For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Makar Sankranti 2023: సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి ప్రధాన కారణాలేంటో తెలుసా...

మకర సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు గల కారణాలేంటో తెలుసుకోండి.

|

సంక్రాంతి అంటేనే భోగి మంటలు.. రంగు రంగుల ముగ్గులు.. అందమైన రంగవల్లులు.. రతనాల గొబ్బిళ్లు.. పిండి వంటలు.. కోడి పందేలు.. గాల్లో పతంగులు కొత్త అల్లుళ్ల సందడి, అమ్మమ్మ, తాతయ్యలతో సరదాగా గడపడం.. కుటుంబసభ్యులు, బంధువులందరితో కలిసి ఆనందంగా గడిపే క్షణాలను సంక్రాంతి పండుగ అందరి ఇంటా తీసుకొస్తుంది.

Reasons why celebrate Makar Sankranti?

అందుకే ఈ పండుగ సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని లోగిళ్లలో సంతోషం నిండుతుంది. మరోవైపు పంట చేతికందిన తర్వాత అన్నదాత కళ్లలో ఆనందం తెచ్చే సంక్రాంతి అచ్చమైన తెలుగు వారి పండుగ.

Reasons why celebrate Makar Sankranti?

అంతేకాదండోయ్ ఈ పండగొచ్చొందంటే చాలు బసవన్న చిందులు.. హరిదాసుల సంకీర్తనలు.. గాలిపటాలు.. బావమరదళ్ల సరసాలు.. ఇలా ఎన్నో సరదాలతో సంక్రాంతి పండుగను అందరూ ఆనందంగా జరుపుకుంటారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ జనవరి 15వ తేదీన ఆదివారం నాడు వచ్చింది. ఈ క్రమంలోనే 14వ తేదీన భోగి పండుగను జరుపుకుంటారు. 16వ తేదీన కనుమ పండుగను జరుపుకోనున్నారు. ఈ వేళలో పూజలు చేయడానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి పండుగ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సంక్రాంతి రోజు పెద్దలను ఎలా పూజించాలి? ఎలా బట్టలు సమర్పించాలి?సంక్రాంతి రోజు పెద్దలను ఎలా పూజించాలి? ఎలా బట్టలు సమర్పించాలి?

ఆనందాల సంక్రాంతి..

ఆనందాల సంక్రాంతి..

ఈ సంక్రాంతి సమయంలో పండుగ అంతా పల్లెటూళ్లలోనే కనబడుతుంది. ఉద్యోగులు, కూలీ పని చేసుకునే వాళ్లు, వలస వెళ్లిన వారంతా పట్నం వదలి పల్లెటూళ్ల బాట పడతారు. సంక్రాంతి తమ కుటుంబంతో సరదాగా గడిపేందుకు స్వస్థలాలకు చేరుకుంటారు. వీరి రాకతో పల్లెలు మరింత శోభతో వెలిగిపోతాయి. వెళ్తూ.. వెళ్తూ.. ఏడాదికి సరిపోయే ఆనందాన్ని తీసుకెళ్తారు. అందుకే సంక్రాంతిని ఆనందాల క్రాంతి అంటారు.

ఎక్కువ ఆచారాలు..

ఎక్కువ ఆచారాలు..

చలికాలంలో ఎక్కువమంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే పండుగ మకర సంక్రాంతి. ఈ పండుగకు సరదాగా నృత్యం చేయడం, పాడటం మరియు కాలానుగుణ వేరుశెనగ మరియు స్వీట్లు కలిసి తినడానికి ప్రజలు సమావేశమయ్యే సమయాన్ని ఇది సూచిస్తుంది. ప్రజలు ఈరోజున పవిత్ర స్నానం చేసి విరాళాలు ఇస్తారు. ఈ విధంగా, సరదాగా నిండిన కార్యకలాపాలతో పాటు, ఈరోజున ఇలాంటి ఆచారాలను ఎక్కువగా పాటిస్తారు.

రేగి పళ్లతో అభిషేకం..

రేగి పళ్లతో అభిషేకం..

మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. ఈ సమయంలో భగభగ మండే మంటల్లో పాత వస్తువులను, గోవు పిడకలను వేయడంతో ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఇదేరోజున చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు. పురాణాల ప్రకారం, ఈరోజున బదరీ వనంలో శ్రీమహా విష్ణువును పసిబాలుడిగా మార్చి దేవతలు బదరీ పండ్లు(రేగి పళ్లు)తో అభిషేకం చేశారు.

Makar Sankranti 2022:ఈ ఏడాది మకర సంక్రాంతి పండుగ ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్తం ఎప్పుడంటే?Makar Sankranti 2022:ఈ ఏడాది మకర సంక్రాంతి పండుగ ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్తం ఎప్పుడంటే?

ఉత్తరాయణంలోకి సూర్యుడు..

ఉత్తరాయణంలోకి సూర్యుడు..

రెండో రోజు అంటే మకర సంక్రాంతి సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే రోజున సూర్యభగవానుడు దక్షిణయానం నుండి ఉత్తరయాణంలోకి రావడం వల్ల పుణ్యకాలం ప్రారంభమవుతుంది.

దాన ధర్మాలు..

దాన ధర్మాలు..

ఇక మూడు రోజు కనుమ పండుగ. ఈ సమయంలో పశువులను అలంకరించి పూజిస్తారు. ఈ పండుగ సందర్భంగా నాలుగో రోజున ముక్కనుమగా వ్యవహరిస్తారు. ఈరోజున కొన్ని ఊళ్లలో కొత్తగా వివాహం చేసుకున్న యువతులు తమ సౌభాగ్యం కోసం బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. అలాగే సంక్రాంతి రోజున పిత్రు దేవతల ఆత్మ శాంతి కోసం వారి వారి సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తారు.

సంక్రాంతి సమయంలో..

సంక్రాంతి సమయంలో..

ఈ పండుగ సమయంలో చేసే ప్రత్యేక వంటకాలు ప్రతి ఒక్కరినీ నోరూరిస్తాయి. ఇలాంటి పిండి వంటలు ఏ పండగకూ చేయరంటే అతిశయోక్తి కాదేమో. చాలా మందికి వాటి నుండి వచ్చే సువాసనకే కడుపు నిండిపోతూ ఉంటుంది. ఎందుకంటే సున్నుండలు, అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, గోరువిటిలు, పూతరేకులు, పాకుండలు, బూరెలు, గారెలు, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే పెరుగుతుంది తప్ప తగ్గదు. ఈ పండుగ సందర్భంగా ఎవరికిష్టమొచ్చిన వంటలు వారు వండుకుంటూ.. వాటిని చుట్టుపక్కల వారికి కూడా పంచుతూ సంక్రాంతి సంతోషాన్ని అందిరితో పంచుకుంటారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి సమయంలో ఉదయం మరియు సాయంత్రం వేళలో గాలిపటాలను ఎగురవేస్తారు. ఈ సమయంలో పెద్దవారు కూడా పిల్లలైపోతారు.

FAQ's
  • 2022 సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ ఎప్పుడొచ్చింది?

    ఈ ఏడాది సంక్రాంతి పండుగ జనవరి 15వ తేదీన శనివారం నాడు వచ్చింది. ఈ క్రమంలోనే 14వ తేదీన భోగి పండుగను జరుపుకుంటారు. 16వ తేదీన కనుమ పండుగను జరుపుకోనున్నారు. మకర సంక్రాంతి రోజున అంటే 15వ తేదీ మధ్యాహ్నం 2:43 గంటల నుండి సాయంత్రం 5:45 గంటల వరకు శుభ ముహుర్తం ఉంది. ఈ వేళలో పూజలు చేయడానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

  • సంక్రాంతి వేళ దాన ధర్మాలెందుకు చేస్తారు?

    ఇక మూడు రోజు కనుమ పండుగ. ఈ సమయంలో పశువులను అలంకరించి పూజిస్తారు. ఈ పండుగ సందర్భంగా నాలుగో రోజున ముక్కనుమగా వ్యవహరిస్తారు. ఈరోజున కొన్ని ఊళ్లలో కొత్తగా వివాహం చేసుకున్న యువతులు తమ సౌభాగ్యం కోసం బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. అలాగే సంక్రాంతి రోజున పిత్రు దేవతల ఆత్మ శాంతి కోసం వారి వారి సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తారు.

  • సంక్రాంతి పండుగ ఎక్కువగా జరుపుకునే ప్రాంతాలేవి?

    ఈ సంక్రాంతి సమయంలో పండుగ అంతా పల్లెటూళ్లలోనే కనబడుతుంది. ఉద్యోగులు, కూలీ పని చేసుకునే వాళ్లు, వలస వెళ్లిన వారంతా పట్నం వదలి పల్లెటూళ్ల బాట పడతారు. సంక్రాంతి తమ కుటుంబంతో సరదాగా గడిపేందుకు స్వస్థలాలకు చేరుకుంటారు. వీరి రాకతో పల్లెలు మరింత శోభతో వెలిగిపోతాయి. వెళ్తూ.. వెళ్తూ.. ఏడాదికి సరిపోయే ఆనందాన్ని తీసుకెళ్తారు. అందుకే సంక్రాంతిని ఆనందాల క్రాంతి అంటారు.

English summary

Reasons why we celebrate Makar Sankranti in Telugu

Here are these reasons why celebrate makar sankranti. Take a look
Desktop Bottom Promotion