‘‘

టాప్-8
‘‘ప్రియమైన కరోనా వైరస్ యోధులారా, ఈ మహమ్మారి సమయంలో ప్రజల భద్రత మరియు ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము‘‘.

టాప్-7
‘‘మన పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు, డెలివరీ బాయ్స్, మరియు సెక్యూరిటీగార్డులు పనిలో లేకుంటే కరోనా వైరస్ పై యుద్ధంలో విజయం సాధించడం మనకు దాదాపు అసాధ్యంగా మారేది‘‘.

టాప్-6
"COVID-19 రోగులకు చికిత్స చేసి, వారికి కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు వైద్యులు, ఆరోగ్య నిపుణులు మరియు నర్సుల సేవలను ఎప్పటికీ మరచిపోలేం"

టాప్-5
"ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, పోలీసులు మరియు ద్వారపాలకులకు మన కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడానికి ఉత్తమ మార్గం ఏదైనా ఉందంటే, అది మనం అనవసరంగా ఇంటి నుండి బయటకు వెళ్లడమే‘‘

టాప్-4
"ఈ రోజుల్లో ఆరోగ్య కార్యకర్తలు COVID-19 తో బాధపడుతున్నవారికి చికిత్స చేయడానికి అంకితభావంతో మరియు దూకుడుగా పనిచేస్తున్నారు. అందుకని మనం ఇంట్లో ఉంటే అది వారికి ఇచ్చే అతి పెద్ద గౌరవం‘‘.

టాప్-3
‘‘మన ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, శాస్త్రవేత్తలు మరియు పారిశుధ్య కార్మికులే నిజమైన సూపర్ హీరోలు. వారి ప్రాణాలనే పణంగా పెట్టి మరీ విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి సినిమాల్లోని సూపర్ మాన్, ఐరన్ మాన్ లేదా వండర్ వుమెన్ ను మర్చిపోండి‘‘

టాప్-2
"ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, నర్సులు, పోలీసులు కలిసి మనందరం ఇళ్లలో సురక్షితంగా ఉండేందుకు మరియు కరోనా వైరస్ రోగులకు క్వారంటైన్ లో పెట్టి సమర్థవంతంగా చికిత్స చేసేందుకు ఎక్కువ సమయం పని చేస్తున్నారు. అలాంటి వారే మనకు ప్రత్యక్ష దైవాలతో సమానం‘‘.

టాప్-1
‘‘చేయి చేయి కలపకండి.. కాళ్లు అనవసరంగా బయట పెట్టకండి.. ఉన్న దగ్గరే ఉండండి.. ఉన్న దాంట్లోనే సర్దుకోండి.. కష్టాలు అనేవి కలకాలం ఉండవని గుర్తుంచుకోండి.. మంచి రోజులొచ్చే వరకు ఓపికతో ఉండండి.. మీ కోసం.. మన కోసం పగలనకా.. రేయనకా సైనికులై సాగుతున్న వారిని గుర్తుకు తెచ్చుకుని బాధ్యతగా మెలగండి‘‘.



Click it and Unblock the Notifications