For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఆచార్య’ చాణక్యుని గురించిన మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు...!

అర్ధ శాస్త్ర పితామహుడు చాణక్యుని గురించిన ఆసక్తికరమైన కథలు

|

భారతదేశంలో ఇప్పటివరకు పుట్టిన అనేకమంది గొప్ప వారిలో రాజనీతిజ్ఞుడుగా, అర్ధ శాస్త్ర పితామహునిగా పేరుగాంచిన 'ఆచార్య’ చాణక్యుడు ముందువరుసలో ఉంటారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. శక్తివంతమైన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తిగా చాణక్యుడు అందరికీ సుపరిచితం. గ్రీకు రాజు “అలెగ్జాండర్ ది గ్రేట్” కూడా మౌర్య సామ్రాజ్య సైన్యానికి భయపడి తన స్వదేశానికి తిరిగి వెళ్ళాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది.

Strange And Interesting Stories About Chanakya

చాణక్యుని జీవిత చరిత్ర గురించిన ప్రామాణిక నివేదికలంటూ ప్రత్యేకంగా లేనప్పటికీ, విశాకదత్తుడు రచించిన “ముద్ర రాక్షస” మరియు అనేకములైన ఇతర కథలు, నాటకాల నుండి సంగ్రహించిన అంశాలను పరిశీలించగా, అంతర్లీనంగా తేలిన విషయం ఏమిటంటే, “చాణక్యుడు ఒక తెలివైన రాజకీయ నాయకుడు”. అతను తన లక్ష్యాన్ని సాధించడానికి సామ, దాన, భేద, దండోపాయాలను (శాంతి, లంచం, విభేదం మరియు శిక్ష) ఉపయోగించటానికి కూడా ఏమాత్రం వెనుకాడలేదని చెప్పబడుతుంది. క్రమంగా 'టిట్ ఫర్ టాట్’ లేదా పంటికి పన్ను, రక్తానికి రక్తం అనే విధానాన్ని ఆయన అనుసరించారని తెలుస్తుంది. అంతేకాకుండా వజ్రం ద్వారానే వజ్రాన్ని కత్తిరించగలమని, అదేవిధంగా ముల్లు ద్వారానే ముల్లును తీయాలని ఆయన బలంగా నమ్మేవాడు.

ఇక్కడ చాణక్యుని గురించి కొన్ని ఆసక్తికరమైన కథలు మనుగడలో ఉన్నాయి: -

మౌర్య చంద్ర గుప్తునిగా చాణక్యుడే పేరు

మౌర్య చంద్ర గుప్తునిగా చాణక్యుడే పేరు

మహా పద్మ నంద రాజు, తన చట్టబద్దమైన వివాహం ద్వారా ఎనిమిది మంది కుమారులను, మురా అనే దాసితో సాన్నిహిత్యం ద్వారా ఒక కుమారుని కలిగి ఉన్నారు. ఆ మురా కుమారుడే చంద్ర గుప్తుడు. ఇతన్ని తర్వాతి కాలంలో మౌర్య చంద్ర గుప్తునిగా చాణక్యుడే పేరు మార్చాడు.

 ఈ నందుల పాలన దౌర్జన్యంగా ఉండేది

ఈ నందుల పాలన దౌర్జన్యంగా ఉండేది

ఈ నందుల పాలన దౌర్జన్యంగా ఉండేది. అంతేకాకుండా, నందుని కుమారులు అహంకారానికి ప్రతిరూపాలుగా ఉండేవారు. వారు అన్నిరకాల సంప్రదాయాలకు, ఆచారాలకు, ముఖ్యంగా బ్రాహ్మణాలకు వ్యతిరేకంగా ఉండేవారు. మహా పద్మ నందుని ఆధునిక హిరణ్య కసిపునిగా అభివర్ణించేవారు. హిరణ్య కశిపుడు ఒక రాక్షస రాజు.

ఒకరోజు నందుడు

ఒకరోజు నందుడు

ఒకరోజు నందుడు నడుస్తూ, హఠాత్తుగా ఆగి నవ్వాడు. ప్యాలెస్లో పనిచేసే పనిమనిషి వ్యతిరేక దిశలో వస్తూ, మహారాజు నవ్వడం చూసి ఆమె కూడా యధాలాపంగా నవ్వింది. నందుడు, ఆమెను ఆపి ఆమె నవ్వడానికి గల కారణం అడిగాడు. కానీ ఆమె భయపడి, అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, కారణం తరువాత చెబుతానని చెప్పి పారిపోయింది.

ఆమె అతనికి సరైన సమాధానం ఇవ్వాలనుకుంది. ఒకవేళ సమాధానం ఇవ్వలేని పక్షంలో అతనిని మన్నించాలని వేడుకోవాలని భావించింది. అందుకోసం, ఆమె అనేక మందిని సంప్రదించింది కూడా; కానీ, ఆమె ప్రయత్నాలేవీ ఫలించలేదు. క్రమంగా, ఆమె జైలులో ఉన్న మంత్రి శకటారుని వద్దకు వెళ్ళగా, అతను ఆమెకు సహాయం చేశాడు. కానీ, ఎలా?

మంత్రి శకటారుని కథ :

మంత్రి శకటారుని కథ :

మొదట శకటారుని కథను చదువుదాం. శకటారుడు మంచి మంత్రి, కానీ అతని భార్య మరియు కొడుకుతో పాటు కొన్ని ఆరోపణల కారణంగా జైలు పాలయ్యాడు. వారికి జైలులో కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే సరఫరా చేయబడిన కారణంగా, అతని భార్య, కొడుకు కొద్దికాలానికే మరణించారు. క్రమంగా అతను ఈ తొమ్మిది మంది నందులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.

సహాయం పొందడానికి వచ్చిన ఆ దాసిని, అతను రెండు సాధారణ ప్రశ్నలు వేశాడు:

అతను నవ్వినప్పుడు మహా పద్మ నందుడు ఏం చూస్తున్నాడు?

అప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు?

రాజు ఒక కాలువ దగ్గర ఉన్నాడని, అతను ఒక పెద్ద చెట్టు వైపు చూస్తున్నాడని ఆ దాసి, శకటారునికి చెప్పింది. వెంటనే శకటారుడు సమాధానం ఊహించి, ఆ పెద్ద చెట్టు యొక్క, చిన్న విత్తనం నీటిలో తేలుతున్నట్లు చూసిన రాజు, ఇంత చిన్న విత్తనం అంత పెద్ద చెట్టును ఎలా ఉత్పత్తి చేస్తుందో ? అని ఆలోచిస్తూ అతను నవ్వాడని సెలవిచ్చాడు.

ఆ సమాధానికి సంతోషించిన ఆమె, మరుసటి రోజు రాజును చూడటానికి వెళ్లి, అతనికి ఈ సమాధానం ఇచ్చింది. ఆమె చెప్పిన సమాధానానికి, మహా పద్మ నందుడు ఆశ్చర్యపోయాడు. కానీ అది ఆ దాసికి స్పురించిన సమాధానం కాదని అతనికి తెలుసు. క్రమంగా, ఆమెకు ఎవరు సహాయం చేశారో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత తన వేగుల ద్వారా, ఆ ముందు రోజు శకటారుని, దాసి కలుసుకున్న విషయాన్ని తెలుసుకున్నాడు మహా పద్మ నందుడు.

క్రమంగా, మహా పద్మ నందుడు శాంతించి, ఆ తెలివైన మంత్రి శకటారుని విడుదల చేసి, ఆచారాల విభాగాధిపతిగా నియమించారు..

ఒక రోజు శకటారుడు,

ఒక రోజు శకటారుడు,

ఒక రోజు శకటారుడు, ఒక గ్రామ రహదారి గుండా నడుచుకుంటూ వెళుతుండగా ఒక వింత కనిపించింది. ఒక బ్రాహ్మణుడు కొంత గడ్డి మీద పుల్లని మజ్జిగ పోస్తున్నాడు. అతను ఆచారాలకు అధిపతిగా ఉన్నందున, ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనుకున్నాడు. క్రమంగా, ఆ చర్య గురించి అడుగగా, ఆ బ్రాహ్మణుడు శకటారునితో మాట్లాడుతూ, ఆ గడ్డిని నాశనం చేయాలని అనుకున్నానని సెలవిచ్చాడు . శకటారుడు, అతని చర్యలో ఒక అంశాన్ని పరిశీలించాడు. క్రమంగా ఈ వ్యక్తి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడని అనుకున్నాడు. వెంటనే అతన్ని పాటలీపుత్రానికి (బీహార్ లోని పాట్నా) తీసుకెళ్ళి తన సేవలను ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఒకరోజు ప్యాలెస్‌లో ఒక వేడుక జరిగింది. కానీ ‘అంత అందంగా కనిపించడం లేదు. అందులో ఈ పేద బ్రాహ్మణునికి ముందు సీటు ఇవ్వబడింది.

మహా పద్మ నందుడు ఆ దర్బారులో అడుగు పెట్టిన వెంటనే

మహా పద్మ నందుడు ఆ దర్బారులో అడుగు పెట్టిన వెంటనే

మహా పద్మ నందుడు ఆ దర్బారులో అడుగు పెట్టిన వెంటనే, ఈ బ్రాహ్మణుడు ముందు వరుసలో ఆశీనుడు కావడం చూశాడు. వెంటనే, అతన్ని అవమానించి బయటకు తరిమాడు. కొన్ని కథల ప్రకారం, అతని కుమారులు ఈ చర్యకు పూనుకున్నారు. ఆ బ్రాహ్మణుడే చాణక్యుడు.

ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయిన చాణక్యుడు ఈ విధంగా ప్రతిజ్ఞ చేసాడు, "నేను ఈ నందులను పూర్తిగా నాశనం చేసేవరకు జుట్టు ముడి వేయను" అని.

క్రమంగా శకటారుడు, చాణక్యుడు ఇద్దరూ కలిసి నందులను నిర్మూలించడానికి అనేక రకాల ప్రణాళికలను రూపొందించారు. కానీ, మహా పద్మ నందునికి రాక్షస అనే పేరుగల గొప్ప విశ్వాసంగల మంత్రి ఉన్నారు. నందులను కాపాడడానికి అతను చేసిన ప్రయత్నాలన్నింటినీ చాణక్యుడు తన తెలివితో ఎదుర్కొన్నాడు. ఒక పనిమనిషి ద్వారా చాణక్యుడు, శకటారుడు తొమ్మిది మంది నందులకు విషపూరిత ఆహారాన్ని ఇవ్వడంతో వారందరూ ఒకేసారి మరణించారు. మరొక కథనం ప్రకారం చంద్ర గుప్తుని చేతనే, ఆ 8 మంది కుమారుల తలలు నరికించాడని చరిత్ర. ఆ తర్వాత, జుట్టు ముడి వేసి ప్రతీకారానికి స్వస్తి పలికాడని కూడా చెప్పబడుతుంది.

చాణక్యుడు పొరుగు రాజ్యాధినేత అయిన పర్వతరాజుతో

చాణక్యుడు పొరుగు రాజ్యాధినేత అయిన పర్వతరాజుతో

కానీ అంతకు ముందే చాణక్యుడు పొరుగు రాజ్యాధినేత అయిన పర్వతరాజుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. క్రమంగా ఆ పర్వత రాజు పాటలీపుత్రాన్ని చేజిక్కించుకుంటే, అతను సగం రాజ్యాన్ని పొందుతాడు, ఆపై మిగిలిన సగం రాజ్యం దాసీ "ముర" కుమారుడైన చంద్రగుప్తునికి చెందుతుంది అని. పర్వత రాజు తన కొడుకు మలయకేతుతో కలిసి దేశంపై దాడి చేసినప్పుడు, పర్వతరాజుని కుయుక్తులతో చంపగా, మలయకేతుడు ప్రాణాలు దక్కించుకుని పారిపోయాడు. ఆ తర్వాతి కాలంలో చాణక్యుడు, శకటారుడు ఇద్దరూ కలిసి చంద్ర గుప్తుని రాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ తరువాత మౌర్య చంద్రగుప్తుడు శక్తివంతమైన మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. అతని మనవడే అశోకుడు.

భారతదేశానికి చాణక్యుడు అందించిన గొప్ప బహుమతి

భారతదేశానికి చాణక్యుడు అందించిన గొప్ప బహుమతి

భారతదేశానికి చాణక్యుడు అందించిన గొప్ప బహుమతి అతని "నీతి శాస్త్రం" (ఉపదేశ సాహిత్యం), అంతేకాకుండా ఎకనామిక్స్(అర్ధశాస్త్రం)పై ప్రపంచంలోనే మొదటి పుస్తకం ‘అర్థ శాస్త్రం' కూడా ఇతని నుండే వచ్చింది. అతని చేత స్థాపించబడ్డ మౌర్య సామ్రాజ్యం, భారతదేశపు అతి పెద్ద సామ్రాజ్యంగా విస్తరించింది. ఇది తమిళ రాజ్యాలను మినహా భారతదేశంలోని అనేక ప్రాంతాలలో విస్తరించింది. క్రమంగా చాణక్యుని మంచి, సమర్థవంతమైన పాలనకు చిహ్నంగా మారింది. అతని విధానం ‘అధర్మాన్ని నాశనం చేయడానికి, ఎటువంటి మార్గాన్నైనా అనుసరించవచ్చు", అని. మరో మాటలో చెప్పాలంటే, మహాభారతానికి చెందిన కృష్ణుడిని పూర్తి స్థాయిలో అనుసరించిన వ్యక్తిగా చాణక్యుడు నిలిచాడు.ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

FAQ's
  • మౌర్య సామ్రాజ్య స్థాపనలో ఎవరు కీలక పాత్ర వహించారు?

    మౌర్య సామ్రాజ్య స్థాపనలో రాజనీతిజ్ణుడు, అర్థశాస్త్ర పితామహుడిగా పిలుచుకునే ‘ఆచార్య’ చాణక్యుడు కీలక పాత్ర వహించాడు. ఈయన వ్యూహాలకు, ప్రణాళికలకు ఎంతటి ప్రత్యర్థులైనా పరారవ్వాల్సిందేనట. ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్ కూడా మౌర్య సామ్రాజ్యాన్ని ఓడించలేక భయపడి పారిపోయాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది.

English summary

Strange And Interesting Stories About Chanakya

The greatest statesman that India has ever produced is Chanakya. He was the man who established the mighty Magadha empire. Even the Greek king Alexander the Great returned to his homeland fearing the army of the Magadha empire. Though we don’t have any authentic report about the life history of Chanakya, we are able to piece together the materials that are available in dramas such as Mudra Rakshasa of Visakadatta and other word of mouth stories. One underlying thread in all these stories is that Chanakya was an astute politician.
Desktop Bottom Promotion