Latest Updates
-
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.?
శని మకరంలోకి తిరోగమనం.. ఈ పరిహారాలు పాటిస్తే మంచి ఫలితం...!
శని మకరంలోకి ప్రవేశించే సమయంలో పాటించాల్సిన పరిహారాలేంటో తెలుసుకోండి...
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన దేశంలో జ్యోతిష్యాన్ని నమ్మే వారంతా రాశి ఫలాలను విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నుండి శని గ్రహం మకర రాశిలోకి తిరోగమనంలో పయనించనున్నాడు.

ఇలా వ్యతిరేక దిశలో మే నెలలో ప్రారంభమైన తర్వాత అక్టోబర్ 11వ తేదీకి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో శని దేవుని వల్ల చాలా మందికి అనేక సమస్యలు ఎదురుకావొచ్చు.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రూపంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమస్యల నుండి బయటపడాలన్నా.. మన మీద శని ప్రభావం పడకూడదన్నా.. కొన్ని దోష నివారణలు పాటించాలి. ఈ నేపథ్యంలో శని గ్రహం తిరోగమనం వల్ల ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కోసం ఏ పరిహారాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

శని మంత్రాలు..
శని మకరంలోకి ప్రవేశించే సమయంలో మీరు కొన్ని శని మంత్రాలను పఠించాలి. ముఖ్యంగా శనివారం రోజున స్నానం చేసే ముందు దశరథకృతా శనిస్తోత్రం పారాయణం చేయాలి. మీకు సంబంధించిన వారు తరచుగా ఏవైనా ఇబ్బందులను ఎదుర్కొంటుంటే.. 108 సార్లు ఈ మంత్రాలను పఠించాలి. ‘ఓం షామ్ అభిహస్తాయ నమహా' అని మంత్రాన్ని పఠించడం వల్ల మీ భయాలను అధిగమించొచ్చు.

శని పూజ..
శని దేవుని నుండి సమస్యలు ఎదురుకాకకూడదంటే.. మీరు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం మీరు రావి చెట్టును ఆరాధించాలి. ఆ చెట్టు ముందు ఆవ నూనెతో దీపం తయారు చేసి వెలిగించాలి. చెట్టు అడుగున చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. అనంతరం మీ పూర్వీకులను ప్రార్థిస్తే శని ప్రభావం తగ్గి.. శని దేవుని అనుగ్రహం లభిస్తుంది.

ఆటంకాలు అధిగమించాలంటే..
శని దేవుని అనుగ్రహం కోసం మీరు శనివారం రోజున తప్పనిసరిగా నల్లని రంగులో ఉన్న ఆవు లేదా నల్ల రంగులో శునకం లేదా నలుపు రంగులో ఉండే పక్షులకు ఆహారాన్ని ఇవ్వాలి. వాటికి ఆహారాన్ని పెట్టడం వల్ల కొంతమేరకు శని ప్రభావం నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు మీరు చేపట్టే పనుల్లో ఏదైనా ఆటంకం ఎదురైనా సులభంగా అధిగమించే అవకాశం లభిస్తుంది. మీ పెండింగు పనులు కూడా తిరిగి ప్రారంభమవ్వడమే కాదు.. సకాలంలో ప్రారంభమవుతాయి.

వీటిని దానం చేయాలి..
శని దేవుని అనుగ్రహం కోసం మీరు నలుపు రంగు వస్తువులను దానంగా ఇవ్వాలి. ఆవ నూనె, నలుపు రంగులో ఉన్న పాదరక్షలు, నువ్వులు, ఇనుము వంటి వస్తువులను విరాళంగా ఇవ్వాలి. అయితే దానం చేయాలనుకున్న వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి తీసుకురాకూడదు. ఇంటి బయట నుండే దానం చేయాలని గుర్తుంచుకోండి.

ఆర్థిక సమస్యలకు పరిష్కారం..
శనివారం రోజున జమ్మిచెట్టును పూజిస్తే.. శని దేవుడు కచ్చితంగా అనుగ్రహిస్తాడని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు శివుడికి ఎంతో ప్రీతికరమైన జమ్మిచెట్టు పువ్వులను సమర్పించడం ద్వారా శని యొక్క దుష్ర్పభావాలు మీపై ఉండవు. న్యాయానికి అధిపతి అయిన శని దేవుడు పాప ఫలాలను చూసి చాలా మంది భయపడుతుంటారు. కాబట్టి శివుడిని స్మరిస్తే ఇలాంటి భయమేమీ ఉండదు. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించినా కూడా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు అనారోగ్యం నుండి ఉపశమనం పొందుతారు. అంతేకాదు మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.



Click it and Unblock the Notifications