Latest Updates
-
విటమిన్ A, C, K, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ కూర తింటే చలికాలంలో రోగాలన్నీ పరార్! -
బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రవ్వ బన్ అప్పం.. తింటే వదలరు..10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
కీళ్ల నొప్పులు మాయం చేసే 1:4 మ్యాజిక్..ఇలా చేస్తే జీవితంలో మోకాళ్ల నొప్పులు రావు! -
చలికాలంలో ఎముకలను దృఢంగా ఉంచే రాగి మునగాకు రోటీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
టపాసుల నిప్పురవ్వలు పడి చర్మం కాలితే వెంటనే చేయాల్సిన, చేయకూడని పనులివే! -
దీపావళి స్పెషల్..బ్యాచిలర్స్ కూడా సులభంగా వండేలా.. అదిరిపోయే పొల్లాచి చికెన్ బిర్యానీ చేసుకోండిలా.. -
దీపావళి స్పెషల్.. రొటీన్ కు భిన్నంగా నోరూరించే గుంటూరు చికెన్ రోస్ట్.. ఈజీగా చేసుకోండిలా.. -
నువ్వు దేవుడివి సామీ: ఉద్యోగులకు దీపావళి బోనస్ గా 20 లక్షల రూపాయలు ఇచ్చిన వ్యాపారి..వీడియో చూడండి -
డాక్టర్ హెచ్చరిక..సైలెంట్ గా కాలుతాయి కదా అని ఈ 3 టపాసులు పిల్లలకు ఇస్తే పెను ప్రమాదమే! -
ఎముకలను బలపరిచే పోషకాల నిధి.. దీపావళి పండుగ స్పెషల్ గా పెసరపప్పు పాయసం చేయండిలా..
ఇంట్లో నైరుతి మూల వాస్తు చిట్కాలు, దోష నివారణలు
ఇంట్లో నైరుతి మూలలో ఎలాంటి వస్తువులు ఉంచాలి, ఎలాంటి వస్తువులు ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ఇంట్లో కలహాలు రాకుండా, తలపెట్టిన పని విజయవంతం కావాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నైరుతిని సంబంధాలు, భాగస్వామ్యాల మూలగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి మూల భూమి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది. రాహు గ్రహంచే నియంత్రించబడుతుంది. నైరుతి మూలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకత ఉంది.

ఇంట్లో నైరుతి మూలలో ఎలాంటి వస్తువులు ఉంచాలి, ఎలాంటి వస్తువులు ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ఇంట్లో కలహాలు రాకుండా, తలపెట్టిన పని విజయవంతం కావాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువులు పెట్టకూడదు:
నైరుతి మూలకు సంబంధించిన వాస్తు చిట్కాలలో ముఖ్యమైనది నైరుతి మూలలో బరువులు ఉంచకూడదు. అలాగే చిందరవందరగా లేకుండా చూసుకోవాలి. ఇది స్తబ్దత యొక్క భావన. సంబంధాలు మరియు భాగస్వామ్యాల్లో పురోగతి లేకపోవడానికి దారితీస్తుంది. దీనిని పరిష్కరించడానికి ఇంటి నైరుతి మూలను శుభ్రంగా ఉంచుకోవాలి.

ఫౌంటెన్, ఫిష్ ట్యాంక్ ఉంచొద్దు:
నైరుతి మూలలో వాటర్ ఫౌంటెన్, ఫిష్ ట్యాంకుల్లాంటివి ఉంచకూడదు. నీటికి సంబంధించిన ఏ వస్తువులను కూడా నైరుతి మూలలో ఉంచకూడదు. నీరు భావోద్వేగాల మూలకాన్ని సూచిస్తుంది. నైరుతి మూలలో నీటిని ఉంచడం వల్ల అనవసరమైన మానసిక గందరగోళం తలెత్తుతుంది. సంబంధంలో విభేదాలు ఏర్పడతాయి.

వంటగది ఉండకూడదు:
నైరుతి మూలలో వంటగది ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. నైరుతి మూలలో వంటగది ఉండటం వల్ల దంపతుల మధ్య కలహాలు వస్తాయి. మానసిక ప్రశాంతత దూరమవుతుంది. నైరుతి మూలలో వంటగది ఉండాల్సిన పరిస్థితి వస్తే.. ప్రతికూల శక్తిని తటస్థ చేయడానికి వంటగదిలో రాహు యంత్రాన్ని ఉంచాలని శాస్త్రం చెబుతోంది.

బెడ్రూము ఉండకూడదు:
నైరుతి మూలలో బెడ్రూము ఉండటం మంచిది మంచిది కాదు. నైరుతి దిశలో పడకగది ఉండటం వల్ల దంపతుల మధ్య సఖ్యత ఉండదు. తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఏదో ఒక అంశంపై నిరంతరం వాదులాటలూ ఉంటాయి. అందుకే నైరుతి మూలలో పడకగది ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. నైరుతి వైపు బెడ్రూము ఉంచాల్సిన పరిస్థితి ఉంటే ప్రతికూల శక్తిని తటస్థంగా ఉంచేందుకు బెడ్రూములో రాహు యంత్రాన్ని ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ఇంట్లోని నైరుతి మూలలో కాంతి, గాలి చక్కగా ప్రసరించేలా ఉంచాలి. ఇది సానుకూల శక్తిని ప్రోత్సహించడానికి, ఆరోగ్యకరమైన సంబంధాలు, భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంద. నైరుతి మూలలోని శక్తిని మరింత మెరుగుపరచడానికి, ప్రతికూల శక్తి ఇంటి నుండి వెళ్లిపోవడానికి నైరుతి మూలలో రాహు యంత్రాన్ని ఉంచడం మంచిది.
ఇల్లు లేదా భవనం యొక్క నైరుతి మూల భూమి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది. రాహు గ్రహంతో నియంత్రించబడుతుంది. సంబంధాలలో విభేదాలు మరియు సమస్యలను నివారించడానికి ఈ మూలలో వంటగది, బెడ్రూము, వాటర్ ఫౌంటెన్, ఫిష్ ట్యాంక్ లను ఈ మూలలో ఉంచకూడదని గుర్తుంచుకోవాలి. నైరుతి మూలలో రాహు యంత్రాన్ని ఉంచడం వల్ల ఏదైనా ప్రతికూల శక్తిని తటస్థం చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన సంబంధాలు, భాగస్వామ్యాలకు సానుకూల శక్తిని ప్రోత్సహిస్తుంది. ఈ చిట్కాలు, వాస్తు దోష నివారణలతో ఇంట్లో సానుకూల శక్తిని ప్రసరింపజేయవచ్చు. అలాగే ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది.



Click it and Unblock the Notifications
