For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Solar and Lunar Eclipse 2021: మే నెలలో తొలి చంద్ర గ్రహణం.. ఈ ఏడాది సూర్య, చంద్ర గ్రహణాలెప్పుడో తెలుసా..

2021లో సూర్య మరియు చంద్ర గ్రహణ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రంలో సూర్య మరియు చంద్ర గ్రహాణాలకు ఎంతో విశిష్టత ఉంది. 2020 కరోనా నామ సంవత్సరంలో డిసెంబర్ 14వ తేదీన చివరి గ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణం మన దేశంలో కనిపించలేదు.

Solar and Lunar Eclipse 2021: Here is the complete list in Telugu

ఇదిలా ఉండగా ఈ గ్రహాణాల వల్ల మనుషుల యొక్క జీవితంపై ఏదో ఒక రూపంలో ప్రభావం చూపుతాయి. దీని ప్రభావం ప్రజలపై మాత్రమే కాదు.. ప్రాంతాలు, దేశాలతో పాటు ప్రపంచంపై కూడా పడనుంది.

Solar and Lunar Eclipse 2021: Here is the complete list in Telugu

అలాంటి సూర్య మరియు చంద్ర గ్రహణాలు 2021 సంవత్సరంలో కూడా సంభవించబోతున్నాయి. ఈ గ్రహణాలు సూర్యుడు మరియు చంద్రుని వేగాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో 2021లో ఎన్ని సూర్య గ్రహణాలు సంభవిస్తాయి..

Solar and Lunar Eclipse 2021: Here is the complete list in Telugu

ఎన్ని చంద్ర గ్రహణాలు రానున్నాయి.. ఏయే మాసంలో ఏ గ్రహణాలు సంభవించనున్నాయి.. ఏయే తేదీలలో ఏ గ్రహణం ఏర్పడనుంది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

నాలుగు గ్రహణాలు..

నాలుగు గ్రహణాలు..

ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. అందులో రెండు సూర్య గ్రహణాలు మరియు రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. ఈ గ్రహణాలు ప్రజలతో పాటు ప్రాంతాలు, దేశాలతో పాటు ప్రపంచంపైనా ప్రభావం చూపనున్నాయి.

తొలి చంద్ర గ్రహణం..

తొలి చంద్ర గ్రహణం..

2021 సంవత్సరంలో మే మాసంలో 26వ తేదీ అంటే బుధవారం రోజున మొదటి చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఈ చంద్ర గ్రహణం అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా పసిఫిక్ మహాసముద్రం ప్రాంతం మరియు భారతదేశంలో కనిపించనుంది. మన దేశంలో పాక్షిక చంద్ర గ్రహణం కాగా.. మిగతా చోట్ల సంపూర్ణ చంద్ర గ్రహణం గా ఉంటుంది.

రెండో చంద్ర గ్రహణం..

రెండో చంద్ర గ్రహణం..

2021 సంవత్సరంలోనే రెండోది మరియు చివరిది అయిన చంద్ర గ్రహణం నవంబర్ 19వ తేదీన ఏర్పడబోతోంది. ఇది కూడా పాక్షిక గ్రహణంగా ఉంటుంది. ఈ గ్రహణం మన దేశంతో పాటు ఉత్తర ఐరోపా, పసిఫిక్ మహాసముద్రం, అమెరికా మరియు ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంది.

తొలి సూర్య గ్రహణం..

తొలి సూర్య గ్రహణం..

ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం జూన్ 10వ తేదీన ఏర్పడబోతోంది. ఇది పాక్షిక సూర్య గ్రహణంగా ఏర్పడుతుంది. ఈ సూర్య గ్రహణం భారతదేశం, ఉత్తర అమెరికా, కెనడా, రష్యా, గ్రీన్లాండ్, యూరప్ మరియు ఆసియాలో ఎక్కువగా కనిపిస్తుంది.

రెండో సూర్య గ్రహణం..

రెండో సూర్య గ్రహణం..

ఈ సంవత్సరంలో రెండోది మరియు చివరిది అయిన సూర్య గ్రహణం డిసెంబర్ 4వ తేదీన సంభవించనుంది. ఇది దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా, అంటార్కిటికా మరియు ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది భారతదేశంలో కనిపించదు.

English summary

Solar and Lunar Eclipse 2021: Here is the complete list in Telugu

Here's is a complete list of upcoming Solar and Lunar Eclipse in the year of 2021, check all details here.
Story first published:Thursday, March 18, 2021, 18:23 [IST]
Desktop Bottom Promotion