Latest Updates
-
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి..
59 ఏళ్ల తర్వాత అరుదైన ఘటన.. ఇండియాతో సహా ఈ దేశాల్లో పెనుమార్పులు...!
ఆరు గ్రహాలు మకరంలో కలయిక వల్ల ఈ దేశాలలో పెనుమార్పులు వచ్చేస్తాయంట...
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెల పదో తేదీన అరుదైన సంఘటన జరగబోతోంది. అంతరిక్షంలో 59 ఏళ్ల తర్వాత అరుదైన సంయోగం కారణంగా.. ప్రపచంలోని చాలా దేశాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని, జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి వేళ చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ మహా సంయోగం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మకర రాశిలో ఆరు గ్రహాలు నివాసం ఉంటాయి. సాధారణంగా ఓ రాశిచక్రంలో ఐదు రాశులు ఉన్నా.. లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు కలిస్తే దేశంతో పాటు యావత్ ప్రపంచంలోనే భౌగోళిక, రాజకీయ మార్పులు ఉంటాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మార్పు ఎన్నో దశాబ్దాలుగా ఉంది.

సాధారణంగా సూర్యుడు, అంగారకుడు, శని, గురుడు వంటి గ్రహాలు ఒకే రాశిలో ఉంటే యుద్ధం రావడం లేదా భారీ ప్రజాందోళనలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనల గురించి 'మయూర్ చిత్రం' అనే గ్రంథంలో నారదముని రాసినట్లు వెల్లడించారు. ఈ ఆరు గ్రహాల కలయిక జరిగితే ఏమి జరుగుతుందో అనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మకరంలో 7 గ్రహాలు..
గతంలో 1962 ఫిబ్రవరి నెలలో ఏడు గ్రహాలు మకర రాశిలో కలిశాయి. ఇది యాధ్రుచ్ఛికమే అయినా కూడా అగ్ర రాజ్యాలుగా ప్రసిద్ధి గాంచిన సోవియన్ యూనియన్ రష్యా, అమెరికా వంటి దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దీని వల్ల భయంకరమైన యుద్ధాలు జరిగాయి. వీటి ప్రభావంతో ప్రపంచ రాజకీయాలు తారుమారై.. రెండు కూటములుగా ఏర్పడి యుద్ధ భయాలు కమ్ముకున్నాయి.

సింహ రాశిలో 5 గ్రహాలు..
ఆ తర్వాత 1979లో సెప్టెంబరు మాసంలో సింహ రాశిలో ఐదు గ్రహాలు సంయోగం జరిగింది. దీని ఫలితంగా ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవం వల్ల ముస్లిం సమాజంలో కలకలం రేపింది. ఇది ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాద వ్యాప్తికి దారి తీసింది. అంతేకాదు అనేక దశాబ్దాలుగా భారత్ తో సహా యావత్ ప్రపంచం ఈ సమస్యను ఎదుర్కొంది.

2019లో ధనస్సులో..
ఆ తర్వాత 2019వ సంవత్సరంలో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు రాహువు-కేతువు మినహా ఐదు గ్రహాల సంయోగం కలిశాయి. ఫలితంగా విశ్వవ్యాప్తంగా మహమ్మారి ప్రభావానికి గురికావాల్సి వచ్చింది.

ఫిబ్రవరి 10 అర్థరాత్రి..
ప్రస్తుతం ఫిబ్రవరి పదో అర్ధరాత్రి 11, 12వ తేదీల్లో మకర రాశిలోకి సంయోగం చెందనున్న సమయంలో ఆరుగ్రహాల వల్ల మరోసారి దేశంతో పాటు ప్రపంచంలో పెనుమార్పులు సంభవించొచ్చని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఉద్యమం ఊపు పెరగొచ్చు..
ఫిబ్రవరి 12వ తేదీన అమావాస్య జాతకాన్ని అధ్యయనం చేసిన నిపుణులు కొన్ని అభిప్రాయాలను వెల్లడించారు. తులరాశి ప్రాబల్యం వల్ల నాలుగో పాదంలో శని, గురుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, సూర్యుడు కలవనున్నారు. ఫలితంగా రైతుల ఆందోళన తీవ్రం కావొచ్చు. ఆరు గ్రహాల సంయోగం వల్ల రాబోయే రెండు నెలల్లో పెద్ద ఆధ్యాత్మిక విభేదాలు, వివాదస్పద పరిణామాలు కూడా జరగొచ్చు.

ఈ దేశాలు ఇరకాటంలో..!
గ్రహాల సంయోగం వల్ల మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ లు చాలా ఇరకాటంలో పడే అవకాశాలున్నాయి. పాకిస్థాన్ చంద్రుడు రాశి అయిన మిధునంలో 8వ స్థానం కారణంగా విపత్తులు రావచ్చు. చైనా రాశి అయిన మకరంలో శని, గురుడు సహా ఇతర గ్రహాల రవాణా కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడొచ్చు. స్టాక్ మార్కెట్లు కుదేలై పెద్ద దెబ్బ పడొచ్చు. దీని ప్రభావం భారత్ లో కూడా ఉంటుంది.



Click it and Unblock the Notifications