For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Summer Solstice 2022:ఏడాదిలో పొడవైన రోజు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలివే...!

2022లో దీర్ఘకాలిక రోజు ఎప్పుడు, దాని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతిరోజూ సమయం, తేదీ, రోజులు, నెలలు అనేవి సాధారణంగా మారుతూ ఉంటాయి. అదే సమయంలో రుతువులు కూడా ఒకదానికొకటి మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ పగలు మరియు రాత్రి మధ్య ఎంతో తేడా ఉంటుంది.

Summer Solstice 2022: Interesting Facts About The Longest Day Of The Year in Telugu

పగలంతా వెలుగులో నిండిపోతే.. రాత్రి వేళలో పూర్తి చీకటిగా ఉంటుంది. ఇలా ఏడాది పొడవునా అంటే 365 రోజుల పాటు ఉంటుంది. కానీ సంవత్సరం పొడవునా ప్రతిరోజూ ఇలాగే ఉండదట. అన్నిరోజులూ సమానం కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతి సంవత్సరంలో కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు తక్కువగా ఉంటాయట. అందులో కొన్ని సందర్బాల్లో రాత్రులు ఎక్కువగా.. మరికొన్ని సందర్భాల్లో పగలు ఎక్కువ సమయం ఉంటుందట.

Summer Solstice 2022: Interesting Facts About The Longest Day Of The Year in Telugu

ఈ నేపథ్యంలో సంవత్సరంలో ఒక రోజు పగటి పూట ఎక్కువ సమయం మరియు రాత్రి వేళ అతి తక్కువ సమయం నమోదవుతుంది. అలాంటి అనుభవం మనకు ఈ ఏడాది ఇదే నెలలోనే ఎదురుకాబోతోంది. ఈ సంవత్సరంలో జూన్ 21వ తేదీన అంటే మంగళవారం నాడు ఎక్కువ సమయం ఉండే రోజును చూడొచ్చట. అలాగే రాత్రి వేళ తక్కువ సమయం ఉండటాన్ని మనం గమనించొచ్చు. ఈ సందర్భంగా 2022 ఏడాదిలో ఎక్కువ సమయం ఉండే రోజు ఏది? దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పొడవైన రోజు అదే..
ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, సూర్యుడు ఉత్తర అర్థగోళం నుండి ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ వైపునకు భారతదేశం మధ్యలో దాటుతాడు. ఆ రోజున సూర్యకిరణాలు భూమిపై ఎక్కువ సమయం పడటానికి కారణం ఇదే. ఈరోజున సూర్య కాంతి 15 నుండి 16 గంటల వరకు భూమిపై పడుతుంది. అందుకే జూన్ 21వ తేదీన సంవత్సరంలో పొడవైన రోజు కావడానికి కారణం. ఈ దృగ్విషయాన్ని సమ్మర్ అయనాంతం అంటారు.

రెండు సార్లు మాత్రమే..
జూన్ 21వ తేదీన మనిషి యొక్క నీడ కూడా మాయమవుతుందట. వాస్తవానికి సూర్యుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పై ఉన్నప్పుడు నీడ అనేది సాధారణంగా కనిపించదట. ఇది ప్రకృతి యొక్క అద్భుతమైన దృగ్విషయం. అయనాంతం ఒక ఖగోళ సంఘట. ఇది సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. వేసవికాలంలో ఒకసారి సూర్యుడిని ఉత్తర లేదా దక్షిణ ధ్రువం నుండి చూసినప్పుడు సంవత్సరంలో పొడవైన రోజు నమోదు అవుతుంది. ఈరోజున, అంటే జూన్ 21వ తేదీన సూర్యుని కిరణాలు భూమిపై ఎక్కువ కాలం ఉంటాయి. అదే సమయంలో రెండో ఖగోళ సంఘటన డిసెంబర్ 22వ తేదీన జరుగుతుందది. ఈరోజున పగలు తక్కువ సమయం మరియు రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది. ఈరోజున సూర్యకిరణాలు భూమిపై కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. పగలు మరియు రాత్రి వ్యవధిలో గొప్ప వ్యత్యాసం ఉండేది సంవత్సరంలో కేవలం రెండు రోజులే.

ఈ అయనాంతం అనే పదం లాటిన్ పదం 'సోల్' నుండి వచ్చింది. ఇది సంవత్సరానికి రెండుసార్లు సంభవించడాన్ని కూడా వివరిస్తుంది. ఉత్తర అర్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉంది, అయితే దక్షిణ అర్ధగోళం ఈ రోజున అతి తక్కువ పగటి సమయాన్ని చూసింది. ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా వంటి దేశాలలో, ఇది శీతాకాలపు ప్రారంభాన్ని సూచిస్తుంది. భూమి యొక్క దక్షిణ అర్ధగోళంలో నివసించే ప్రజలు దీనిని శీతాకాలపు అయనాంతం అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం, వేసవి కాలంలోని దీర్ఘకాలిక రోజునే అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు ప్రపంచ సంగీత దినోత్సవంతో సమానంగా ఉంటుంది.
వేసవి కాలం నాడు, సూర్యుని వైపు భూమి యొక్క గరిష్ట వంపు 23.44°గా చెప్పబడింది. దక్షిణ అర్ధగోళంలో, వేసవి కాలం డిసెంబర్ 20 నుండి డిసెంబర్ 23 వరకు జరుగుతుంది. ఇది మళ్లీ క్యాలెండర్ యొక్క మార్పుపై ఆధారపడి ఉంటుంది. ఉత్తర అర్ధగోళంలో, దీనిని శీతాకాలపు అయనాంతం అంటారు.

English summary

Summer Solstice 2022: Interesting Facts About The Longest Day Of The Year in Telugu

Here we are talking about the summer solstice 2022: Interesting facts about the longest day of the year in Telugu. Read on
Desktop Bottom Promotion