For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శని మకరంలోకి ప్రవేశించే సమయంలో ఏయే రాశుల వారికి లాభమంటే...!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2020 సంవత్సరంలో మే 11వ తేదీ నుండి శని ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించాడు. అయితే శని ఇలా సంచరించినప్పుడు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది? ఇది మన జీవితాల్ని ఎన్ని రకాలుగా ప్రభావితం చేస్తుంది. శని మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో రాశి వారికి ఎలా ఉండబోతోంది అన్నవిషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...

మేష రాశి..

మేష రాశి..

శని మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అయితే వీరు శాంతిని కోరుకుంటూ ఉంటారు. అలాగే మేషరాశి వారి చుట్టూ సానుకూల శక్తి ఉంటుంది. వీరు ప్రేరణతో నిండిపోతారు. అయితే మీరు తెలివిగా పని చేయాలి. మీ ప్రియమైన వారిని బాగా చూసుకోవాలి. యోగా మరియు ధ్యానం వంటివి మీకు కష్టం కలిగినప్పుడు మిమ్మల్ని ప్రశాంతంగా మరియు విశ్రాంతిగా ఉంచడంలో మీకు సహాయపడతాయి. మీ రిలేషన్ షిప్ లో డబ్బు కీలకంగా మారుతుంది. ప్రతి సోమవారం శివుడిని ఆరాధించాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

శని మకరంలోకి ప్రవేశించిన సమయంలో వృషభరాశి వారికి కొంత ఆందోళన ఉంటుంది. మీరు కొంత ఒత్తిడికి గురవుతారు. అయితే ఇలాంటి సమయంలో మీరు మీ కుటుంబసభ్యులు మరియు ప్రియమైన వారి నుండి సహాయం పొందవచ్చు. దీని వల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో విజయవంతమయ్యే అవకాశం ఉంది. మీకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. మీరు ప్రశాంతంగా పనులు చేసుకోవాలి. త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి.

మిధున రాశి..

మిధున రాశి..

శని మకరంలోకి ప్రవేశించినప్పుడు మిధున రాశి వారు కష్టపడి పని చేయాలి. మీరు సోమరితనంగా ఉండకుండా పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మరోవైపు ఫైనాన్స్ మరియు ఆరోగ్య పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయాన్ని ఉత్తమంగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి. పాత విషయాలను పక్కపెట్టి కొత్త జీవితం గురించి ఆలోచించి ముందుకు సాగడం చాలా అవసరమని గుర్తించాలి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

మీరు ఆశాజనకంగా ఉండటం మంచిది. పరిస్థితులు మెల్లగా బాగుపడతాయని ఆశించాలి. మీరు వివాహం కోసం మీ భాగస్వామిని ప్రతిపాదించవచ్చు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి మద్దతు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు సమస్యలు పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉండకపోవచ్చు. మీ ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది.

డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి ప్రత్యర్థులు బలమైన దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే, మీరు మీ బలంతో వాటిని ధీటుగా ఎదుర్కొంటారు. అయితే ఈ సమయంలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీ కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. ఉద్యోగులకు వారి యజమానితో కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు కొన్నిసార్లు కష్టమైన మరియు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాటిని మీరు అధిగమించగలరు. ఆర్థిక పరంగా కర్చులు పెరుగుతాయి.

కన్యరాశి..

కన్యరాశి..

ఈ రాశి వారు కొత్త స్నేహ సంబంధాలను ప్రారంభించవచ్చు. అయితే స్నేహం పేరిట తరచుగా గొడవలు జరుగుతాయి. అయితే ఈ సమయంలో విద్యార్థులు మరింత కష్టపడాలి. వివాహితులకు తరచుగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అదనపు జాగ్రత్త వహించాలి. పిల్లలు పుట్టాలని ఎదురుచూస్తున్న జంటలు ఈ సమయంలో కొన్ని మంచి వార్తలను వినొచ్చు.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఉత్సాహంగా ఉంటారు. అయితే మీరు కష్టపడి పని చేయాలి. మీ నైపుణ్యాలను, ముఖ్యంగా కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకోవాలి. అలాగే, పరధ్యానం చెందకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం మీద దృష్టి పెట్టండి. మరోవైపు మీకు ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతాయి. కొన్నిసార్లు కుటుంబంలో మీ ఒత్తిడి పెరుగుతుంది. మీరు మీ ఖర్చులపై శ్రద్ధ పెట్టాలి.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

శని మకరంలోకి ప్రవేశించిన సమయంలో మీరు ప్రతిదీ ఉత్తమంగా చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే మీరు కొంత సోమరితనం కలిగి ఉండొచ్చు. మీరు స్నేహితుల సహాయంతో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీరు కార్యాలయంలో ఆర్థికంగా లాభం పొందవచ్చు. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు అవకాశం లభిస్తుంది. కొన్ని కొత్త అభిరుచులను అభివృద్ధి చేయడానికి మరియు కొన్ని కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది ఉత్తమ సమయం.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు శని మకరంలోకి ప్రవేశించినప్పుడు సాహసాలను చేయాలని అనుకుంటారు. ఇందుకు వీరికి సానుకూల శక్తి కూడా తోడ్పడుతుంది. మీరు కొన్ని కొత్త సాహసాలలో ఉన్నప్పుడు కొన్ని కొత్త అనుభవాలను పొందవచ్చు. ఈ సమయంలో, మీరు మీ కుటుంబం మరియు ప్రియమైనవారితో కొంత నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తారు. అయితే మీరు ఆర్థిక విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

మకర రాశి..

మకర రాశి..

శని మకరంలోకి ప్రవేశించినప్పుడు మీరు అనవసరమైన కార్యకలాపాలకు మీ శక్తిని ఉపయోగిస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు దూరంగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. ప్రేమ విషయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ అహంకారం మరియు ఆలోచన అలాగే ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త అవకాశాలు రావచ్చు. కానీ మీరు నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా విశ్లేషించి తీసుకోవాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

శని మకరంలోకి ప్రవేశించినప్పుడు ఈ రాశి వారు కోపంగా ఉంటారు. అంతేకాదు ఎక్కువ డబ్బును కూడా ఖర్చు చేసే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమయంలో మీరు ఎలాంటి రిస్క్ చేయకుండా ఉండటం మంచిది. మీ జీవితంలో ఈ సమయంలో శత్రువులను ఓడించవచ్చు. మతపరమైన ప్రదేశంలో గురువులాంటి వ్యక్తిని సందర్శించే అవకాశం కూడా మీకు ఉంటుంది. మరోవైపు మీరు మీ ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పనులకు ఖర్చు చేయకుండా ప్రయత్నించండి. సమయాన్ని వృథా చేయకుండా, మీరు కొన్ని కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు.

మీన రాశి..

మీన రాశి..

శని మకరంలోకి ప్రవేశించినప్పుడు ఈ రాశి వారు వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు కొన్ని ప్రయాణాలను కూడా చేయవచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు. మీ ప్రియమైన వారితో సంబంధాలు ఆస్తి తగాదాల వల్ల ఒత్తిడిగా ఉంటుంది. మీరు కష్టపడి పని చేయాలి. అప్పుడే పరిస్థితులు మెరుగుపడతాయి.

English summary

Saturn Retrograde 2020 Effects on All the Zodiac Signs

Saturn Retograde which is the phenomenon of Saturn moving backwards or in opposite direction is taking place on 11 May 2020. This will affect different zodiac signs in a different way. In order to know more, scroll down the article.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more