For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కన్యరాశిలోకి బుధుడి తిరోగమనం.. రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...!

2021లో అక్టోబర్ లో బుధుడు తిరోగమనం చెందనున్నాడు. అలాగే వృశ్చికంలోకి తిరోగమనం చెందనున్నాడు. ఈ నేపథ్యంలో రాశిచక్రాలపై పడే ప్రభావమేంటో తెలుసుకోండి.

|

నవగ్రహాలలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. బుధుడిని తెలివితేటలు, మేధస్సు, జ్ణానానికి, సంతోషానికి సంబంధించి కారకంగా భావిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరూ బుధుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటారు.

Retrograde Mercury Transits In Virgo on October 2, 2021; Effects on all 12 Zodiac Signs in Telugu
అలాంటి బుధుడు అక్టోబర్ రెండో తేదీన ఉదయం 3:23 గంటలకు తుల రాశి నుండి కన్యరాశిలోకి తిరోగమనం చెందనున్నాడు. ఇదే రాశిలో సుమారు నవంబర్ రెండో తేదీన ఉదయం 9:43 గంటల వరకు ఇక్కడే ఉండనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశుల వారిపై కచ్చితంగా ఏదో ఒక ప్రభావం అనేది ఉంటుంది.
Retrograde Mercury Transits In Virgo on October 2, 2021; Effects on all 12 Zodiac Signs in Telugu

బుధుడు ఇలా ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడం వల్ల ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏ రాశుల ప్రతికూలంగా ఉంటుంది.. బుధుడి అనుగ్రహం కోసం ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Venus Transit in Scorpio On 02 October 2021:వృశ్చికంలో శుక్రుడి రవాణా.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!Venus Transit in Scorpio On 02 October 2021:వృశ్చికంలో శుక్రుడి రవాణా.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఆరో స్థానం గుండా తిరోగమనం చెందనున్నాడు. బుధుడు కన్యరాశిలోకి తిరోగమనం చెందడం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రత్యర్థులు మరియు శత్రువులు చాలా చురుగ్గా ఉంటారు. ఉద్యోగులు సహోద్యోగుల పట్ల ప్రశాంతంగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఉద్యోగాన్ని మార్చాలని కూడా ప్లాన్ చేయొచ్చు. అయితే మీరు బాగా ఆలోచించిన తర్వాత కొత్త అవకాశం గురించి నిర్ణయం తీసుకోవాలి.

పరిహారం : మీరు ఈ కాలంలో శుభ ఫలితాలను పొందేందుకు చెట్లను నాటాలి. ముఖ్యంగా తాటి చెట్టును నాటండి.

వృషభ రాశి...

వృషభ రాశి...

ఈ రాశి నుండి బుధుడు ఐదో స్థానం ద్వారా తిరోగమనం చెందనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ జీవితానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ ప్రేమ జీవితం ఆగిపోయినట్లు మీకు అనిపించొచ్చు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండాలి. ఈ కాలంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : ఆలయంలో ఏవైనా ధాన్యాలను దానం చేయాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి బుధుడు నాలుగో స్థానం మార్గం గుండా తిరోగమనం చెందనున్నాడు. ఈ కాలంలో మీ వ్యక్తిత్వాన్ని ఇతరులు ఎలా గ్రహిస్తారో మరియు మీ కుటుంబంతో కమ్యూనికేషన్ ప్రభావితం చేయొచ్చు. ఈ కాలంలో మీరు కుటుంబ జీవితం విషయం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కుటుంబానికి సంబంధించి ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి.

పరిహారం : బుధవారం రోజున నారాయణుడిని పూజించాలి మరియు స్వీట్లు సమర్పించాలి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి బుధుడు మూడో స్థానం ద్వారా తిరోగమనం చెందనున్నాడు. ఈ కాలంలో మీకు ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు చేయొద్దు. ఉద్యోగులు ఎలాంటి గాసిప్ లలో పడకండి.

పరిహారం : మీ గది తూర్పు దిశలో గ్రీన్ కార్నెలియన్ చెట్టును ఉంచండి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి బుధుడు రెండో స్థానం ద్వారా తిరోగమనం చెందనున్నాడు. ఈ కాలంలో మీకు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ బడ్జెట్ ను ప్లాన్ చేసుకోవాలి. మీరు అనవసరమైన ఖర్చు చేయకూడదు. మీ పెట్టుబడికి సంబంధించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ సందర్భంలో కూడా, మీరు పెట్టుబడి పెట్టాల్సి వస్తే, మీరు సురక్షితమైన వాటిలో పెట్టుబడి పెట్టాలి.

పరిహారం : ఈ కాలంలో శ్రీ క్రిష్ణుని కథలు వినాలి

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశిలోకి బుధుడు కన్యరాశిలోకి తిరోగమనం చెందనున్నాడు. ఈ కాలంలో మిశ్రమ సంకేతాలను పొందే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో గందరగోళానికి గురవుతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కమ్యూనికేషన్ లోపాల కారణంగా, మీరు నష్టానికి గురవుతారు. మీరు ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.

పరిహారం :‘ఓం బం బుధాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి బుధుడు 12వ స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో చాలా కాలం పాటు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే అదే సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల. మీ శత్రువులు మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు ఈ కాలంలో తెలివిగా వ్యవహరించాలి.

పరిహారం : ఈ కాలంలో మీ కుడి చేతి చిటికిన వేలికి బంగారం లేదా వెండితో రూపొందించిన మంచి నాణ్యత గల పచ్చని ధరించండి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి బుధుడు పదకొండో స్థానం ద్వారా తిరోగమనం చెందనున్నాడు. ఈ కాలంలో మీ అన్నదమ్ములు, స్నేహితులత కొన్ని అపార్థాలు ఎదుర్కోవచ్చు. మీరు ఒకటి ఎక్కువ ఆదాయ వనరులను కలిగి ఉంటే ఈ కాలంలో మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. ఈ కారణంగా మీరు మీ చెల్లింపులను గ్రహించడం కష్టమవుతుంది. మీరు ఆకస్మిక పెట్టుబడి నుండి ఆకస్మిక లాభం పొందొచ్చు. మీరు దీర్ఘకాలిక పెట్టుబడులను ప్లాన్ చేయొద్దు.

పరిహారం : ప్రతిరోజూ దుర్గా చాలీసా పారాయణం చేయండి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి బుధుడు పదో స్థానం ద్వారా తిరోగమనం చెందనున్నాడు. ఈ కాలంలో మీ వ్యాపార భాగస్వామితో మీ కెరీర్ కు సంబంధించిన మీ కమ్యూనికేషన్ పై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మీరు అహంకారంగా మారొచ్చు. ఉద్యోగులు ఈ కాలంలో సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులను కలవరపెట్టొచ్చు. కాబట్టి మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆలోచనాత్మకంగా మాట్లాడాలి.

పరిహారం : మీ గది తూర్పు దిశలో గ్రీన్ కార్నెలియన్ ఉంచండి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి బుధుడు తొమ్మిదో పాదం ద్వారా తిరోగమనం చెందనున్నాడు. మీ కార్యాలయంలోని మీ కమ్యూనికేషన్ పై ప్రభావం చూపుతుంది. ఈ కాలంలో మీరు ప్రయాణానికి దూరంగా ఉండాలి. మీ సహోద్యోగులు మీకు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీరు ఈ కాలంలో ఏదైనా మతపరమైన ప్రదేశానికి వెళ్లొచ్చు. దీని వల్ల మీకు ప్రయోజనకరంగా ఉండొచ్చు.

పరిహారం : బుధుడి శుభ ఫలితాలను పొందడానికి భగవద్డీత చదవాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఎనిమిదో పాదం ద్వారా తిరోగమనం చెందనున్నాడు. ఈ రవాణా వల్ల మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు పిల్లల జీవితం గురించి ఆందోళన ఉండొచ్చు. ఈ రవాణా కారణంగా మీపై ప్రతికూలంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో మీరు మరింత ప్రశాంతంగా ఉండాలి. విద్యార్థులకు ఈ సమయం మెరుగ్గా ఉంటుంది.

పరిహారం : బుధవారం రోజున వినాయకుడిని పూజించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఏడో స్థానం గుండా తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో మీరు వ్యాపార లావాదేవీలు, ఒప్పందాలపై సంతకాలు చేయడం మరియు రవాణా పూర్తయ్యే వరకు వాయిదా వేయడానికి ప్రయత్నించాలి. మీ భాగస్వామితో వాదన జరిగినప్పుడు, ప్రశాంతంగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అత్తమామలతో మీ సంబంధాలలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. విద్యార్థులకు కూడా ఈ కాలంలో ప్రతికూలంగా ఉంటుంది.

పరిహారం : విష్ణుమూర్తి అవతారాల కథలను చదవండి.

English summary

Retrograde Mercury Transits In Virgo on October 2, 2021; Effects on all 12 Zodiac Signs in Telugu

Mercury Retrograde October 2021: Know impact on the natives of all zodiac signs due to the transit of Mercury in Virgo in a retrograde position. Read on
Story first published:Monday, October 4, 2021, 18:44 [IST]
Desktop Bottom Promotion