For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shani Margi 2022: శనిగ్రహం తిరోగమనం నుండి మార్గంలోకి రానున్నాడు.దాంతో ఈ 5 రాశులవారికి కష్టాలు మెుదలు..

శనిగ్రహం తిరోగమనం నుండి మార్గంలోకి రానున్నాడు.దాంతో ఈ 5 రాశులవారికి కష్టాలు మెుదలు..అయితే పరిహారాలు ఉన్నాయి..

|

ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడు నిన్నటి వరకు మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఇవాల్టి నుంచి అంటే అక్టోబరు నుండి ప్రత్యక్ష సంచారంలోకి (Shani Margi in Capricorn 2022) రానున్నాడు. జనవరి 17, 2023 వరకు అదే స్థితిలో ఉంటాడు. అయితే శని యెుక్క ఈ మార్గి 5 రాశులవారికి ప్రతికూలంగా ఉండనుంది. అయితే ఆ దురదృష్ట రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాకుండా శనిదేవుని ఆగ్రహానికి గురికాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Shani Margi 2022: Remedies To Reduce Bad Effects Of Saturn in Telugu,

శనిదేవుని వల్ల కలిగే సమస్యలను తగ్గించుకోవడానికి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. ఈ నివారణలు శని భగవానుడి ప్రతికూల ప్రభావాలను తగ్గించగలవు. మకరరాశిలో ఉన్న శనిదేవుడు ఎదుర్కొనే సమస్యలను తగ్గించుకోవడానికి సహాయపడే పరిహారాలను ఇప్పుడు చూద్దాం.

వృషభం (Taurus):

వృషభం (Taurus):

శని మార్గి వల్ల ఈ రాశివారి కష్టాలు పెరగనున్నాయి. పనిలో అడ్డంకులు ఎదురవుతాయి. ఖర్చులు విపరీతంగా పెరగనున్నాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అననుకూలంగా ఉంటుంది.

కర్కాటకం (Cancer):

కర్కాటకం (Cancer):

శని ప్రత్యక్ష సంచారం కర్కాటక రాశి వారికి జీవితంలో అనేక ఇబ్బందులను కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టాలు ఉండవచ్చు. ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి. ఈసమయంలో మీ మాటలు అదుపులోకి ఉంచుకోండి.

కన్య (Virgo):

కన్య (Virgo):

మార్గి శని కన్యారాశివారికి సమస్యలను సృష్టిస్తుంది. పని పూర్తి కాకపోవడంతో నిరాశకు గురవుతారు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇంట్లో వివాదాలు రావచ్చు.

మకరం (Capricorn):

మకరం (Capricorn):

ఈరాశిలోనే శని ప్రత్యక్ష సంచారం జరుగునుంది. దీంతో ఈ రాశివారిపై శని సడేసతి కొనసాగుతోంది.ఈ వ్యక్తులు మానసిక మరియు శారీరక సమస్యలతో బాధపడవచ్చు. ఖర్చులు పెరుగుతాయి.

కుంభం (Aquarius):

కుంభం (Aquarius):

శని ప్రత్యక్ష సంచారం కుంభ రాశి వారికి ఇబ్బంది కలిగిస్తుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ కెరీర్‌లో అడ్డంకలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఇతరుల వ్యవహారాల్లో అస్సలు జోక్యం చేసుకోకండి, లేకుంటే నష్టం జరగవచ్చు.

పరిహారం # 1

పరిహారం # 1

శని దోషం లేదా శని వల్ల కలిగే చెడులను తగ్గించుకోవడానికి శనివారం నాడు శని స్తోత్రాన్ని పఠించండి. అలాగే శని భగవానుని మనస్సులో ధ్యానించండి. ఇలా చేస్తే శని దోషం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి.

పరిహారం # 2

పరిహారం # 2

శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, శనివారాల్లో మీ ఇంటికి సమీపంలోని ఆలయంలో ఆవాలనూనెతో దీపం వెలిగించి పూజించండి.

పరిహారం # 3

పరిహారం # 3

డబ్బు సమస్యలు ఉన్నవారు శుక్లపక్షంలోని మొదటి శనివారం నాడు 10 బాదంపప్పులను తీసుకుని హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. అక్కడ 5 బాదంపప్పులు పెట్టి, 5 బాదంపప్పులను ఇంటికి తెచ్చి, ఎర్రటి గుడ్డలో కట్టి, ఇంట్లోని డబ్బులు పెట్టే లాకర్ లో ఉంచండి. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు ఎదుర్కొనే డబ్బు సమస్యలు తగ్గుతాయి.

పరిహారం # 4

పరిహారం # 4

శనివారాలలో కోతులకు అన్నం, బెల్లం, అరటిపండు మొదలైనవి ఇవ్వండి. అలాగే ఒక గిన్నెలో ఆవనూనె తీసుకుని, అందులో మీ ముఖాన్ని చూసి, ఆ నూనెను దానం చేయండి. కొబ్బరికాయను నదిలో వేయండి.

పరిహారం # 5

పరిహారం # 5

కరివేపాకులను మెత్తగా రుబ్బి, వాటిని ప్రతి శనివారం చేపలకు తినిపిస్తే శనిదేవుని సమస్యలు తగ్గుతాయి.

పరిహారం # 6

పరిహారం # 6

ప్రతి శనివారం తినడానికి ఆవాల నూనెలో ముంచిన రొట్టెను నల్ల కుక్కకు ఇవ్వండి. అలాగే రాత్రిపూట గోళ్లపై ఆవాల నూనె రాయండి. అలాగే, 7 శనివారాలు నల్లచీమలకు ఆహారం వేయండి.

పరిహారం # 7

పరిహారం # 7

శని దోషాల నుండి బయటపడటానికి, శివ చాలిసాను పఠించండి. అలాగే హనుమాన్‌ని పూజించడం వల్ల శని వల్ల ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి.

పరిహారం # 8

పరిహారం # 8

శని దోషాలు తగ్గడానికి శనివారాల్లో పేదలకు భోజనం పెట్టడం ఉత్తమ పరిహారం. మీ పుట్టినరోజు లేదా మీ జీవితంలో ముఖ్యమైనదిగా భావించే రోజులలో కూడా ఆహారాన్ని దానం చేయండి. దీంతో శనిదేవుడు సంతోషిస్తాడు.

English summary

Shani Margi 2022: Remedies To Reduce Bad Effects Of Saturn in Telugu

Here are some remedies to reduce bad effects of saturn during Shani Margi in Capricorn. Read on to know more...
Story first published:Thursday, October 27, 2022, 16:53 [IST]
Desktop Bottom Promotion