For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Solar Eclipse 2021:'Ring of Fire'తొలి సూర్యగ్రహణాన్ని ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు...

జూన్ 10న ఏర్పడే సూర్య గ్రహణాన్ని మన దేశంలో ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

2021 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం జూన్ పదో తేదీన ఏర్పడబోతోంది. జ్యేష్ట మాసం క్రిష్ణ పక్షం అమావాస్య రోజున అంటే గురువారం మధ్యాహ్నం 1:42 గంటలకు సూర్య గ్రహణం ప్రారంభమవుతుంది.

Solar Eclipse 2021: The Ring Of FireComing Up On June 10; How to view Ring of Fire Solar Eclipse in India
తిరిగి సాయంత్రం 6:41 గంటలకు గ్రహణం ముగుస్తుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ సూర్య గ్రహణం మన దేశంలో పాక్షికంగానే కనిపిస్తుంది. అయితే వలయకారంగా ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడిలో 99 శాతం భాగం చంద్రుడు కప్పబడి ఉంటాడు. దీని ఫలితంగానే వలయాకారం ఏర్పడుతుంది.
Solar Eclipse 2021: The Ring Of FireComing Up On June 10; How to view Ring of Fire Solar Eclipse in India

ఈ గ్రహణాన్నే 'Ring of Fire' అని లేదా వార్షిక సూర్యగ్రహణం అని కూడా అంటారు. అంటే రింగు మాదిరిగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీని కంటే ముందు మే 26వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడింది. దీని ప్రభావం కూడా మన దేశంపై పాక్షికంగానే ఉన్నింది. సుమారు పదిహేను రోజుల వ్యవధిలో తొలి సూర్య గ్రహణం ఏర్పడబోతోంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నేపథంలో మొదటి సూర్యగ్రహణం యొక్క ప్రత్యేక ఏమిటి.. దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చూడొచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Solar Eclipse 2021: తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం...!Solar Eclipse 2021: తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం...!

రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటి?

రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటి?

గ్రహణం సమయంలో చంద్రుడు, సూర్యుడు నుండి ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు వలయాకారం(రింగ్ ఆఫ్ ఫైర్) ఏర్పడుతుంది. ఈ కారణంగా అది పూర్తిగా కప్పబడి ఉండదు. చంద్రుడు సూర్యుని కేంద్రాన్ని మాత్రమే కవర్ చేయగలడు. అలాంటి సమయంలో సూర్యుని ఉపరితలం యొక్క కాంతి మాత్రమే భూమికి చేరుకుంటుంది. ఇది రింగ్ ఆఫ్ ఫైర్ లాగా కనిపిస్తుంది. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు.

దీన్ని ఎక్కడ చూడొచ్చు..

దీన్ని ఎక్కడ చూడొచ్చు..

ఈ రింగ్ ఆఫ్ ఫైర్, తొలి సూర్య గ్రహణాన్ని ఈశాన్య అమెరికా మరియు తూర్పు కెనడా ప్రజలు పాక్షికంగా చూడగలరు. ఉత్తర కెనడా, గ్రీన్లాండ్ మరియు రష్యాలోని ప్రజలు రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణాన్ని చూడగలరు. ‘రింగ్ ఆఫ్ ఫైర్' ఉత్తర అంటార్కిటికా మరియు క్యూబెక్ సమీపంలోని ఒక చిన్న ప్రాంతంలో ఇది కనిపిస్తుంది. స్పెయిన్, జర్మనీ, యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్ మరియు స్కాండినేవియాతో సహా ఉత్తర ఐరోపా ప్రజలు కూడా పాక్షిక సూర్య గ్రహణాన్ని చూడగలరు.

భారతదేశంలో రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుందా?

భారతదేశంలో రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుందా?

మన దేశంలో మొదటి సూర్యగ్రహణం ‘రింగ్ ఆఫ్ ఫైర్' యొక్క అద్భుతమైన దృశ్యం కనిపించదు. అయితే మీరు దీన్ని ఆన్ లైన్ వేదికగా చూడొచ్చు. ఇది తూర్పు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ సహా భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కనిపించనుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో కూడా పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. అయితే ఇందులో సుతక్ కాలం చెల్లుబాటు కాదు.

Solar Eclipse 2021: సూర్యగ్రహణం వల్ల ఈ 5 రాశుల వారికి ఇబ్బందులు...!Solar Eclipse 2021: సూర్యగ్రహణం వల్ల ఈ 5 రాశుల వారికి ఇబ్బందులు...!

సూర్య గ్రహణ సమయం..

సూర్య గ్రహణ సమయం..

2021 సంవత్సరంలో జూన్ 10వ తేదీన మధ్యాహ్నం 1:42 నుండి తొలి సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. ఇది సాయంత్రం 6:41 గంటల వరకు కనిపిస్తుంది.

ఇవి చేయకండి..

ఇవి చేయకండి..

మన దేశంలో సూర్య గ్రహణ ప్రభావం కనిపించనప్పటికీ.. జ్యోతిష్య పండితుల ప్రకారం.. గర్భిణులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

- సూర్య గ్రహణం సమయంలో గర్భిణులు ఎలాంటి పదార్థాలు తినడం గానీ.. తాగడం గానీ చేయకండి.

- సూర్య గ్రహణాన్ని మీ కళ్లతో నేరుగా చూడకండి. ఎందుకంటే దీని వల్ల మీ కళ్లు దెబ్బ తినొచ్చు.

- సూర్య గ్రహణం సమయంలో ఎలాంటి పూజలు చేయకండి.

ఎందుకంటే సూర్యుడు దేవుని విగ్రహాలను అపవిత్రం చేస్తాడని చాలా మంది నమ్్ముతారు.

ఇవి చేయండి..

ఇవి చేయండి..

- సూర్య గ్రహణానికి ముందు స్నానం చేయండి.

- సూర్య గ్రహణం సమయంలో సూర్య మంత్రాలు జపించండి.

- సూర్య గ్రహణం సమయంలో ఎవరిపై కోపం పడొద్దు. ప్రశాంతంగా ఉండండి.

- గ్రహణం సమయంలో కత్తెర, కత్తులు వంటి వాటిని అస్సలు వాడకండి.

- సూర్య గ్రహణం సమయంలో ఏదైనా పని చేసే ముందు జ్యోతిష్యులను సంప్రదించండి.

English summary

Solar Eclipse 2021: The 'Ring Of Fire'Coming Up On June 10; How to view Ring of Fire Solar Eclipse in India

The new moon will sweep in front of the sun to create this years first solar eclipse on Thursday, June 10, 2021.
Story first published:Wednesday, June 9, 2021, 11:48 [IST]
Desktop Bottom Promotion