For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షష్ట గ్రహ కూటమి వల్లే కరోనా వంటి మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉందట...!

|

ప్రస్తుత ప్రపంచ పటంలో మన భారతదేశం ఉన్న స్థితిని బట్టి మనది ధనురాశి. గ్రహ సంచారం యొక్క ఫలాల్ని బట్టి దేశ జాతక స్థితి ప్రకారం ఏప్రిల్ నుండి మే వరకు కాల సర్పదోషం ఉందని కొందరు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

దీని వల్ల తీవ్ర నష్టాలు కలుగుతాయని, దీని దశ దాటే వరకు మనం వేచి ఉండటం తప్ప.. దీనికి విరుగుడు కనిపెట్టలేం అన్న కఠోర సత్యాన్ని కుండబద్దలు కొట్టేశారు. అంతవరకు అందరూ తమ ఆరోగ్యాలను తామే కాపాడుకోవాల్సిందేనట. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూ వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి.

ప్రజలెవ్వరూ ఇళ్లలో నుండి బయటకు రావద్దని స్పష్టమైన ఆదేశాలు సైతం ఇచ్చాయి. ''ఈ ఉగాది ఉత్సవాలకు బయటకు రావద్దండి... ఇంట్లోనే పవిత్రమైన భక్తితో జరుపుకోండి'' అని సూచించాయి. మరోవైపు వివాదస్పద, సంచలనాలకు కేరాఫ్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా కరోనా మరియు ఉగాదికి సంబంధించి తనదైన శైలిలో సైటెర్లు వేశారు. ''ఇంట్లో ఉంటే ఉగాది పచ్చడి... బయటికొస్తే ఒళ్లంతా పచ్చడి.. ఇది పోలీసు హెచ్చరిక'' అని తన ట్వీట్ లో తెలిపారు.

ఇది ఇలా ఉంటే తమిళనాడులోని కొందరు జ్యోతిష్య పండితులు ఇప్పటికే కరోనా ప్రభావం తగ్గిపోవడం ప్రారంభమైంది. ఏప్రిల్ నెలలో ఇది ఇంకా తగ్గిపోతుందని.. అందుకు సంబంధించిన గ్రహ సంచారాల వివరాలను వెల్లడించారు.

షష్ట గ్రహ కూటమి అంటే...

షష్ట గ్రహ కూటమి అంటే...

ప్రస్తుత శార్వరి నామ సంవత్సరంలో చాలా మంది ఇప్పటికే షష్ట గ్రహ కూటమి గురించి ఎన్నో విషయాలను వినే ఉంటారు. అసలు ఇంతకీ అది ఏంటంటే.. ఒకే రాశిలో ఆరు గ్రహాలు చేరే దానిని షష్ట గ్రహ కూటమి అంటారు. ధనస్సు రాశిలో సూర్యుడు, బుధుడు, చంద్రుడు, గురుడు, శని, కేతువు వంటి ఆరు గ్రహాలు చేరిపోతాయట.

దుష్ఫలితాలు దానివల్లే..

దుష్ఫలితాలు దానివల్లే..

షష్ట గ్రహ కూటమి ప్రభావం వల్లే కరోనా వంటి దుష్ఫలితాలు ప్రారంభం అయ్యాయని, ఆ గ్రహ కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో.. అప్పుడు కరోనా వైరస్ అనే మహమ్మారి చైనాలో పుట్టిందని, దాని పుట్టుక, వ్యాప్తి క్రమాన్ని జాగ్రత్తగా గమనించాలని కూడా చెబుతున్నారు.

దాదాపు 100 రోజులు..

దాదాపు 100 రోజులు..

మరి కొందరు జ్యోతిష్య పండితులు ఇలా చెబుతున్నారు. ఈ కూటమి ప్రభావం వల్ల దాదాపు 100 నుండి 110 రోజుల వరకు చైనా ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు వాటిల్లబోతుందని, ఇదంతా ఏప్రిల్ రెండో వారానికల్లా సర్దుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.

మకరరాశిలో కుజుడు..

మకరరాశిలో కుజుడు..

''ఈ తెలుగు నూతన సంవత్సరంలోని మార్చి నెలలో 30వ తేదీ నుండి మే మాసం 4వ తేదీ వరకు మకరరాశిలో కుజుడు, శని మరియు గురువు సంచరిస్తారు. ఇలా మకరరాశిలో ఒకేసారి మూడు గ్రహాలు సంచరించడం అనేది 793 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది ఈ సంవత్సరమే జరుగుతోంది. మన పురాణాలలో, గ్రంథాలలో ఈ కలయికను బ్రహ్మహత్యా పాతకదోషంగా వర్ణించారు‘‘ అని పండితులు చెబుతున్నారు.

36 రోజుల పాటు..

36 రోజుల పాటు..

దీని వల్ల దాదాపు 36 రోజుల పాటు ముఖ్యంగా ఆర్థిక రంగంలో, కార్పొరేట్, ప్రైవేట్ కంపెనీలు, బ్యాంకులు, క్రీడా రంగంతో పాటు అనేక రంగాల్లో నష్టాలు ఏర్పడటమే కాకుండా ప్రక్రుతి వైపరీత్యాలు కూడా జరిగే అవకాశం ఉందట. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుందట. ఒక దేశానికో లేదా ఒక ప్రాంతానికో దీని ప్రభావం ఉంటుందని అనుమానించాల్సిన అవసరం లేదట.

మే 18 వరకూ

మే 18 వరకూ

ఈ షష్ట గ్రహ కూటమి ప్రభావం మే 18వ తేదీ వరకు తీవ్రంగానే ఉంటుందని ఇంకొందరు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏప్రిల్ 14 నుండి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

మూడు దశల్లో..

మూడు దశల్లో..

అయితే కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం మొత్తం మూడు దశల్లో ఉంటుందట. ఈ కరోనా ఉపద్రవం మనకు శాశ్వతంగా దూరం కావాలంటే 2022 మార్చి మాసం వరకు నిరీక్షించక తప్పదని పండితులు చెబుతున్నారు.

అదే ఆశిద్దాం...

అదే ఆశిద్దాం...

ఎంతమంది జ్యోతిష్యులు, పండితులు ఏమి చెప్పినా.. ఎన్ని కారణాలు చెప్పినా.. వాటి పరిణామాలు ఎలా ఉన్నా కూడా మరో రెండు నెలల్లో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిపోతుందని ఆశిద్దాం.. అలాంటిదే జరగాలని కోరుకుందాం...

English summary

Shasta graha kutami effects in telugu

Here we talking about shasta graha kutami effects in telugu. Read on