For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొదటి రిపబ్లిక్ డే ఎక్కడ జరిగింది... ఎందుకని ఈ వేడుకలను జరుపుకుంటారో తెలుసా...

|

మన దేశంలో చాలా మందికి రిపబ్లిక్ డే అంటే సెలవు రోజు అని చాలా మందికి బాగా తెలుసు. ఈరోజున చాలా మంది సినిమాలు, షికార్లు, షాపింగులు, పార్కులు ఇతర విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇప్పటికీ మనలో చాలా మందికి జనవరి 26వ తేదీనే గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో అనే విషయం తెలియదు.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన విషయం నేటి యువతలో అతి తక్కువ మందికే తెలుసు. ఇలాంటి విషయాలపై ఎవరైనా సర్వే నిర్వహిస్తే మనం సిగ్గుతో తల దించుకునే సంచలన విషయాలే బయటపడతాయి.

అందుకే జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత ఏంటి? తొలిసారి ఈ వేడుకలు ఎక్కడ జరిగాయి అనే విషయాలతో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...

1950లో సంపూర్ణ స్వరాజ్యం..

1950లో సంపూర్ణ స్వరాజ్యం..

మనలో చాలా మందికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందని అడిగితే చాలా మంది 1947 ఆగస్టు 14వతేదీ అర్ధరాత్రి అని టక్కున చెబుతుంటారు. అయితే సంపూర్ణ స్వరాజ్యం ఎప్పుడు వచ్చిందని ప్రశ్నిస్తే అతి కొద్ది మందే సమాధానమిస్తున్నారు.

స్వాతంత్య్రం తర్వాత..

స్వాతంత్య్రం తర్వాత..

1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన మన దేశానికి సంపూర్ణ స్వరాజ్యం రావడంతో.. స్వాతంత్య్రం తర్వాత మనం గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరంగా ఘనంగా జరుపుకుంటున్నాం.

ఇర్విన్ స్టేడియంలో..

ఇర్విన్ స్టేడియంలో..

మనలో చాలా మందికి మొదటి గణతంత్ర దినోత్సవం ఎక్కడ జరిగిందనే విషయం తెలియదు. అందరూ అనుకున్నట్టు తొలి గణతంత్ర దినోత్సవం రాజ్ పథ్ లో కాకుండా ఇర్విన్ స్టేడియంలో అంటే ధ్యాన్ చంద్ స్టేడియంలో జరుపుకున్నారట.

మధ్యాహ్నం సమయంలో..

మధ్యాహ్నం సమయంలో..

అప్పటికి సరిహద్దు గోడ నిర్మించబడలేదట. పాత కోట మాత్రమే కనిపించింది. ఇది మాత్రమే కాదు. మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉదయం సమయంలో కాకుండా మధ్యాహ్న సమయంలో జరుపుకున్నారట.

ఆరు గుర్రాల బగ్గీలో...

ఆరు గుర్రాల బగ్గీలో...

ఆ సమయంలో మన దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి భవన్ ను ఆరు గుర్రాల బగ్గీలో బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు వేదిక వద్దకు బయలుదేరారు.

తుపాకులతో తొలి వందనం..

తుపాకులతో తొలి వందనం..

అక్కడ దేశ తొలి అధ్యక్షుడు చేరుకున్న వెంటనే అతని రైడ్ క్వార్టర్ నుండి నాలుగు గంటల వరకు సెల్యూట్ దశకు చేరుకుంది. అప్పుడు మన దేశ అధ్యక్షుడికి 31 ఫిరంగులతో వందనం ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ఇది 21 తుపాకులకు తగ్గించబడి.

రాజ్యాంగం అమల్లోకి..

రాజ్యాంగం అమల్లోకి..

1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ. అందుకే ఆరోజున ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకుంటున్నారని చాలా మంది భావిస్తారు. ఇది కొంతవరకు నిజమే అయినప్పటికీ, అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది.

వాస్తవానికి నవంబర్ 26నే..

వాస్తవానికి నవంబర్ 26నే..

వాస్తవానికి 1949 నవంబర్ 26వ తేదీనే అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. అయితే దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశ్యంతో రెండు నెలల పాటు వేచియున్నారు.

లాహోర్ వేదికగా..

లాహోర్ వేదికగా..

అంతకుముందు లాహోర్ వేదికగా 1930లో జనవరి 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిా పూర్ణ స్వరాజ్యం గురించి తీర్మానం చేశారు. రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు.

జలియన్ వాలా బాగ్..

జలియన్ వాలా బాగ్..

అప్పటి వరకు మనకు కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్య్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం ఆంగ్లేయుల చేతుల్లో ఉన్నా పర్వాలేదనుకున్నా మన రాజకీయ నాయకుల వైఖరిని జలియన్ వాలా బాగ్ ఉదంతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చసింది.

జలియన్ వాలా బాగ్..

జలియన్ వాలా బాగ్..

అప్పటి వరకు మనకు కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్య్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం ఆంగ్లేయుల చేతుల్లో ఉన్నా పర్వాలేదనుకున్నా మన రాజకీయ నాయకుల వైఖరిని జలియన్ వాలా బాగ్ ఉదంతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చసింది.

నెహ్రూ, బోస్ సఫలం..

నెహ్రూ, బోస్ సఫలం..

ఆనాడు సుభాష్ చంద్రబోస్, జవహార్ లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆరోజే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవంగా పిలుపు కూడా ఇచ్చింది.

గణతంత్ర రాజ్యంగా...

గణతంత్ర రాజ్యంగా...

1950 సంవత్సరంలో ఇంగ్లీష్ వారి కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దు అయ్యింది. జనవరి 26వ తేదీన భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

ఎన్నో సవరణల అనంతరం..

ఎన్నో సవరణల అనంతరం..

రాజ్యాంగ రచన ముసాయిదా నిర్మాతగా డాక్టర్ అంబేద్కర్ ను నియమించారు. రాజ్యాంగ రచనకు ఎంతో మంది మేధావులు వివిధ దేశాలను రాజ్యాంగాలన పరిశీలించి, అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో, అనేక సవరణల అనంతరం మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించారు.

ఎంత సమయం పట్టిందంటే..

ఎంత సమయం పట్టిందంటే..

మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం 64 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది.

అప్పటినుంచే స్వేచ్ఛ, సమానత్వం..

అప్పటినుంచే స్వేచ్ఛ, సమానత్వం..

బ్రిటీష్ పరిపాలన నుండి విముక్తి పొందిన మన భారతదేశంలో భారత పౌరులందరినీ ఒకే ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు.

హక్కులతో పాటు బాధ్యతలు..

హక్కులతో పాటు బాధ్యతలు..

రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వంతో పాటు హక్కులు, బాధ్యతలకు కూడా చోటు కల్పించారు. కుల, మత, లింగ, వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ ప్రతి పౌరుడికీ అన్ని సేవలు అందాలని, ప్రతి ఒక్కరు ప్రాథమిక హక్కులను కలిగి ఉండాలని, మన దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడుచుకోవాలని వీటన్నింటినికీ రాజ్యాంగంలో చోటు కల్పించారు. వీటన్నింటినీ గుర్తు చేస్తుకుంటూ మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం.

ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ బోల్డ్ స్కై తెలుగు తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...

English summary

Republic Day History and why do we celebrate

Here we talking about republic day history and why do we celebrate. Read on
Story first published: Saturday, January 25, 2020, 15:19 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more